మగవాళ్లకన్నా, ఆడవాళ్లకే రెండోసారి హార్ట్ ఎటాక్ తక్కువగా వస్తుందంట

  • Published By: sreehari ,Published On : September 28, 2020 / 06:33 PM IST
మగవాళ్లకన్నా, ఆడవాళ్లకే రెండోసారి హార్ట్ ఎటాక్ తక్కువగా వస్తుందంట

heart-attacks

heart attacks In women: గుమ్మడిలా గుండెపట్టుకొని కుప్పకూలిపోయే సీన్స్ ఎక్కువగా మగాళ్ల గురించే చూపిస్తారు. ఆడవాళ్లకు అసలు హార్ట్ ఎటాక్ వస్తుందనికూడా చాలామంది అనుకోరు.

నిజానికి, మగాళ్లతో పోలిస్తే హార్ట్ ప్రొబ్లమ్స్ ఆడవాళ్లకు తక్కువే. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, మగాళ్లకన్నా మహిళలలోనే రెండోసారి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు చాలా తక్కువంట. ఇది గుడ్ న్యూసే కదా!

ఫస్ట్ టైం హార్ట్ ఎటాక్ వచ్చిన తర్వాత యేడాది రికవరీ అయ్యి, ఆతర్వాత రెండో  heart attack వచ్చే అవకాశం ప్రతి వెయ్యిమందిలో 89.2 నుంచి 72.3కి పడిపోయింది.



ఇదంతా వాళ్ల ఆరోగ్యమహిమా? కాదు, emergency treatment మెరుగుపడటంకూడా ఒక రీజన్ అంటున్నారు. హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత, తీసుకొనే జాగ్రత్తల వల్లే మరోసారి  heart attack రాకుండా కాపాడుకొంటున్నారన్నది వైద్యనిపుణుల మాట. వైద్య సౌకర్యాలు అటు మగవాళ్లు, ఆడవాళ్లకు సమానంగా అందుతున్నా, ఆడవాళ్లలో ఎక్కువమంది మరోసారి హాస్పటల్ కు రావడంలేదంట.