వాసన, రుచి కోల్పోయారా? సాధారణ జలుబా? కరోనా సోకిందా? ఎలా గుర్తించాలి?

  • Published By: sreehari ,Published On : August 19, 2020 / 06:45 PM IST
వాసన, రుచి కోల్పోయారా? సాధారణ జలుబా? కరోనా సోకిందా? ఎలా గుర్తించాలి?

కరోనా వైరస్ సోకినవారిలో రుచి తెలియదు.. వాసన కోల్పవడం వంటి లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా కరోనా లక్షణాల్లో మొదటి లక్షణాల్లో ఒకటిగా చెప్పవచ్చు. చాలామందిలో వైరస్ నుంచి కోలుకున్న కొన్ని వారాలకే వారిలో రుచి, వాసన తిరిగి పొందే అవకాశం ఉంటుంది. కానీ, రుచి, వాసన సుదీర్ఘకాలం పాటు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

వాసన, రుచి తెలియడం లేదా? కరోనా సోకిందేమనని భయపడిపోతున్నారా? కరోనా లక్షణమా? లేదా సాధారణ జలుబా? తెలియక ఆందోళన చెందుతుంటారు. కరోనా లక్షణాలు కూడా సాధారణ ఫ్లూ లక్షణాల మాదిరిగానే ఉండటంతో ఏం కొంచెం జలుబు చేసినా అమ్మో కరోనా అంటూ భయాందోళన ఎక్కువగా కనిపిస్తుంటుంది..



కరోనా వైరస్ లక్షణాల్లో మే నెలలో రుచి, వాసన కూడా ఒక లక్షణంగా చేర్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.. కోవిడ్ -19కి ఇతర శ్వాసకోశ అనారోగ్యాలు కూడా కారణమవుతాయి.. జలుబు లేదా ఫ్లూ వచ్చినా ఇదే తరహా లక్షణాలు కనిపిస్తాయా లేదా అని నిపుణులు అధ్యయనం చేయాల్సి వచ్చింది.

కానీ ఇప్పుడు సైంటిస్టులు ఈ రెండింటి మధ్య పూర్తి వ్యత్యాసం ఉందని కనుగొన్నారు. కరోనావైరస్‌తో సంబంధం కలిగిన ఈ లక్షణాన్ని వైద్యపరంగా అనోస్మియా అని పిలుస్తారు.. అంటే.. వాసన కోల్పోవడం అని పరిశోధకుల
బృందం పేర్కొంది. తూర్పు ఆంగ్లియా యూనివర్శిటీతో సహా యూరప్‌లోని నిపుణులు, కోవిడ్ -19 సోకిన వ్యక్తుల్లో రుచి, వాసన కోల్పోయిన అనుభవాలను ఇతర శ్వాసకోశ సమస్యలతో పోల్చారు.

చేదు తీపి :
సాధారణ ఫ్లూ లక్షణాలా? లేదా కరోనా లక్షణమా? అనేది గుర్తించేందుకు 30 మందితో చిన్న అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో సాధారణ జలుబు లేదా ఫ్లూ మాదిరిగా కాకుండా, కోవిడ్ -19 సోకినవారు చేదు లేదా తీపి రుచిని కోల్పోయారని కనుగొన్నారు.



కోవిడ్ -19 సోకిన వారిని గుర్తించడానికి వేగంగా స్క్రీనింగ్ చేయాల్సి ఉంటుంది. వాసన, రుచి టెస్టులను పరీక్షించాలి. ఎందుకంటే కోవిడ్ -19 రోగులు సాధారణ జలుబు లేదా ఫ్లూ ఉన్న వ్యక్తుల మధ్య తేడాలను గుర్తించాల్సి ఉంటుంది.. వారిలో వాసన, రుచి పరీక్షలు చేశారు.

ఈ బృందం 10 మంది కరోనా రోగులు, జలుబుతో బాధపడుతున్న 10 మంది ఆరోగ్యకరమైన వ్యక్తులపై వాసన, రుచి టెస్టులను నిర్వహించింది. కోవిడ్ -19 రోగులలో వాసన కోల్పోవడం చాలా ఎక్కువగా ఉందని గుర్తించారు. చేదు లేదా తీపి రుచిని గుర్తించలేకపోయారు. ప్రొఫెసర్ ఫిల్పాట్ ప్రకారం, కోవిడ్ -19 మెదడు, కేంద్ర నాడీ వ్యవస్థకు సోకుతుందని కూడా గుర్తించారు.



ప్రత్యేక పరిశోధన :
మరొక అధ్యయనం ప్రకారం.. వాసనకు కారణమయ్యే ముక్కు ప్రాంతంలో యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ II (Ace-2) అని పిలిచే ప్రోటీన్ అధిక స్థాయిని సూచిస్తుంది. కోవిడ్ -19 రోగుల్లో వైరస్ శరీర కణాలలోకి ప్రవేశించడానికి కారణమవుతుంది.. దీన్ని ఎంట్రీ పాయింట్ Ace-2గా భావిస్తారు. అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ నిపుణులతో కూడిన సైంటిస్టుల బృందం, సైనస్ సమస్యలు ఉన్న 23 మంది రోగుల ముక్కు వెనుక నుండి కణజాల శాంపిల్స్ పరీక్షించింది. కానీ, కోవిడ్ -19 వ్యాధి లేదు.

ఏడుగురు రోగుల నుంచి విండ్ పైప్ నుంచి బయాప్సీలను కూడా అధ్యయనం చేశారు. ముక్కులోని ఇతర కణజాలాలతో విండ్‌పైప్‌లో పోల్చినప్పుడు,
ఎపిథీలియం లైనింగ్ కణాలపై Ace-2 స్థాయిలు 200 నుంచి 700 రెట్లు అధికంగా ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు.