Ivermectin : ఇవర్‌మెక్టిన్‌… కరోనా సోకే ప్రమాదాన్ని తగ్గిస్తుందంటున్న అధ్యయనం

ఇవర్‌మెక్టిన్‌ అనే ఔషధాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే.. చాలావరకు కరోనా దరి చేరకుండా చూసుకోవచ్చా? అంటే, అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. కరోనా మహమ్మారికి ముగింపు పలకడానికి ఇది దోహదపడుతుందని చెబుతున్నారు. ఇవర్‌మెక్టిన్‌ అనేది నోటి ద్వారా తీసుకునే ఔషధం. వివిధ పరాన్నజీవులతో సంక్రమించే ఇన్‌ఫెక్షన్లను నయం చేయడానికి దీన్ని డాక్టర్లు సూచిస్తుంటారు. తాజాగా.. వైద్యనిపుణులు,

Ivermectin : ఇవర్‌మెక్టిన్‌ అనే ఔషధాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే.. చాలావరకు కరోనా దరి చేరకుండా చూసుకోవచ్చా? అంటే, అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. కరోనా మహమ్మారికి ముగింపు పలకడానికి ఇది దోహదపడుతుందని చెబుతున్నారు. ఇవర్‌మెక్టిన్‌ అనేది నోటి ద్వారా తీసుకునే ఔషధం. వివిధ పరాన్నజీవులతో సంక్రమించే ఇన్‌ఫెక్షన్లను నయం చేయడానికి దీన్ని డాక్టర్లు సూచిస్తుంటారు. తాజాగా.. వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలతో కూడిన ‘ఫ్రంట్‌లైన్‌ కొవిడ్‌-19 క్రిటికల్‌ కేర్‌ అలయెన్స్‌’ (ఎఫ్‌ఎల్‌సీసీసీ) సంస్థ ఈ ఔషధంపై పరిశోధన చేసింది.

ఆ వివరాలు ‘అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ థెరాప్టిక్స్‌’లో ప్రచురితమయ్యాయి. ఇవర్‌మెక్టిన్‌పై జరిగిన క్లినికల్, ల్యాబ్, జంతు పరిశోధనల్లో వెలువడిన డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ‘‘ఈ ఔషధానికి సంబంధించి ఇది అత్యంత సమగ్ర సమీక్ష. నిర్దిష్ట ప్రమాణాలతో డేటాను విశ్లేషించాం’’ అని ఎఫ్‌ఎల్‌సీసీసీ అధ్యక్షుడు పీయర్‌ కోరీ చెప్పారు.

కొవిడ్‌ను నివారించడంలో ఇవర్‌మెక్టిన్‌ పాత్రను తేల్చడానికి 2వేల 500 మంది పరీక్షార్థులపై నిర్వహించిన 8 పరిశోధనలపై వీరు దృష్టి సారించారు. క్రమం తప్పకుండా ఈ ఔషధాన్ని తీసుకుంటే.. కరోనా సోకే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని తేల్చారు. కొవిడ్‌ బాధితులపైనా ఇది అద్భుతంగా పనిచేస్తుందని 42 ప్రయోగాల డేటాను విశ్లేషించినప్పుడు వెల్లడైందన్నారు. ఈ ఔషధం.. బాధితుల్లో మరణం ముప్పును తగ్గిస్తుందని, శరీరం నుంచి వైరస్‌ను వేగంగా నిర్మూలిస్తుందని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు