కరోనానుంచి కోలుకున్నవారు అయ్యప్ప దర్శనానికి రావద్దు : కేరళ ప్రభుత్వం

  • Published By: nagamani ,Published On : November 10, 2020 / 12:21 PM IST
కరోనానుంచి కోలుకున్నవారు అయ్యప్ప దర్శనానికి రావద్దు : కేరళ ప్రభుత్వం

Kerala gov Sabarimala Devotees Health Advisory : నవంబర్ 16 నుంచి శబరిమల మండల పూజ సీజన్ ప్రారంభం కానున్నాయి. లక్షలాది మంది అయ్యప్ప భక్తులు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి శబరిమలకు వస్తారు. దీంతో రాష్ట్రంలోని వామపక్ష ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.



ఈక్రమంలో అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం కీలక సూచనల్ని ప్రకటించింది. కరోనా బారినపడి కోలుకున్న వారు ఇప్పుడప్పుడే అయ్యప్ప దర్శనానికి రావొద్దని కోరింది. దీనికి సంబంధించి సీఎం పినరాయి విజయన్ ప్రభుత్వం పలు మార్గదర్శకాలు విడుదల చేసింది.



https://10tv.in/good-news-to-tirumala-srivari-devotees/
కరోనా సోకి కోలుకున్నప్పటికీ వారి శరీరంలో మరో మూడు వారాలపాటు వైరస్ ప్రభావం ఉంటుందని..కాబట్టి ఇటువంటి వారు శబరిమలకొండను ఎక్కేటప్పుడు శ్వాస అందక ఇబ్బందులు పడే అవకాశం ఉందని..దీంతో వారు పలు ఇబ్బందులకు గురి అయ్యే అవకాశాలుంటాయని కాబట్టి కరోనా సోకి కోలుకున్నవారు శబరిమల అయ్యప్ప దర్శనానికి రాకుండా ఉండటమే శ్రేయస్కరమని సూచించింది.


కొండ ఎక్కేసమయంలో శ్వాస అందకపోవటం వల్ల పలు ఇబ్బందులు జరగవచ్చని హెచ్చరించింది. శారీరక వ్యాయామాలు చేస్తూ..శ్వాసకు సంబంధించి ఎటువంటి సమస్యలు లేనివారే లేవని నిర్ధారించుకున్న వారే అయ్యప్ప కొండకు రావాలని సూచించింది. భక్తులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.


వచ్చే నెల చివరి నుంచి మకరవిలక్కు దర్శనాలకు శబరిమల దేవస్థానం అనుమతించిన క్రమంలో కేరళ ప్రభుత్వం ఈ విజ్ఞప్తి చేసింది. కరోనా మహమ్మారి ఇంకా తన ప్రభావాన్ని చూపిస్తోందనీ మాలధారణతో అయ్యను దర్శించుకోవటానికి వచ్చిన భక్తులంతా తప్పకుండా మాస్కులు ధరించాలని..భౌతిక దూరం పాటిస్తూ కరోనా నిబంధలను తప్పనిసరికిగా పాటించాలని కోరింది.


అయ్యప్ప దర్శనానికి వచ్చిన భక్తులకు ప్రభుత్వ పలు నిబంధనలతో కూడిన దర్శనాలకు అనుమతినిస్తోంది. రోజుకు 1000మంది భక్తులకు మాత్రమే దర్శనాలను కల్పించాలని నిర్ణయించింది. భౌతికదూరం పాటించాలనే నిబంధలతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే భక్తులు షేస్ మాస్కులు తప్పనిసరి..అలాగే భౌతిక దూరంతో పాటు చేతులను తరచూ శానిటైజ్ చేసుకోవటానికి దగ్గర ఉంచుకోవాలి.


దగ్గు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు, వాసన, రుచి తెలియని లక్షణాలున్నవారు దర్శనానికి రావద్దని సూచించింది. స్వామి వారి దర్శనానికి 24 గంటల ముందు కరోనా నెగటివ్ రిపోర్టు తప్పనిసరని స్పష్టంచేసింది. కాగా, శబరిపీఠం నుంచి నీలిమల, శరణ్‌గుత్తి వరకు ఆక్సిజన్ స్థాయులు తక్కువగా ఉండడంతో ఆయా ప్రాంతాల్లో ఆక్సిజన్ సెంటర్లు ఏర్పాటు చేసింది.