ఇలా రొమాన్స్ చేస్తే.. దంపతుల మధ్య దూరం పెరిగినట్టే? సర్వేలో బయటపడ్డ షాకింగ్ విషయాలు!

  • Published By: sreehari ,Published On : April 5, 2020 / 07:10 AM IST
ఇలా రొమాన్స్ చేస్తే.. దంపతుల మధ్య దూరం పెరిగినట్టే? సర్వేలో బయటపడ్డ షాకింగ్ విషయాలు!

ఇద్దరూ ఫ్రెండ్స్‌లా ఉంటారు. అయినా ఏదో వెలితి. అదే బెడ్ మీదైతే… సిగ్గు, ఏ మూలనో గ్యాప్. ఇలాంటిదే మీకూ ఎక్స్‌పీరియన్స్ ఐతే…మీరేమీ ఒంటరివాళ్లుకాదు, ఇది మీ ఒక్కరి సమస్యేకాదు. భారతదేశం నుంచి ఇంగ్లాండ్ వరకు అందరికీ ఉన్న ప్రొబ్లమే. బ్రిటన్‌లో ఎంపిక చేసిన 1,000 మందిమీద సర్వేచేశారు. ఇలాంటి సర్వేలు ఇండియాలో జరిగాయి.  

కొత్త సర్వే కొన్ని సీక్రెట్స్ చెప్పింది. మోడ్రన్ లైఫ్‌లో ఒత్తిడి ఎక్కువేకదా. బ్రిటన్ లో కుర్రాళ్ల మీద సర్వే చేశారు. వాళ్ళలో పార్ట్రనర్ నుంచి ఎక్కువ చనువు కోసం, ఇంటిమెసీ కోసం  తెగ తపించిపోతున్నారు. వయస్సు పెరుగుతున్నకొద్దీ ఆత్రం పెరుగుతూనే ఉందితప్ప… కోరిక తీరడం లేదు. 45 ఏళ్లుదాటిన తర్వాత ఈ ఆత్రమున్నవాళ్లు 65 శాతానికి చేరారు.

పార్టనర్ మీద అలా చేయివేసి, ఇలా లాక్కొందమంటే ఫోన్‌లో నోటిఫికేషన్. ట్యాప్‌ట్యాప్ లు. ఇండియా మెట్రోలో జరిగిన సర్వేలోనూ ఇదే ప్రొబ్లమ్ కనిపించింది. భార్యభర్తల మధ్య ఫోన్, ల్యాప్‌టాప్‌లు ఎంటరవుతున్నాయి. మజాను చంపేస్తున్నాయి. అందుకే భర్తను వైబ్రేటర్ కొనివ్వమని అడిగే వాళ్లు పెరిగారు.

భర్తకూడా అందుకు సిద్ధమే. ఏంటీ వైపరీత్యమని అనుకోవద్దు. నైట్ అయ్యేసరికి ఎనర్జీ తగ్గిపోతోంది, ఒత్తిడి, టైం లేదు, లోపల కోరికున్నా సపోర్ట్ లేదు. ఈరోజుకాదు రేపైతే చెలరేగిపోదామని వాయిదాల మీద వాయిదాలు. ఇలా infrequent sex పెద్ద సమస్య అయిపోయింది. సర్వే మనకు తెలిసిన సంగతులను గట్టిగా చెప్పింది.

45 ఏళ్లలోపు వాళ్లలో ఎక్కువమంది బెడ్ మీద ఫోన్ చూస్తున్నారు, చాట్ చేస్తున్నారు, లేదంటే ప్రొగ్రామ్ వాచ్ చే్స్తున్నారు. అంతే తప్ప ముద్దులు, కౌగిలింతల జోలికి వెళ్లడంలేదు. సగంమంది పార్టనర్ ని కాకుండా ఫోన్ నే చూస్తూ పడుకొంటున్నారు. 35శాతం మంది పక్కలో భార్య ఉన్న, ఫోన్ నేపక్కనుంచుకొంటున్నారు. నిజానికి ఇద్దరి మధ్య ఫోన్ వచ్చి చేరింది.  

నోటీఫికేషన్ లమీద శ్రద్ధ పార్టనర్ మీద లేదు. ఇంకెక్కడ ఇంటిమెసీ! స్పర్శలేని జీవితం దంపతులను మర్చిపోతోంది. ఒకరు ఫోన్ చూస్తూ టైం స్పెండ్ చెస్తుంటే… కోరిక ఎలా కలుగుతుంది? ఇదే సమస్య ఢిల్లీ జనాలదంట.45 ఏళ్లలోపువాళ్లు బెడ్ రూంలో ఏం చేస్తున్నారంటే! 

ఎక్కువ సమయం నుంచి తక్కువ సమయం వరకు :
1. చాటింగ్
2.టీవీ వాచింగ్
3.కౌగిలింతలు
4.రీడింగ్
5.రొమాన్స్

ఏంటీ సమాధానం? దంపుతుల మధ్య రొమాన్స్‌కి లాస్ట్ ప్రయార్టీ. రిజల్స్ అంత గ్లామరస్ లా లేవు. చాటింగ్, వాచింగ్‌తోనే టైం సరిపోతోంది. మరి ఇంటిమసీని నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి? కనీసం  scheduling sex చేయాలని అంటున్నారు సైకాలజిస్ట్‌లు. రెండోది, బెడ్‌రూంను టెక్‌ఫ్రీగా ఉంచాలి. మూడోది ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇక్కడే ఒక సమస్య.

couple romance

ఫోన్‌లను బెడ్‌రూంలోకి రానివ్వకపోతే నిద్రపోయే జనాలే ఎక్కువ. కనీసం అదైనా బెటర్ కదా. సైకాలజిస్ట్ లదగ్గర మరో సలహా ఉంది. బెడ్ రూంలోకి వెళ్లేముందు కనీసం అరగంటైనా పార్టనర్స్ మాట్లాడుకోవాలి. ముద్దులూ, మురిపాలు పొంగించాలి.  దానివల్ల ఇంటిమసీ పెరుగుతుంది. ఇద్దరి మధ్య అనుబందం పెరిగితే, బంధాలు గట్టిపడతాయన్నదానికి స్టడీ రిపోర్ట్స్ ఉన్నాయి.