ఇంట్లో ఉండే బొద్దింకలను ఇలా వదిలించుకోండి..

చాలా మంది బొద్దింకల తో ఇబ్బంది పడుతుంటారు. అవి ఇళ్లల్లో తినే ఆహార పదార్థాల మీద కి కూడా వచ్చేస్తూ ఉంటాయి.. అవి తరచుగా ఇంట్లో అపరిశుభ్రమైన ప్రదేశాలలో దర్శనమిస్తాయి..

ఇంట్లో ఉండే బొద్దింకలను ఇలా వదిలించుకోండి..

Cockroch

చాలా మంది బొద్దింకల తో ఇబ్బంది పడుతుంటారు. అవి ఇళ్లల్లో తినే ఆహార పదార్థాల మీద కి కూడా వచ్చేస్తూ ఉంటాయి.. అవి తరచుగా ఇంట్లో అపరిశుభ్రమైన ప్రదేశాలలో దర్శనమిస్తాయి.. కానీ ఇంటి నుండి ఈ అవాంఛిత కీటకాలను ఎలా వదిలించుకోవాలి? అని ఆలోచిస్తూ ఉంటారు..

అందుకోసం చెప్పుల నుండి చాలా ఖరీదైన వస్తువుల వరకు వాటిని చంపడానికి వాడతారు. బొద్దింకలను నియంత్రించడానికి కొందరు పురుగుమందులను కూడా ఉపయోగిస్తారు. అటువంటివారుబొద్దింకలను వదిలించుకోవాలనుకుంటే, ఈ ఇంటి చిట్కాలను కూడా ఒకసారి ప్రయత్నించండి చూడండి..

ఇంట్లో బొద్దింకలు తిరుగుతున్న ప్రదేశంలో వేప ఆకు నూనె లేదా పొడి పోయాలి. వేప ఆకుల కరుకుదనం వల్ల బొద్దింకలు అకాలంగా చనిపోతాయి. మీరు బొద్దింకలను వదిలించుకోవాలనుకుంటే, ఈ నివారణను ఒకసారి ప్రయత్నించండి.

అలాగే బే ఆకు వాసన కూడా తీవ్రంగా ఉంటుంది. అందువల్ల, బొద్దింకలు ఎక్కువగా ఉండే ఇంటి భాగంలో.. బే ఆకులను వేసినా బొద్దింకలు పోయే అవకాశం ఉంది.

బోరిక్ పౌడర్ మరియు చక్కెరను సమాన నిష్పత్తిలో తీసుకొని ఈ మిశ్రమాన్ని ఇంటి మూలల్లో ఉంచినా అవి అంతమవుతాయి.. ఈ పొడిని ముఖ్యంగా చీకటి, తేమతో కూడిన ప్రదేశాలలో ఉంచాలి.

లవంగం కూడా బొద్దింకలను వదిలించుకోవడాయికి సహాయపడుతుంది. అందువల్ల, బొద్దింకలు కనిపించే చోట లవంగాలు ఉంచాలి. ఈ చిట్కాల తోపాటు ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.