ఆస్తమా మందుతో కరోనా ముప్పును తగ్గించుకోవచ్చు.. ప్రారంభంలోనే కంట్రోల్ చేయొచ్చు!

ఆస్తమా మందుతో కరోనా ముప్పును తగ్గించుకోవచ్చు.. ప్రారంభంలోనే కంట్రోల్ చేయొచ్చు!

Asthma drug Can reduce risk of severe Covid  : దేశీయ మార్కెట్లో చౌకగా లభించే ఆస్తమా మందుతో కరోనావైరస్ కు చెక్ పెట్టేయొచ్చు అంటోంది కొత్త అధ్యయనం.. అది కూడా ప్రారంభ లక్షణాలు కనిపించగానే వెంటనే ఈ ఆస్తమా మందు తీసుకుంటే తీవ్ర కరోనా ముప్పును తగ్గిస్తుందని అధ్యయన ఫలితాల్లో వెల్లడైంది. కోవిడ్ -19 తో తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని రుజువైంది. కరోనా లక్షణాలను అభివృద్ధి చేసిన మొదటి వారంలోనే తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుందని పరిశోధన సూచిస్తోంది.

వైరస్ సోకిన ప్రారంభ దశలో ఈ మందు మొదటి చికిత్సగా పనిచేస్తుందని అంటున్నారు. కోవిడ్ -19 తో ఆస్పత్రిలో చేరిన బాధితుల్లో ఉబ్బసం లేదా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) ఉన్నవారు చాలా తక్కువ మంది ఉన్నారని అధ్యయనం పేర్కొంది. ఉబ్బసం, సిఓపిడి వంటి లక్షణాలు కలిగిన వారు ఉపయోగించే స్టెరాయిడ్ ఇన్హేలర్లతో తీవ్రమైన కోవిడ్ -19 ముప్పు నుంచి కాపాడుతున్నాయని కనుగొన్నారు.

అలాంటి మందులో ఒకటి బుడెసోనైడ్ (budesonide) మందు.. తెలుపు టర్బుహేలర్ లేదా బ్రౌన్ లేదా లేత గోధుమరంగు నిరోధక ఇన్హేలర్‌లో ఇస్తారు. ఎందుకంటే ఉబ్బసం లేదా సిఓపిడి ఉన్నవారికి లక్షణాలు రాకుండా నిరోధించడానికి సాయపడుతుంది. ప్రారంభ కోవిడ్-19 లక్షణాలు కలిగిన 146 మందిపై పరిశోధకులు అధ్యయనం చేశారు. వారిలో సగం మందికి 800 మైకగ్రాముల బుడెసోనైడ్ రోజుకు రెండుసార్లు తీసుకోవాలని సూచించారు. ఈ వ్యక్తులలో పది మందికి మాత్రమే కరోనాతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.

ఆసుపత్రిలో చికిత్స అవసరం లేకుండా నిరోధించడానికి ఎనిమిది మందికి బుడెసోనైడ్‌తో చికిత్స అవసరమని సూచించారు. బుడెసోనైడ్ ఇన్హేలర్‌ తీసుకున్న వారిలో ఒకరితో పోలిస్తే… మిగతా వారిలో జ్వరం, ఇతర కోవిడ్ -19 లక్షణాల తీవ్రత వేగంగా ఉందని గుర్తించారు. ఆస్తమా మందును తీసుకున్న వారిలో 28 రోజుల తరువాత తక్కువ లక్షణాలను కలిగి ఉన్నారు. దీర్ఘకాలిక కరోనా లక్షణాలు లేకుండా ఈ మందు తగ్గిస్తుందని అధ్యయనంలో తేలింది.