Keto Dietతో బరువు తగ్గాలా? ఈ తప్పులు చేయొద్దు జాగ్రత్త! 

  • Published By: sreehari ,Published On : January 7, 2020 / 01:25 PM IST
Keto Dietతో బరువు తగ్గాలా? ఈ తప్పులు చేయొద్దు జాగ్రత్త! 

పాపులర్ Keto Diet.. గురించి ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. ఒంట్లో పేరుకుపోయిన కొవ్వును ఇట్టే కరిగించగలదని విశ్వసిస్తారు. చాలామంది ఇదే డైట్ గుడ్డిగా ఫాలోయి పోతుంటారు. నిజానికి కిటో డైట్ ఆరోగ్యానికి ఎంతవరకు మేలు చేస్తుంది? శరీరంలో కొవ్వును కరిగిస్తుందా? లేని ఆరోగ్య సమస్యలన్నీ వస్తాయా? ఇలా ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

తక్కువ మోతాదులో కార్బొహైడ్రేట్లు, కిటోన్స్, ప్రోటీన్లు, హైప్యాట్ డైట్ ద్వారా ఈజీగా Loss Weight బరువు తగ్గించుకోవచ్చునని చాలామంది చెబుతుంటారు. కానీ, ఈ డైట్ అంతా చెత్త డైట్ మరెక్కడా లేదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వరుసగా మూడో ఏడాదిలో కూడా యానివల్ యూఎస్ న్యూస్, వరల్డ్ రిపోర్ట్ ఈ డైట్‌పై అత్యంత చెత్త డైటులను ఫాలోయ్యే వాటిలో ఇదొకటిగా వెల్లడించాయి. మెడికల్ జనరల్స్, ప్రభుత్వ డేటా, హెల్త్ ప్యానెల్, న్యూట్రిషియన్ నిపుణులతో కూడిన బృందం కిటో డైట్ కు చెత్త ర్యాంకును ప్రకటించాయి.

కిటో డైట్.. ఏం తీసుకోవాలి? :
2018 నుంచి కొనసాగుతున్న ఈ రివ్యూ ప్రక్రియలో కిటో డైట్ దిగువ స్థాయికి పడిపోయింది. ఇంతకీ ఈ కిటో డైట్ ను అందరూ ఫాలో కావడం కొనసాగించాలా? అధిక మోతుదులో ఉండే ప్రొటీన్లతో కూడిన డైట్ మాత్రమే చేయాలా? ఇలా చేస్తూ పోతే కార్బోహైడ్రేట్ల శాతం తగ్గిపోయి శారీరకంగా అనారోగ్యానికి గురయ్యే ముప్పు ఉందని చెబుతున్నారు. carbohydrates లేని డైట్ తీసుకోవడంతో శరీరంలోని ketosisతో Fatను కరిగిస్తుంది. ఎలాంటి ఉపవాసం (పస్తులు లేకుండా) అవసరం లేకుండానే ఈజీగా కొవ్వును కరిగించేస్తుంది. కిటోన్లు మారాలంటే ముందుగా శరీరంలోని ప్యాట్ నుంచి క్యాలరీలను పొందాలి. ప్రొటీన్లను మితంగా తీసుకోవడంతో పాటు కొద్ది మొత్తంలో రోజుకు కార్బోహైడ్రేట్లను తీసుకోవాల్సి ఉంటుంది.

How to loss weight with Ketogenic Diet, You Should Avoid these Biggest Mistakes  

ఫలితంగా మూర్ఛతో బాధపడుతున్న పిల్లలకు, డయాబెటిస్ ఉన్నవారికి ఈ విధమైన ఆహారం ఎంతో సహకరిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. carbohydrates లేకపోవడంతో కొవ్వును కరిగించి శరీరం శక్తిగా వినియోగించుకుంటుంది. తద్వారా అతి తొందరగా బరువు తగ్గే అవకాశం ఉంది. Ketogenic Diet లో భాగంగా వెన్న, చీజ్, క్రీమ్ తమ డైట్ గా తీసుకోవాలి. అంతేకాదు.. పంది మాంసం, అవోకాడో, ఉడుకబెట్టిన గుడ్లు, దోసకాయ, స్మూతీ, చేపలు, సాదా పెరుగు కూడా కీటో డైట్ లో తీసుకోవచ్చు. కిటో డైట్ కొనసాగించే క్రమంలో కొన్ని తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు..

డైట్ ప్లాన్.. ఆకస్మాత్తుగా మార్చొద్దు :
ఆకస్మాత్తుగా మీ డైట్ మార్చేస్తే.. శరీరం తట్టుకోలేదు. వెంటనే శారీరక సమస్యలు ఎదురవుతాయి. డేంజరస్ గా ఉంటుంది. కిటో డైట్ ను ఒకటి నుంచి రెండు రోజుల్లోగా మార్చుకోవాల్సి ఉంటుంది. లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవు. బాడీ మెకానిజం మీరు పాటించే డైట్ కు తగినట్టుగా మారేందుకు కాస్త సమయం పడుతుంది. అందుకే నెమ్మదిగా డైట్ మార్చుకోవాల్సి ఉంటుంది.

శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచాలి :
కిటో డైట్ పాటించే సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన ప్రధాన నియమం.. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం. ఎందుకంటే.. మీ శరీరంలోని కొవ్వును తన శక్తి కోసం కరిగిస్తుంది. ఈ క్రమంలో ఎక్కువ శాతంలో నీరు అవసరం ఉంటుంది. లేదంటే మీ బాడీ metabolism నెమ్మదించి బరువు తగ్గలేరు. డైట్ లో అతి ముఖ్యమైన అంశం.. నీళ్లు ఎక్కువగా తీసుకోవడం.. నీళ్లు తాగడం ద్వారా పోషకాలు అందడమే కాకుండా శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపేయడంతో పాటు అతి తొందరగా కొవ్వును కరిగించేందుకు సాయపడుతుంది.

డెయిరీ ప్రొడక్టులను అతిగా తినొద్దు:
dairy productల్లో తక్కువ శాతం కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఎక్కువ మోతాదులో high-fat  ఉంటుంది. చీజ్ వంటి డెయిరీ ప్రొడక్టులను తినేవారంతా ఎక్కువగా తీసుకోకూడదు. లేదంటే అది మీ డైట్ ప్లాన్ పై ప్రభావం పడుతుంది. పరిమితికి మించి కూడా పాల ఉత్పత్తులను తీసుకోకపోవడమే మంచిది. కొన్ని డెయిరీ ప్రొడక్టుల్లో షుగర్ కూడా ఉంటుంది. దీంతో న్యూట్రీషియన్ స్థాయి ఎంత ఉందో ముందుగానే చెక్ చేసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు.

కిటోజెనిక్ డైట్ ప్రారంభించే వారు ముందుగా వైద్యున్ని సంప్రదించడం ఉత్తమం. ప్రత్యేకించి type 1 diabetes పేషెంట్లు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కిటోజెనిక్ డైట్ లేదా సాధారణ డైట్ ఏది ఫాలో అయినా తప్పనిసరిగా వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి. ఎందుకంటే.. ప్రతిఒక్కరి శరీరం పనితీరులో చాలా వ్యత్యాసం ఉంటుంది. మీ శరీర తత్వాన్ని బట్టి మీరు డైట్ పాటించాల్సి ఉంటుంది. వైద్యుని సలహాతోనే డైట్ పాటిస్తే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.