తీవ్రవాదులను ట్రాక్ చేసే టెక్నాలజీతో కరోనా బాధితుల ట్రాకింగ్  

  • Published By: sreehari ,Published On : March 17, 2020 / 03:35 PM IST
తీవ్రవాదులను ట్రాక్ చేసే టెక్నాలజీతో కరోనా బాధితుల ట్రాకింగ్  

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. చైనా సహా భారత్ ఇతర దేశాలను మహమ్మారి వైరస్ వణికిస్తోంది. ప్రపంచ దేశాలు కూడా కరోనా వ్యాప్తిని అదుపు చేసేందుకు విస్తృత స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. చైనా తర్వాత ఇజ్రాయెల్ కరోనా బాధితులను గుర్తించడంలో సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఉగ్రవాదుల కదిలికలను ట్రాక్ చేసే ట్రాకింగ్ టెక్నాలజీని కరోనా వైరస్ బాధితుల కోసం వాడేందుకు ఇజ్రాయెల్ ఆమోదం తెలిపింది.

కరోనా వైరస్ బాధితుల ప్రతి కదిలికలను గుర్తించేందుకు ఈ టెక్నాలజీని వాడనుంది. వేగవంతంగా వ్యాపిస్తున్న కరోనా వ్యాధిపై పోరాడేందుకు ఇజ్రాయెల్ ఈ వివాదాస్పద నిర్ణయంతో మందుకు దూసుకెళ్తోంది. లొకేషన్ టెక్నాలజీ వాడకంపై విమర్శకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటివరకూ ఇది 30 రోజులకు పరిమితి ఉండేది. ఇజ్రాయెల్ పౌరులపై వ్యక్తిగత దాడులకు పాల్పడినట్టు అవుతుందని విమర్శిస్తున్నారు. ఈ టెక్నాలజీ వాడకంపై కేబినెట్ ఆరు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించింది. ఈ టూల్స్ వినియోగంపై కఠినమైన పరిమితులతోపాటు ఉల్లంఘనకు పాల్పడరాదని ప్రధాని బెంజామిన్ నెత్యాన్హూ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇజ్రాయెల్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఏజెన్సీ హెబ్ర్యూ ఎక్రోన్యమ్ షిన్ బెట్ అని పిలుస్తుంటారు. ఈ ఏజెన్సీ కరోనా వైరస్ బాధితులు వాడే సెల్ ఫోన్లను మానిటర్ చేస్తుంటుంది. అంతేకాదు.. వారి ప్రతి కదిలికను ట్రాక్ చేస్తారు. వారితో కలిసేవారికి కూడా టెక్స్ట్ మెసేజ్‌లను పంపుతుంటారు. వెంటనే వారిని గుర్తించి క్వారెంటైన్ లేదా వైరస్ లక్షణాలపై టెస్టింగ్ చేయిస్తోంది. ఈ ఏజెన్సీకి అన్ని ఇజ్రాయెల్ పౌరుల సెల్యూలర్ డేటా అందుబాటులో ఉంటుంది. మొబైల్ ఫోన్ కంపెనీల నుంచి ఇజ్రాయెల్ యూజర్ల డేటాను సేకరిస్తోంది. ఉగ్రవాదుల కదిలికలను గుర్తించేందుకు ఈ డేటాను సేకరిస్తోంది.

Caronavirus data

కరోనా వైరస్ బాధితులను గుర్తించడంలో అధికారులు విఫలం కావడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం షిన్ బెట్ ఏజెన్సీ ఈ లొకేషన్ టెక్నాలజీని వాడేందుకు అనుమతినిచ్చినట్టు సంస్థ అధినేత నాదవ్ అర్గామ్యాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంతో సున్నితమైన ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసినట్టు చెప్పారు. పరిమిత గ్రూపులకు మాత్రమే ఏజెంట్లు డేటా యాక్సస్ చేసుకోవాలని, అదంతా ఏజెన్సీ డేటాబేస్ లో స్టోర్ చేయరాదని సూచించింది.

అంతేకాదు.. ప్రభుత్వ రంగ ఉద్యోగులను కూడా సాధ్యమైనంత వరకు ఆఫీసుల్లో లేకుండా ఉండేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ప్రైవేట్ కంపెనీల్లో కూడా తమ ఉద్యోగులను 70శాతం ఆఫీసుల్లో కంటే ఇళ్లలోనే ఉండి పనిచేసేలా ప్రోత్సహిస్తోంది. నిత్యావసర సర్వీసులైన సూపర్ మార్కెట్లు, ఫార్మాసీలు, బ్యాంకులను మాత్రం సాధారణ స్థాయిలోనే కొనసాగనున్నాయి.