భారత్ లో కరోనా వైరస్ వ్యాపిస్తే…అరికట్టే సామర్థ్యం మన దగ్గర లేనట్లే!

  • Published By: venkaiahnaidu ,Published On : January 28, 2020 / 10:59 AM IST
భారత్ లో కరోనా వైరస్ వ్యాపిస్తే…అరికట్టే సామర్థ్యం మన దగ్గర లేనట్లే!

చైనాలోని వుహాన్‌ నగరంలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను భయపెడుతోంది. ఇప్పటివరకు వందల సంఖ్యలో ప్రజలు చైనాలో ఈ వైరస్‌ బారిన పడగా, నేటికి 106మంది ప్రాణాలు కోల్పోయారు. వుహాన్ కరోనా వైరస్ వ్యాప్తిలో చాలా తెలియని అంశాలు ఉన్నాయి. ఇప్పుడు అది అంటువ్యాధిగా ప్రజలను భయపెడుతోంది. ఈ వైరస్ పాముల నుంభి వచ్చినట్లు భావిస్తున్నప్పటికీ…అసలు ఎక్కడి నుంచి ఈ వైరస్ వచ్చిందో సైంటిస్టులు పూర్తిస్థాయిలో క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. ఇది ఎంత తీవ్రమైనదో వాళ్లకి తెలియదు. ఎంతమందికి ఈ వైరస్ సోకిందో ప్రజారోగ్య అధికారులకు తెలియదు. ఈ మహమ్మారిని నియంత్రించడానికి లేదా పరిమితం చేయడానికి ప్రపంచం ఎలా మేనేజ్ చేస్తుందనేదానికి ఇవన్నీ ముఖ్యమైనవి. చైనా అధికారులు ఈ వైరస్ వ్యాప్తి యొక్క తీవ్రతను తక్కువ అంచనా వేశారు. దీనికారణంగానే ఆ దేశమంతటా ఈ వైరస్ వ్యాప్తి చెందింది. మరోవైపు భారత్ కూడా ఈ వైరస్ పట్ల అప్రమత్తతో ఉంది. వైరస్ కు వ్యతిరేకంగా భారతదేశం సిద్ధమవుతున్నప్పుడు, ఇదే విధమైన తిరస్కరణ లేదా సంక్షోభాన్ని తక్కువగా చూపించడం కూడా తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది.

భారతదేశపు పరిమితులు
ఈ అంటువ్యాధిని హ్యాండిల్ చేసే సామర్థ్యం చైనా కంటే భారత్ కు తక్కువగా ఉంది. మనదేశ శాస్త్రీయ మౌలిక సదుపాయాలు తక్కువ అభివృద్ధి మరియు విస్తృతమైనవి. పెద్ద సంఖ్యలో ప్రజలను ఉంచి ట్రీట్మెంట్ అందించగల సామర్థ్యం, సరైన పరికరాలు మన దగ్గర లేవు. మన ఆస్పత్రులే అనారోగ్యంతో ఉన్నాయి. కేవలం మనకున్న ఒక్క అడ్వాంటేజ్…చైనా అనుభవం యొక్క జ్ణానం. ఇది వ్యాధి యొక్క వ్యాప్తిని పరిమితం చేయడానికి భారతదేశం ఉపయోగించగలదు. 

భారతదేశపు శాస్త్రీయ నైపుణ్యం చాలా లోతుగా ఉన్నప్పటికీ కూడా… అటువంటి పరిస్థితులలో త్వరగా స్పందించేంత విస్తృతమైనది కాదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డైరెక్టర్ ఇటీవల చెప్పినట్లుగా… భారతదేశానికి ప్రస్తుతం ఇప్పుడున్నదానికన్నా 20 రెట్లు ఎక్కువ వైరాలజిస్టులు అవసరం. 1.3 బిలియన్ల జనాభా ఉన్న  మన దేశానికి…ఇలాంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవటానికి చాలా తక్కువ శాస్త్రవేత్తలు మరియు ఆరోగ్య నిపుణులు ఉన్నారు. ఇంత పెద్ద జనాభాకు భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ చాలా చిన్నది. ఏడాదిన్నర క్రితం లాన్సెట్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం…ఆరోగ్య సంరక్షణ నాణ్యత తక్కువగా ఉండటం వల్ల ప్రతి సంవత్సరం భారతదేశంలో 1.6 మిలియన్ల మంది మరణిస్తున్నారు.

నవంబర్ లోనే చైనా వ్యాప్తంగా

మనుషుల నుంచి మానుషులకు ఈ వైరస్ సోకినట్లు ఎటువంటి ఆధారాలు లేవని చైనా అధికారులు డిసెంబర్ మొత్తం చెబుతూనే ఉన్నారు. కానీ ఇటీవల లాన్సెట్ జర్నల్‌లో  ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం….విశ్లేషించిన 41 కేసులలో 14మందికి జంతు మార్కెట్‌ తో సంబంధం లేదు. జంతు మార్కెట్లో ఈ వైరస్ ఉద్భవించలేదని ఈ అధ్యయనం చెబుతోంది. నవంబర్ ప్రారంభంలోనే ఈ వైరస్ వ్యాప్తి జరిగినట్లు ఈ అధ్యయనం చెబుతోంది. ఇదే కనుక నిజమైతే చైనావ్యాప్తంగా జనాభాలో పెద్ద సంఖ్యలో ఈ వ్యాధి సోకినవాళ్లు ఉండవచ్చు. ఇది కనుక జరిగి ఉంటే ఈ మహమ్మారిని కంట్రోల్ చేయడానికి చాలా కష్టమవుతుంది.

వైరస్ కు వ్యాక్సిన్
కరోనా వైరస్​కు వ్యాక్సిన్​ను కనిపెట్టే పనిలో ఉన్నారు అమెరికా సైంటిస్టులు. బేలర్​ కాలేజ్​ ఆఫ్​ మెడిసిన్​కు చెందిన ట్రాపికల్​ మెడిసిన్​ రీసెర్చర్లు వ్యాక్సిన్​పై రీసెర్చ్​ చేస్తున్నారు. అయితే, ఇప్పుడప్పుడే వ్యాక్సిన్​ అందుబాటులోకి రాదని, మరో ఆరేళ్లయినా పడుతుందని ట్రాపికల్​ మెడిసిన్​ విభాగం డీన్​ డాక్టర్​ పీటర్​ హోటెజ్​ చెప్పారు. కరోనావైరస్​ సోకిన 2003 నుంచే వ్యాక్సిన్​పై పరిశోధనలు మొదలయ్యాయని, వైరస్​ తీవ్రత తగ్గగానే ఇన్వెస్టర్లు వెనకడుగు వేశారని అన్నారు. ఇప్పుడు మళ్లీ కొత్త రకం వైరస్​ పుట్టుకురావడంతో రీసెర్చ్​ చేస్తున్నారని వివరించారు.

పాముల నుంచేనట!

వుహాన్​లోని మార్కెట్లలో చేపలు, పందులతో పాటు పాములను కూడా అమ్ముతారు. వాటిని జనం తినడం వల్లే వైరస్​ పాకిందని యూనివర్సిటీ రీసెర్చర్​ వీ జి చెప్పారు. కొత్త కరోనా వైరస్​ జీన్స్​ను పాత కరోనా వైరస్​ జీన్స్​తో పోల్చి చూసిన సైంటిస్టులు ఈ నిర్ధారణకు వచ్చారు. ఆ వైరస్​ ఉండే భౌగోళిక ప్రాంతాలు, వాటికి హోస్టులుగా ఉండే జంతువులను పరీక్షించారు. గబ్బిలాల్లో ఉండే కరోనావైరస్​ జీన్స్​ కాంబినేషన్​తో ఈ కొత్త కరోనా పుట్టుకొచ్చిందని తేల్చారు. అంతేగాకుండా పాముల్లోని జీన్స్​తోనూ వాటిని పోల్చి చూసి, పాముల నుంచి వచ్చి ఉంటుందని చెబుతున్నారు.

మనుషులకు సోకడానికి ముందు పాముల్లోనే ఎక్కువగా ఆ వైరస్​ ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. అన్ని ఫలితాలను పరిశీలించాక పాముల వల్లే ఈ కొత్త కరోనా వైరస్​ సోకి ఉంటుందని భావిస్తున్నామని తమ రిపోర్టులో సైంటిస్టులు తెలిపారు. బీజింగ్​లోని చైనీస్​ అకాడమీ ఆఫ్​ సైన్సెస్​ చేసిన స్టడీలోనూ ఈ విషయమే వెల్లడైంది. కొత్త కరోనా వైరస్​కు పాములు, గబ్బిలాలే కారణమని ఆ స్టడీ తేల్చింది. అయితే, పాములు లేదా గబ్బిలాల నుంచి ఆ వైరస్​ మనుషులకు ఎలా సోకిందో మాత్రం రెండు స్టడీలూ తేల్చలేదు. నిపుణులు మాత్రం వుహాన్​ సిటీలో చాలా మంది పాము మాంసం తింటారని, వాటిని తినడం వల్లే వైరస్​ సోకి ఉంటుందంటున్నారు.

వూహాన్ సిటీకి తాళం
వైరస్​కు మూలకారణమైన వుహాన్​ సిటీకి రాకపోకలను చైనా బంద్​పెట్టింది. కోటి మందికిపైగా ఉండే వుహాన్​ నుంచి వేరే సిటీలు, దేశాలకు వెళ్లే ఫ్లైట్లు, వేరే సిటీల నుంచి అక్కడకు వచ్చే విమానాలన్నింటినీ రద్దు చేసేసింది. రైళ్లు, బస్సులనూ గత గురువారం ఆపేసింది. కేఫెలు, సినిమా థియేటర్లు, ఎగ్జిబిషన్​ సెంటర్లు, షాపింగ్​ మాళ్లన్నింటినీ మూసేశారు. ఆయా సిటీల నుంచి వైరస్​లు వేరే ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు.