కోవిడ్ టెన్షన్‌తో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు.. ప్రాణాలకే ప్రమాదం

  • Published By: sreehari ,Published On : August 3, 2020 / 02:41 PM IST
కోవిడ్ టెన్షన్‌తో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు.. ప్రాణాలకే ప్రమాదం

అసలే కరోనా టెన్షన్.. అందులోనూ అనారోగ్య సమస్యలు ఉంటే.. ఇంక అంతే సంగతలు.. పొరపాటున కరోనా సోకిందా? ప్రాణాలకే ప్రమాదమంటున్నారు వైద్య నిపుణులు.. ఎందుకంటే.. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు అధికంగా ఉన్నవారిలో కరోనా ముప్పు సమస్య అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.



ఇలాంటి పరిస్థితుల్లో అనారోగ్య సమస్యలకు తోడు ఇప్పుడు కరోనా టెన్షన్ మరిన్ని సవాళ్లను ఎదుర్కోవల్సి వస్తోంది. కరోనావైరస్ మహమ్మారి సమయంలో ప్రతిఒక్కరిలోనూ వైరస్ టెన్షన్ పట్టుకుంది. డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఆరోగ్య పరిస్థితులతో ఉన్నవారికి సవాళ్లు మరింత ఎక్కువగా ఉంటాయి. కానీ సరైన ప్రణాళికతో అనారోగ్య సమస్యల ప్రభావాన్ని క్రమంగా తగ్గించుకోవచ్చు అంటున్నారు.

How to manage chronic health problems in COVID-19 pandemic

కొత్త వ్యాధులపై అవగాహన అవసరం :
దీర్ఘకాలిక వైద్యులతో బాధపడేవారు తమ ఆరోగ్యానికి కాపాడుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయని NIH నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ డైరెక్టర్ డాక్టర్ Griffin P. Rodgers చెప్పారు. ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ఉంటే… సమస్యలు ఇతర వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారంతా CDC సూచించిన ప్రజారోగ్య మార్గదర్శకాన్ని ఫాలో అవ్వండి.. కరోనా మహమ్మారిపై అవగాహన చాలా ముఖ్యమని సూచిస్తున్నారు.



COVID-19తో కొత్త వ్యాధుల గురించి అవగాహన పెంచుకోవాలి. ఆరోగ్య పరంగా తెలిసినవారితో సన్నిహితంగా ఉండటం చాలా ముఖ్యమని రోడ్జర్స్ చెప్పారు. ఈ కష్ట సమయాల్లో కడుపు నిండా బాగా తినాలి.. కాసేపు అయినా శారీరక శ్రమ ఉండాలి.. అది కూడా మాస్క్, సామాజిక దూరాన్ని పాటిస్తూ సురక్షితమైన వాతావరణంలో మాత్రమే ప్రయత్నించాలి. ఆరోగ్య సమస్యలను నివారించవచ్చునని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

chronic-pain

ఆహార ప్రణాళిక తప్పక పాటించాలి :
ప్రత్యేక పోషకాహార ప్రణాళికను పాటించాలి. ప్రత్యేకించి డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెర నియంత్రణ కోసం సూచించిన ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళికను అనుసరించాలి. మీ శారీరక శ్రమ, తినే దినచర్యల గురించి మీ హెల్త్ కేర్ వర్కర్లతో చర్చించండి.. ఆరోగ్యంగా తినడం.. చురుకుగా ఉండటం కూడా కరోనా టెన్షన్ నుంచి ఒత్తిడిని తగ్గించటానికి సాయపడుతుంది.



అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా ఒత్తిడి కలిగిస్తుంది. ఆరోగ్య పరిస్థితులతో బాధపడుతున్నవ్యక్తులు వారి సాధారణ దినచర్య, ఆరోగ్య రక్షణపరంగా ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. ఒత్తిడిని తగ్గించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. దీర్ఘంగా శ్వాస తీసుకోవడం, నడక, ధ్యానం, మ్యూజిక్ వినడం లేదా నచ్చిన పనులు చేయడం ఎన్నో ఉన్నాయి.



తగినంత నిద్ర పోవాలి :
తగినంత నిద్ర (ప్రతి రాత్రి 7 నుండి 8 గంటలు) పోవాలి.. ఇలా చేస్తే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.. ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.. బరువును నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. ఆందోళన, నిరాశకు మీ ఒత్తిడిని తగ్గించే మార్గాలను కనుగొనడంలో సాయపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారిలో డిప్రెషన్ సాధారణంగా ఉంటుందని తెలిపారు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వల్ల ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉండదని సూచిస్తున్నారు.