Cardiological Society of India: భారత్‌లో విపరీతంగా పెరిగిన ఆకస్మిక గుండెపోటు మరణాలు.. చిన్నారులకు అవగాహన కల్పించాలని వైద్యుల సూచనలు

‘‘దీర్ఘకాల హృద్రోగాల ముప్పు గురించి పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలి. వారు ఎదిగిన తర్వాత ఆరోగ్యకర పౌరులుగా జీవిస్తారు’’ అని వైద్య నిపుణుడు రాజీవ్ గుప్తా వివరించారు. ఇప్పుడు భారత్ ‘ప్రపంచ హృద్రోగ రాజధాని’గా మారిందని వైద్య నిపుణులు అన్నారు. ఇందుకు కాలుష్యం, కుంగుబాటు, సెల్ ఫోన్లు, కంప్యూటర్లను చూస్తూ గడిపే సమయం పెరిగిపోవడం, చక్కెర పదార్థాలను అధికంగా తీసుకోవడం, తగిన వ్యాయామం చేయకపోవడమేనని రాజీవ్ గుప్తా అన్నారు.

Cardiological Society of India: భారత్‌లో విపరీతంగా పెరిగిన ఆకస్మిక గుండెపోటు మరణాలు.. చిన్నారులకు అవగాహన కల్పించాలని వైద్యుల సూచనలు

Heart palpitations? Can this condition lead to a heart attack?

Cardiological Society of India: దేశంలో ఆకస్మిక గుండెపోటు మరణాలు (ఎస్సీడీ) కొన్నేళ్లుగా గణనీయంగా పెరిగిపోయాయి. వీటిపై దేశ ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఇటీవల కార్డియాలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) సమావేశాలు నిర్వహించింది. ఎస్సీడీకి సంబంధించిన అంశాలపై వైద్యులు చర్చించారు. పెద్ద వారే కాకుండా చిన్నారులు కూడా దీర్ఘకాల హృద్రోగాల ముప్పు గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని దాదాపు 5,000 మంది వైద్యులు అభిప్రాయపడ్డారు.

‘‘దీర్ఘకాల హృద్రోగాల ముప్పు గురించి పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలి. వారు ఎదిగిన తర్వాత ఆరోగ్యకర పౌరులుగా జీవిస్తారు’’ అని వైద్య నిపుణుడు రాజీవ్ గుప్తా వివరించారు. ఇప్పుడు భారత్ ‘ప్రపంచ హృద్రోగ రాజధాని’గా మారిందని వైద్య నిపుణులు అన్నారు. ఇందుకు కాలుష్యం, కుంగుబాటు, సెల్ ఫోన్లు, కంప్యూటర్లను చూస్తూ గడిపే సమయం పెరిగిపోవడం, చక్కెర పదార్థాలను అధికంగా తీసుకోవడం, తగిన వ్యాయామం చేయకపోవడమేనని రాజీవ్ గుప్తా అన్నారు.

ప్రజల జీవన శైలి మారవడం కూడా ఇందుకు కారణమని చెప్పారు. ప్రజలు చాలా మంది కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలనే తింటున్నారని డాక్టర్ డెబబ్రత రాయ్ తెలిపారు. ‘‘దేశంలో పొగతాగేవారి సంఖ్య కాస్త తగ్గినప్పటికీ అది సంతృప్తికర రీతిలో తగ్గలేదు. మద్యం తాగేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఫాస్ట్ ఫుడ్ అధికంగా తింటున్నారు. కొవ్వు, ఉప్పు, చక్కెర విషయంలో ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఫారసు చేసిన ప్రమాణాలను ఆయా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పాటించడంలేదు’’ అని డాక్టర్ రాయ్ అన్నారు. కాలుష్యం కూడా హృద్రోగాలు పెరిగిపోవడానికి ముఖ్య కారణంగా మారిందని చెప్పారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..