కరోనాతో 382 మంది వైద్యులు మృతి..కోవిడ్ వారియర్స్ ను గౌరవించండి : IMA

  • Published By: nagamani ,Published On : September 17, 2020 / 12:07 PM IST
కరోనాతో  382 మంది వైద్యులు మృతి..కోవిడ్ వారియర్స్ ను గౌరవించండి : IMA

కరోనా వారియర్స్ గా పేరొందిని వైద్య సిబ్బంది ఆ మహమ్మారికే బలైపోతున్న ఘటనలో బాధను కలిగిస్తున్నాయి. వారి ప్రాణాలకు అడ్డువేసి వేలాదిమంది ప్రజల ప్రాణాల్ని కాపాడే డాక్టర్లు..నర్సులు..ఇతర వైద్య సిబ్బంది ఆ కరోనాకే బలైపోతున్న ఘటనలు అత్యంత విషాదాన్ని కలిగిస్తున్నాయి.


కరోనా బ్రేక్ అవుట్ అయినప్పటి నుంచి వైద్య సిబ్బంది అహర్నిశలు శ్రమించి ఎందరినో కాపాడారు. ఈ క్రమంలో ఎందరో డాక్టర్లు, నర్సులు, ఇతరత్రా వైద్య సిబ్బంది కరోనా బారిన పడి మరణించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) లెక్కల ప్రకారం ఇప్పటివరకు భారత్‌లో కరోనా పోరులో 382 మంది డాక్టర్లు మృతిచెందినట్లుగా తెలిసింది.



https://10tv.in/my-hands-after-doffing-ppe-due-to-profuse-sweating-in-extreme-humid-climate/
మృతిచెందిన వారిలో అత్యంత చిన్న వయస్సు 27 ఏళ్ల డాక్టర్ కూడా ఉన్నారు. అంతేకాదు అత్యంత వృద్ధుడు 85 ఏళ్ల డాక్టర్ కూడా కరోనాకు బలైపోయారు. బుధవారం (సెప్టెంబర్ 16,2020) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పార్లమెంట్ లో దేశంలో కరోనా పరిస్థితిపై ప్రకటన చేశారు. కరోనాతో పోరాడుతూ మరణించిన వారి వివరాలను తెలిపారు. కానీ ప్రకటనపై ఐఎంఏ అసంతృప్తి వ్యక్తం చేసింది.


మంత్రి తన ప్రకటనలో డాక్టర్ల గురించి ప్రస్తావించలేదని..ఇది చాలా బాధాకరమని కరోనా వారియర్స్ గా వారి ప్రాణాలకు కూడా పణ్ణం పెట్టి పోరాడుతున్న డాక్టర్లకు మంత్రి గౌరవించలేదని ఐఎంఏ పేర్కొంది. ఈ క్రమంలో దేశంలో కరోనాతో పోరాడుతూ మరణించిన డాక్టర్ల వివరాలను ఐఎంఏ వెల్లడించింది.