‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ 'కామసూత్ర' స్టార్ ఇందిరా వర్మకు కరోనా పాజిటీవ్

‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ‘కామసూత్ర’ స్టార్ ఇందిరా వర్మకు కరోనా పాజిటీవ్

‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ‘కామసూత్ర’  స్టార్ ఇందిరా వర్మకు కరోనా పాజిటీవ్

అమెరికన్ ఫేంటసీ డ్రామా టీవీ సీరీస్ Game of Thrones స్టార్, బ్రిటన్ నటి, భారత సంతతికి చెందిన ఇందిరా వర్మకు కరోనా వైరస్ సోకింది. Covid-19 బాధిత లక్షణాలు కనిపించడంతో తనకు నిర్వహించిన పరీక్షల్లో పాజిటీవ్ అని తేలినట్టు ఆమె రివీల్ చేసింది. 46ఏళ్ల బ్రిటన్ నటి.. బుధవారం తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులకు ఈ విషయాన్ని వెల్లడించింది.

రెండు రోజుల క్రితమే మరో స్టార్ క్రిస్టోఫర్ హివిజుకు కూడా కరోనా ఇన్ఫెక్షన్ సోకి పాజిటీవ్ అని తేలింది. ఎపిక్ హెచ్ బీఓ సిరీస్ లో ఎల్లారియా సాండ్ అనే పాత్రను వర్మ పోషించింది. ‘ప్రస్తుతం నేను బెడ్ పైనే ఉన్నాను. ఆరోగ్యం బాగోలేదు. సురక్షితంగా ఉండండి.. మీ పక్కనే ఉండేవారితో కాస్తా దూరంగా జాగ్రత్తగా ఉండండి’ అని పోస్టు పెట్టింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అల్బమ్ లో ఎమిలియా క్లార్కేతోపాటు లండన్ వెస్ట్ ఎండ్ లో ‘ది సీగల్’ సిరీస్‌లో అంటోన్ చెకోవ్ పాత్ర కోసం రీహార్షల్స్ చేస్తోంది.
Kamasuthra Indira Varma

కరోనా వైరస్ వ్యాప్తికి ఈ సిరీస్ తాత్కాలికంగా బ్రేక్ పడింది. కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చాలా షోలు నిలిచిపోవడం ఎంతో విచారకరమన్నారు. త్వరలో తిరిగి వస్తామని ఆశిస్తున్నాం. మాకు సపోర్ట్ చేసినందుకు అందరికి కృతజ్ఞతలు అని తెలిపింది. కరోనా వైరస్ సోకిన హాలీవుడ్ నటుల్లో ఇందిరా వర్మతో పాటు హివిజు సహా టామ్ హ్యాంక్స్ రితా విల్సన్, ఇడ్రిస్ ఎల్బా, ఒల్గా క్యూరీలెంకో, రాచెల్ మాథ్యూస్‌ కూడా ఉన్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

So sad our and so many other shows around the world have gone dark affected by the Covid-19 pandemic. We hope to be back soon and urge you all (and the govt) to support us when we do. Phoenix/ Seagull rising from the ashes. I’m in bed with it and it’s not nice. Stay safe and healthy and be kind to your fellow people.❤️?❤️

A post shared by Indira (@indypindy9) on

See Also | గరీబ్‌ రథ్‌ రైల్లో కరోనా అలజడి.. చేతికి క్వారంటైన్ ముద్రతో నలుగురు ప్రయాణం!

×