అందుకే అంత హైడిమాండ్ : ఈ దోమలు రొమాన్స్‌లో సూపర్ యాక్టీవ్!

  • Published By: sreehari ,Published On : January 31, 2020 / 10:41 AM IST
అందుకే అంత హైడిమాండ్ : ఈ దోమలు రొమాన్స్‌లో సూపర్ యాక్టీవ్!

మనుషుల్లో వ్యాధులను వ్యాప్తి చేసే దోమలు ఎప్పటికీ ట్రబుల్ మేకర్లే. ఎన్నో శతాబ్దాలుగా మనుషుల రక్తాన్ని పీల్చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. ఎన్నో యేళ్ల నుంచి దోమకాటుతో ఎంతో మంది మరణించారు. మానవ చరిత్రలో ఇప్పటికీ ఇదొక మిస్టరీగానే ఉండిపోయింది. కొంతమంది పరిశోధకులు మాత్రం.. దోమలే మనుషుల మరణానికి కారణమని, భూభాగంలోని దాదాపు సగానికి పైగా మనుషులను దోమలే చంపేశాయని గట్టిగా వాదిస్తున్నారు. చరిత్రలో జరిగిన అన్ని యుద్ధాల్లో మరణించిన వారి కంటే దోమల కారణంగా మరణించినవారి సంఖ్యే ఎక్కువగా ఉందని మరో వాదన వినిపిస్తోంది. అప్పట్లో చక్రవర్తుల్లో ఒకరైన అలెగ్జాండర్ బేబీలాన్ తన 32వ ఏటానే మలేరియా సోకి మరణించారు. ఈ చిన్న ప్రాణి దోమలు ఎవరిని వదలిపెట్టలేదు. 

మనుషుల్లో మాదిరిగా వీటికి ఎలాంటి వివక్షత ఉండదు. వీటికి అందరూ సమానమే. అందుకే మనిషి, జంతువు అనే తేడా లేకుండా అందరి రక్తాన్ని పీల్చి చంపేస్తుంటాయి. దోమల వ్యాప్తిని వాటిని చంపేందుకు ప్రపంచ దేశాలు ఎన్నో ప్రయత్నాలు చేసినా మిలియన్ల కొద్ది దోమలు పుట్టుకుస్తూనే ఉన్నాయి. దోమల నివారణ కోసం ఎన్ని డ్రగ్స్ తీసుకొచ్చిన ఫలితం తాత్కాలిక ఉపశమనమే కానీ, శాశ్వాత పరిష్కారం చూపలేకపోతున్నాయి.

కానీ, దోమలు మాత్రం తమపై ప్రయోగించిన డ్రగ్స్ ను తట్టుకోనేంత సామర్థ్యాన్ని వృద్ధిచేసుకుంటున్నాయి. దోమలు డ్రగ్ నిరోధక శక్తుల్లా మారిన దోమలను అంతమెందించేందుకు సైంటిస్టులు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. దోమల సంతతి పెరగకుండా నివారించేందుకు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అందులోభాగంగానే సైంటిస్టులు.. ప్రత్యేకమైన కృతిమ దోమలను రూపొందిస్తున్నారు. 

దోమల సంతతికి బ్రేక్ పడినట్టే :
ఈ దోమలు సాధారణ దోమల్లా కాదు.. శృంగారంలో సూపర్ యాక్టీవ్ గా ఉంటాయి. అడవి ఆడ దోమలతో ఇవి శృంగారంలో పాల్గొనేలా ప్రేరేపించడమే సైంటిస్టుల తొలి ఎన్ కౌంటర్ అని చెప్పవచ్చు. దీనివల్ల ఆ దోమలు సంతతికి బ్రేక్ వేయొచ్చునని తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ పరిశోధనకు సంబంధించి లేటెస్ట్ ఎడిషన్ జనరల్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో ప్రచురించారు. ఈ సెక్సీ దోమల టెక్నిక్ తో వ్యవసాయ రంగంలో పంటలకు తీవ్ర నష్టం కలిగించే హానికరమైన కీటకాలు, పురుగులను నివారించడంలో సైంటిస్టులు సక్సెస్ సాధించారు. కొన్ని దోమలపై కూడా సైంటిస్టులు చేసిన ప్రయోగంలో సానుకూల ఫలితాలు వెల్లడయ్యాయి.

ఇప్పడు వీటికి ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటివరకూ మనుషులను కుట్టేందుకు ఆసక్తిచూపిన దోమలన్నీ ఇకపై నుంచి శృంగారంపై మెగ్గుచూపనున్నాయి. వాటిలో లైంగిక వాంఛను రేకిత్తించేలా శాస్త్రవేత్తలు ప్రేరేపిస్తున్నారు. ఫలితంగా వంద్యత్వం కలిగిన ఈ మగ దోమలతో కలిసినప్పటికీ కుట్టే దోమల్లో సంతానోత్పత్తి జరగదు. ఫలితంగా దోమల సంతతి క్రమంగా తగ్గిపోయి అంతరించిపోతాయి. అంతేకాదు.. మలేరియా, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా నివారించినట్టు అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.