కరోనా వైరస్‌కు మన దగ్గరున్న మందుల స్టాక్ సరిపోతుందా?

  • Published By: sreehari ,Published On : March 4, 2020 / 10:36 AM IST
కరోనా వైరస్‌కు మన దగ్గరున్న మందుల స్టాక్ సరిపోతుందా?

ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్.. భారత్‌నూ వణికిస్తోంది. కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకీ వేగంగా పెరిగిపోతోంది. దేశంలో ఇప్పటివరకూ 28 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తిపై ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన చర్యలను చేపట్టింది. ప్రాణాంతక వైరస్ ను అదుపు చేసేందుకు విస్తృత స్థాయిలో ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. కరోనా వైరస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి మందు లేదనే విషయం అందరికి తెలిసిందే.

కానీ, కరోనా వైరస్ ప్రభావాన్ని కొంతమేరకు ఉపశమనం కలిగించేందుకు మాత్రమే మందులు అందుబాటులో ఉన్నాయి. పూర్తి స్థాయిలో వైరస్ ను నిరోధించే మందులు లేవు. యాంటీబయాటిక్స్ కరోనా వైరస్ లపై ఎంతమాత్రం పనిచేయవు. నివారణ చర్యలు ఒక్కటే మార్గమని అధికారులు కూడా సూచిస్తున్నారు. కరోనా వైరస్ బాధితులకు అవసరమైన మందులు భారతదేశంలో ఉన్నాయా? డ్రగ్స్ కొరత ఉందా? అనేదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

భారత్‌లో మందుల కొరత లేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కమిటీ ఒక నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం యాక్టీవ్ పార్మాస్యుటికల్ ఇన్ గ్రీడియంట్స్ (APIs) ఫుల్ స్టాక్ ఉన్నట్టుగా కమిటీ నివేదిక తెలిపింది. మందుల తయారీ సూత్రీకరణ ప్రకారం.. 2 నుంచి 3 నెలల వరకు తగినంతగా ఉన్నట్టు చెబుతున్నారు. మంగళవారం పార్మాస్యుటికల్ డిపార్ట్ మెంట్ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో దేశీయ 26 API ఔషధాలు, ఫార్మాల్యేషన్స్‌లో యాంటిబయాటిక్స్, విటమిన్స్, హార్మోన్లకు సంబంధించిన మందుల ఎగుమతులపై భారత్ ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. చైనాలోని హుబేయ్ ప్రావిన్స్ కు తాళం వేయడం కారణంగా భారత్‌లో మందులకు ఎలాంటి కొరత ఉండే అవకాశం లేదని ప్రభుత్వం నొక్కి చెబుతోంది. కరోనా వైరస్ పుట్టుకు కేంద్రబిందువైన ఈ ప్రాంతంలో API ఔషధా పదార్థాలకు ప్రధాన వనరుగా చెప్పవచ్చు.(కరోనా ఎఫెక్ట్ : హైదరాబాద్ మెట్రో ట్రైన్స్‌లో క్రిమిసంహార మందులు స్ప్రే)

2018-19లో భారత్ నుంచి చైనాకు దిగుమతి అయిన బల్క్ డ్రగ్స్, మధ్యంతర ఔషధాలు 67.56 శాతంతో కలిపి మొత్తంగా 2.405.42 మిలియన్ల డాలర్లుగా నమోదు అయినట్టు లేటెస్ట్ డేటా తెలిపింది. API, ఫార్మాల్యుయేషన్స్ తగినంతగా సరఫరా చేసేందుకు ప్రభుత్వం కూడా అవసరమైన చర్యలు చేపడుతోంది. ప్రస్తుత దేశ మార్కెట్లో తగినంత ధరకే మందులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది. బ్లాక్ మార్కెటింగ్, అక్రమ మందులు నిల్వలు ఆర్టిపిషీయల్ షార్టేజీలను క్రియేట్ చేయకుండా అడ్డుకునేలా చర్యలు చేపడుతోంది.

చైనా నుంచి API దిగుమతులపై భారత్ ఎలాంటి ఆంక్షలు విధించలేదు. చాలా చైనీస్ కంపెనీలు తమ వద్ద తయారుచేసిన ఫార్మాసెట్యుకల్ ఇన్ గ్రీడియంట్స్ (హుబేయ్ ప్రావిన్స్ మినహా) అన్ని ప్రాంతాల నుంచి భారత్ డ్రగ్స్ దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు దీనికి సంబంధించి కార్యకలాపాలన్నీ పాక్షికంగా మొదలయ్యాయి. మార్చి ఆఖరులోగా పూర్తి స్థాయిలో నడిచే అవకాశాలు ఉన్నాయి. భారత్ కు మందులను ఎగుమతి చేసేందుకు చైనీస్ కంపెనీలు సంసిద్ధంగా ఉన్నాయి. లాజిస్టిక్స్ సెక్టర్ లో ఇప్పటివరకూ పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు’ అని ప్రభుత్వ నివేదిక తెలిపింది.