పిల్లలకు న్యూడిల్స్ పెడుతున్నారా.. ప్రాణానికే ప్రమాదం

మోడరన్ ఫుడ్ అందులోనూ చీప్‌గా వస్తుంది కదా అని న్యూడిల్స్ వైపు ఆలోచన వెళ్తే సమస్య కొని తెచ్చుకున్నట్లే. క్షణాల్లో తయారయ్యే న్యూడిల్స్‌ను వాడి ఆసియాలోని పిల్లలు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారని ఓ సర్వే వెల్లడించింది.

పిల్లలకు న్యూడిల్స్ పెడుతున్నారా.. ప్రాణానికే ప్రమాదం

మోడరన్ ఫుడ్ అందులోనూ చీప్‌గా వస్తుంది కదా అని న్యూడిల్స్ వైపు ఆలోచన వెళ్తే సమస్య కొని తెచ్చుకున్నట్లే. క్షణాల్లో తయారయ్యే న్యూడిల్స్‌ను వాడి ఆసియాలోని పిల్లలు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారని ఓ సర్వే వెల్లడించింది.

మోడరన్ ఫుడ్ అందులోనూ చీప్‌గా వస్తుంది కదా అని న్యూడిల్స్ వైపు ఆలోచన వెళ్తే సమస్య కొని తెచ్చుకున్నట్లే. క్షణాల్లో తయారయ్యే న్యూడిల్స్‌ను వాడి ఆసియాలోని పిల్లలు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నారని ఓ సర్వే వెల్లడించింది. ఇండోనేషియా, మలేసియా, ఫిలిప్పైన్స్ లు ఆర్థికంగా ఎదుగుతున్నాయి. బిజీబిజీగా గడిపేస్తున్నాయి. ఎంతలా అంటే పిల్లలకు ఆహారం తయారుచేసి పెట్టలేనంతగా. 

ఫలితంగా ఆహారంలో నాణ్యత లేకపోవడంతో ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. దీని కారణంగా 40శాతం కంటే ఎక్కువ మంది 5 సంవత్సరాల లోపు పిల్లలు అజీర్తితో బాధపడుతున్నారు. రెగ్యూలర్ గా తినడం వల్ల ప్రాణాలకు ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రులు వారి కడుపు నింపాలని చూస్తున్నారు. కానీ, ఆహారంలో పదార్థాల గురించి పట్టించుకోవడం లేదు. ప్రొటీన్, కాల్షియం, ఫైబర్ సమంగా వెళుతున్నాయో లేదో తెలుసుకోవడం లేదని ఇండోనేషియాలో హస్బుల్లా థాబ్రనీ అనే ఆరోగ్య నిపుణులు తెలియజేశారు.

యూనిసెఫ్ కథనం ప్రకారం.. ఇదే ఆహారం తీసుకుంటూ పోతే భవిష్యత్‌లో చాలా సమస్యలు ఎదురవుతాయి. ఐరన్ లోపాలు పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపిస్తాయి. ప్రసవం తర్వాత మహిళలు ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. యూనిసెఫ్ ఆసియా న్యూట్రిషన్ స్పెషలిస్ట్.. ముయేని ముతుంగా మోడరన్ మీల్స్ ఆరోగ్యానికి ఉపయోగకరమైనవి కావని చెప్పారు. 

‘న్యూడిల్స్ చాలా ఈజీ, చీప్, వెంటనే తయారవుతాయి. బ్యాలెన్స్‌డ్ డైట్‌లా భావిస్తాం’ అని తెలిపారు. సంప్రదాయ ఆహారం తయారుచేయడానికి ఎక్కువ సమయం పడుతుండటం, ఖర్చు ఎక్కువగా కనిపించడం వంటివి న్యూడిల్స్ లాంటి వాటిని ప్రత్యామ్నయంగా  అనుకుంటున్నారని ఆమె వెల్లడించారు.