Summer Heat: వేసవిలో వేడిని తట్టుకునేందుకు తీసుకోవాల్సిన ఐదు ఆహారాలు.

ఎండలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఏప్రిల్ నెల ప్రారంభం నుంచే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఎండల తీవ్రతకు ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఇక ఈ సమయంలోనే చాలామందికి శరీరంలో వేడి పెరుగుతుంది.

Summer Heat: వేసవిలో వేడిని తట్టుకునేందుకు తీసుకోవాల్సిన ఐదు ఆహారాలు.

Summer Heat

Summer Heat: ఎండలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఏప్రిల్ నెల ప్రారంభం నుంచే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఎండల తీవ్రతకు ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఇక ఈ సమయంలోనే చాలామందికి శరీరంలో వేడి పెరుగుతుంది. దీని వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వేడివలన చర్మం పొడిబారి పొక్కులుగా లేచిపోతుంటుంది.

పెదవులు కూడా పగులుతుంటాయి. ముక్కుల్లోంచి వేడిగాలి వస్తుంటుంది. ఇలాంటి సమయంలో శరీరంలోని వేడిని తగ్గించుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి.. నీటిని ఎక్కువ తాగుతూ ఉండాలి.. చలువచేసే పదార్దాలను రోజు తినడం వలన భానుడి తాపం నుంచి రక్షించుకోవచ్చు.

వేసవిలో ఎటువంటి పదార్ధాలు తీసుకుంటే శరీరంలో వేడి తగ్గుతుంది.

వాటర్ శాతం అధికంగా ఉన్న పండ్లను తింటే శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు.. వాటర్ శాతం అధికంగా పుచ్చకాయలో ఉంటుంది. రోజు 100 నుంచి 150 గ్రాముల పుచ్చముక్కలు తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది. ఇది మన శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. అదీగాక లైకోపీన్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బీ6 ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తూ శరీరంలోని నీరు ఇంకిపోకుండా కాపాడుతుంది

దోసకాయ

దోసకాయ.. దీనిని చాలామంది కూర చేసుకొని తింటారు. దోసకాయలో 85 శాతం నీరు ఉంటుంది. దీనిని తినడం వలన శరీరం వేడి చెయ్యదు. దోసకాయ ముక్కలకు నిమ్మరసం ఉప్పు కలుపుకొని తింటే శరీరంలోని వేడి బయటకు వెళ్ళిపోతుంది. శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో దోసకాయ ప్రముఖ పాత్ర వహిస్తుంది.

సెలెరీ

నీటిశాతం అధికంగా ఉండే కూరగాయల్లో సెలెరీ కూడా ఒకటి.. దీనిని జ్యూస్ లాగా చేసుకొని తాగితే చాలా మంచిది. శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గించేందుకు ఇది బాగా పనిచేస్తుంది. వేసవిలో ఇవి విరివిగా మార్కెట్లో లభిస్తాయి.

పెరుగు

చాలామంది వేసవి వచ్చింది అంటే లీటర్లకు లీటర్లు మజ్జిగ తాగుతారు. కొన్ని కూరల్లో పెరుగు వాడతారు.. పెరుగు ఎముకలు గట్టిపడటానికి దోహదపడుతుంది. వేసవిలో పెరుగును మించిన ఆహారం లేదని పెద్దలు చెబుతుంటారు. పెరుగును మజ్జిగల చిలుక్కోని అందులో ఉప్పు వేసుకొని తాగుతుంటారు. ఇక వేడి ఎక్కువగా చేస్తే మజ్జిగలో పంచదార కలుపుకొని తాగుతారు. ఇలా తాగడవం వలన వేడి కొద్దీ నిమిషాల్లోనే బయటకు వెళ్ళిపోతుంది. శరీరం చల్లబడిపోతుంది.

కాలీఫ్లవర్

విటమిన్ సి పుష్కలంగా లభ్యమయ్యే క్యాలీఫ్లవర్ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సాయపడుతుంది.