ఎంతకాలం వాడితే ఫలితం : స్కిన్ కేర్ క్రీమ్స్ పనిచేస్తాయా?

  • Published By: sreehari ,Published On : December 12, 2019 / 02:06 PM IST
ఎంతకాలం వాడితే ఫలితం : స్కిన్ కేర్ క్రీమ్స్ పనిచేస్తాయా?

బ్యూటీ కేర్ ప్రొడక్టులు వాడుతున్నారా? ఎంతకాలంగా వాడుతున్నారు. ఎన్ని క్రీములు మార్చారు. అసలు స్కిన్ కేర్ ప్రొడక్టులు పనిచేస్తాయా? కాస్మటిక్ క్రీమ్స్ మీ చర్మానికి నప్పేలా ఉంటాయా? అంటే అది వాడితేగానీ దాని ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి.

చాలామంది తమ చర్మతత్వాన్ని బట్టి క్రీములు, లోషన్లను తెగ రాస్తుంటారు. మరికొందరు అయితే.. మార్కెట్లలోకి వచ్చిన ప్రతి స్కీన్ కేర్ ప్రొడక్టులను వాడుతుంటారు. వీటి కారణంగా వచ్చే ఫలితమేమో కానీ, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి చర్మతత్వం కలిగినవారికి అయిన సరే.. లోషన్ లేదా క్రీమ్ వాడగానే రాత్రికి రాత్రే రిజల్ట్స్ కనిపించవు.

28 రోజులు ఆగాల్సిందే.. :
కొంతమంది నెల రోజుల సమయం పడితే మరికొందరికి మరిన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంటుంది. బ్యూటీ కేర్ క్రీములు, లోషన్లు వాడేవారిలో కొంతమంది ఎక్కువ కాలం కొనసాగించరు. కొంతకాలం వాడేసి రిజల్ట్స్ రాలేదని ఆ క్రీమ్ రాయడం ఆపేస్తుంటారు. మరో రకమైన ప్రొడక్టును మారుస్తూ వాడుతుంటారు.

బ్యూటీ కేర్ ప్రొడక్టులు వాడుతున్నంత కాలం వాటి పనితీరు ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో కచ్చితంగా చెప్పలేం. ప్రస్తుతం మార్కెట్లలో ఎన్నో రకాల బ్యూటీ కేర్ ప్రొడక్టులు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఏదైనా బ్యూటీకేర్ వాడితే.. స్కిన్ సెల్స్ లో మార్పు రావాలంటే కనీసం 28 రోజుల సమయం పడుతుంది.

ఒక నెల పాటు వాడితే :
ఒక నెల పాటు వాడితే తప్ప ఆయా ప్రొడక్టు ఫలితం ఏంటో తెలుసుకోవచ్చు. శీతాకాలంలో చర్మ సంరక్షణ కోసం వాడేవాటిలో ఎన్నో రకాల బ్యూటీ కేర్ ప్రొడక్టులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏ ప్రొడక్టు.. ఎంతకాలం వాడాలి.. ఎన్ని రోజుల్లో రిజల్ట్స్ కనిపిస్తుందో తెలియాలంటే క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుందని అంటున్నారు నిపుణులు.

ఒక్కో స్కిన్ కేర్ ప్రొడక్టుకు ఒక్కో వెయిటింగ్ పిరియడ్ ఉంటుంది. అప్పటివరకూ ఆ లోషన్ లేదా క్రీమ్ వాడుతూనే ఉండాలి. అప్పుడే మీరు అనుకున్న రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏయే స్కిన్ కేర్ ప్రొడక్టులను ఎంతకాలం వాడాలో చూద్దాం..

Cleanser (30 రోజులు) :
నిజానికి.. Cleanser స్కిన్.. రోజులో ఎన్నిసార్లు చర్మంపై రాసినా ఎక్కువ సమయం నిలవదు. ఎందుకంటే.. ఈ క్రీమ్ కేవలం చర్మాన్ని శుభ్రపరచడానికి మాత్రమే పనిచేస్తుంది. ఒకవేళ ముఖం శుభ్రం చేయక మృతకణాలతో పేరుకుపోయి పొడి చర్మంతో కాంతీవిహీనంగా ఉండి ఉంటే అలాంటి వారికి మంచి ఫలితం రావాలంటే నెల సమయం పడుతుంది. ఆ తర్వాతే మెల్లగా మీ ముఖంలో మార్పును గమనిస్తారు.

ముడతలకు Serum (6 నుంచి 8 వారాలు) :
చర్మంపై ముడతలతో బాధపడుతున్నారా? అయితే ఇదిగో Serum క్రీమ్ వాడండి. ముడతలకు చెక్ పెట్టాలంటే బాటిళ్ల కొద్ది లోషన్లు వాడాల్సిందేనా? అంటే.. కచ్చితమైన ఫలితం కనిపించాలంటే తప్పదు. మీరు ఆశించిన ఫలితం అంత తొందరగా రాదు. మీరు వాడే ప్రొడక్టు ఫార్మూలా ఆధారంగా ఫలితం ఉంటుంది. సీరమ్ లోషన్ వాడితే.. సాధారణంగా క్రమం తప్పకుండా 6 వారాల నుంచి 8 వారాల పాటు వాడాలి. ఆ తర్వాత ఆశించిన ఫలితం కనిపించే అవకాశం ఉంటుంది.

రెటినోల్, రెటినోయిడ్స్ (10 వారాలు) :
మీ చర్మానికి ఇవొక బెస్ట్ ఫ్రెండ్స్ గా చెప్పవచ్చు. ముఖంపై ముటిమలను తగ్గించడంలో వీటికి సాటి లేదు. ఎర్రగా ఉండి భయానకమైన మెటిమలను తగ్గించడమే కాదు.. వృద్ధచాయలను కూడా తరిమికొట్టేస్తుంది. ఫలితం కూడా ఎక్కువ కాలం పట్టదు. తొలివారంలోనే మంచి ఫలితాలను చూస్తారు కూడా. రెటినోల్స్ ద్వారా రెండు నెలల తర్వాత చర్మం సున్నితంగా ఎంతో మృదువుగా తయారువుతుంది. డెర్మలాజిస్ట్ సలహాతో తీసుకునే రెటినోయిడ్స్ ద్వారా ఫలితం తొందరగా వస్తుంది. నాలుగు వారాల్లోనే యువ్వన చర్మంగా మారిపోతుంది.

Eye Cream (6 వారాల నుంచి 8 వారాలు) :
మీ శరీరంలోని ఇతర భాగాల్లో కంటే కళ్ల కింద ఉండే చర్మం చాలా సున్నితంగా ఉందా? అయితే మీ కళ్ల కింద ముడతలు, ఉబ్బిన కనురెప్పలు, పొడిబారడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని నిర్దిష్ట కంటి క్రీములతో హైడ్రేట్ అయిన చర్మాన్ని తిరిగి రీహైడ్రేట్ చేయొచ్చు.

కానీ, వైద్యుని సలహాతో తీసుకోవడం మంచిది. లేదంటే సమస్య మరింత తీవ్రంగా మారుతుంది. వైద్యుడి సలహాతో తీసుకునే క్రీమ్స్ ద్వారా కంటి కింద నల్లటి చారలు లేదా ముడతలను శాశ్వతంగా తగ్గించవచ్చు. ఏదైనా కంటి క్రీమ్ 8 వారాల పాటు వాడితే మాత్రం కంటి చర్మం కింద తేమ కనిపించదు. ప్రొడక్టు బట్టి దాని సమయం.. ఫలితం ఆధారపడి ఉంటుంది.