మీకు ఇంకా పెళ్లి కాలేదా? ఈ అనారోగ్య ముప్పుతో జాగ్రత్త!

  • Published By: sreehari ,Published On : November 10, 2020 / 05:12 PM IST
మీకు ఇంకా పెళ్లి కాలేదా? ఈ అనారోగ్య ముప్పుతో జాగ్రత్త!

hypertension : మీకు ఇంకా పెళ్లి కాలేదా? అయితే తస్మాత్ జాగ్త్రత్త.. మీకో అనారోగ్య ముప్పు పొంచి ఉందంటున్నారు పరిశోధకులు.. పెళ్లికానివారిలోనే ఈ సమస్య అధికంగా ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. అమెరికాలో సగానికి పైగా యువకుల్లో ఇదే అనారోగ్య సమస్య వెంటాడుతోందంట.



ఇంతకీ ఆ అనారోగ్య సమస్య ఏంటో తెలుసా? హైపర్ టెన్షన్.. అదేనండీ హై బ్లడ్ ప్రెజర్.. సెంటర్స్ ఫర్ డీసీజ్ కంట్రోల్, ప్రెవెన్షన్ (CDC) తమ అధ్యయనంలో గుర్తించింది.

ఈ (హైపర్ టెన్షన్) మెడికల్ కండీషన్ కారణంగా ఏడాదికి మిలియన్లలో సగం మంది మృతిచెందుతున్నారు. అంతేకాదు.. ఇతర ప్రాణాంతక అనారోగ్య సమస్యలు కూడా తీవ్రంగా ఉంటున్నాయని తేలింది. అందులో ఎక్కువగా గుండెజబ్బులే వస్తున్నాయి.



అమెరికాలో పురుషులు, మహిళల్లోనూ గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతోందని నిర్ధారించారు. అలాగే అధిక బరువు, వ్యాయామం చేయకపోవడం, చెడు ఆహారపు అలవాట్లు వంటి భౌతిక కారకాలతో హై బ్లడ్ ప్రెజర్ సమస్యలకు దారితీస్తోందని గుర్తించారు.

పెళ్లికాని వారిలోనూ ఈ తరహా హైపర్ టెన్షన్ అధికంగా ఉంటోందని అధ్యయనంలో తేలింది. దీనికి సంబంధించి పరిశోధక బృందం విశ్లేషించిన అధ్యయానాన్ని హైపర్ టెన్షన్ జనరల్‌లో ప్రచురించారు.



45ఏళ్ల నుంచి 85 ఏళ్ల కెనడియన్ పురుషులు, మహిళల నుంచి ఈ డేటాను సైంటిస్టులు సేకరించి విశ్లేషించారు. ఈ డేటా ద్వారా పరిశోధకులు.. వైవాహిక జీవితం, జీవించే పరిస్థితులు, సామాజిక మాధ్యమాలపై ఆసక్తి, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి అనేక అంశాలతో పురుషులు, మహిళ్లలోనూ ఒకేరకమైన హైపర్ టెన్షన్ పరిస్థితులకు దారితీస్తోందని అధ్యయనంలో గుర్తించారు. హైపర్ టెన్షన్ సమస్య పెళ్లికానివారిలో ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం..

1. పెళ్లికాని మహిళల్లో అధిక ముప్పు :
వివాహం కాని మహిళల్లోనే హైపర్ టెన్షన్ ప్రభావం అధికంగా ఉందని అధ్యయనంలో తేలింది. హైపర్ టెన్షన్ ముప్పు అధికంగా ఇలాంటి మహిళల్లోనే ఉంటుందని పరిశోధకులు గుర్తించారు.

వాస్తవానికి పెళ్లి అయిన మహిళలతో పోలిస్తే.. ఒంటరి మహిళల్లో 28 శాతం హైపర్ టెన్షన్ ముప్పు అధికంగా ఉంటుంది.



అలాగే విడాకులు తీసుకున్న మహిళల్లో 21 శాతం అధిక ముప్పు, వితంతువు మహిళల్లో 33 శాతం అధిక ముప్పు ఉంటుందని తేలింది. అలాగే గుండె ఆరోగ్యం దెబ్బతినడం వంటి సంకేతాలు కూడా కనిపించే అవకాశం ఉంది.

2. ఒంటరి పురుషుల్లో హైపర్ టెన్షన్ తక్కువే :
హైపర్ టెన్షన్… ఒంటరి పురుషుల్లో వాస్తవానికి చాలా తక్కువగా ఉంటుంది. పార్టనర్లతో జీవించే పురుషులతో పోలిస్తే.. ఒంటరిగా జీవించే పురుషుల్లోనే హైపర్ టెన్షన్ తక్కువగా సంబంధం కలిగి ఉంటుందని రీసెర్చర్లు గుర్తించారు.hypertension

పురుషుల్లో గుండెజబ్బుల ముప్పుపై ప్రత్యేక అవగాహన ఉండాలంటున్నారు.



3. మహిళల్లో కొంతమందిలోనే హైపర్ టెన్షన్ ముప్పు :
సామాజిక మాధ్యమాల్లో గడిపే మహిళలతో పోలిస్తే.. 220 నుంచి 573 మంది మహిళల్లో అతితక్కువ మంది స్నేహితులే ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. 85 కంటే తక్కువ మందిలో 15శాతానికి పైగా హైబ్లడ్ ప్రెజర్ సమస్య ఉందని అధ్యయనంలో గుర్తించారు.depressionసామాజికంగా గుండెజబ్బులతో సంబంధం ఉందని మహిళల్లోనే ఎక్కువగా ప్రభావం ఉంటుందని యూనివర్శిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియా అసిస్టెంట్ ప్రొఫెసర్, పీహెచ్‌డీ Annalijn I. Conklin పేర్కొన్నారు.



4. పురుషుల్లో పెద్దగా ప్రభావం ఉండదు:
సామాజిక సంబంధాలనేవి మహిళలకు ప్రధానమైన కారకాలుగా చెప్పవచ్చు. పురుషుల్లో మాత్రం చాలా తక్కువ ప్రభావం ఉంటుంది.
Hypersసామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదా తమ సామాజిక సంబంధాలను పెంచుకునేవారిలోనే హైబ్లడ్ ప్రెజర్‌తో ప్రత్యేక ‌సంబంధం ఉంటుందని పరిశోధకులు తమ అధ్యయనంలో గుర్తించారు.