దగ్గు, జ్వరం కాదు.. ఈ లక్షణాలు కనిపిస్తే కరోనా వచ్చినట్టే.. నిపుణుల హెచ్చరిక!

  • Published By: sreehari ,Published On : October 3, 2020 / 04:27 PM IST
దగ్గు, జ్వరం కాదు.. ఈ లక్షణాలు కనిపిస్తే కరోనా వచ్చినట్టే.. నిపుణుల హెచ్చరిక!

Loss of smell : కరోనా వచ్చినవారిలో లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపిస్తున్నాయి. కరోనా లక్షణాలు కూడా సాధారణ ఫ్లూ లక్షణాలు మాదిరిగానే ఉండటంతో కరోనా వచ్చిందా లేదా కచ్చితంగా గుర్తించడం కష్టమే.. కరోనా టెస్టు చేయించుకుంటే తప్పా కరోనా వచ్చిందా లేదా నిర్ధారించవచ్చు.. అయితే ప్రస్తుతం NHS సూచించిన ప్రకారం.. Covid-19 కరోనాకు సంబంధించి మూడు కీలక లక్షణాలుగా ప్రకటించింది.



అందులో దగ్గు, అధిక జ్వరం, రుచి, వాసన కోల్పోవడం.. ఈ మూడు లక్షణాలు కనిపిస్తే మాత్రం వారికి కరోనా వచ్చిందని నిర్ధారణకు రావడం జరుగుతుంది. సాధారణంగా కరోనా లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపిస్తుంటాయని ఇప్పటికే కొందరు నిపుణులు హెచ్చరించారు. మరికొంతమందిలో కరోనా సోకినా వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు.

వీరినే అసింపథిటిక్ క్యారియర్లు అంటారు. King’s College London నుంచి సైంటిస్టులు గుర్తించిన ప్రకారం.. కోవిడ్-19 సోకిన వారిలో తరచుగా తలనొప్పి, అలసట ముందుగా కనిపిస్తుందని వెల్లడించారు. Covid Symptom Tracking App ద్వారా సేకరించిన డేటాను పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన అంశాలు బయటపడ్డాయి.



82 శాతం మందిలో తలనొప్పి, 72 శాతం అలసట వంటి లక్షణాలు ముందుగా కనిపించాయని వెల్లడించారు. 18ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు వారిలో 9 శాతం మాత్రం ఎలాంటి తలనొప్పి లేదా అలసట వంటి లక్షణాలు కనిపించలేదంట.. అది కూడా కరోనా సోకిన మొదటి ఏడు రోజుల వ్యవధిలోనని గుర్తించారు పరిశోధకులు.

University College London కొత్త అధ్యయనం ప్రకారం.. Covid-19 యాంటీబాడీలు తయారైన వారిలో కరోనా సోకిన తర్వాత ఐదుగురిలో నలుగురికి రుచి లేదా వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కనిపించినట్టు నిర్ధారించారు. కరోనా పాజిటివ్ వచ్చిన 40 శాతం మందిలో ఎలాంటి (cough or fever)  జ్వరం లేదా దగ్గు వంటి లక్షణాలు కనిపించలేదంట.

గత నెలలో పరిశోధకుల అధ్యయనంలో భాగంగా 590 మందిపై పరీక్షించగా వారిలో వాసన లేదా రుచి కోల్పోయినట్టు లక్షణాలు ఉన్నాయని గుర్తించారు. వీరిలో 567 మందిని యాంటీబాడీ టెస్టు కోసం పంపారు. వారిలో 78 శాతం వరకు కోవిడ్ యాంటీబాడీలు ఉన్నాయని రీసెర్చర్లు గుర్తించారు.



రుచి మాత్రమే కోల్పోయిన కరోనా పేషెంట్లతో పోలిస్తే కేవలం వాసన మాత్రమే కోల్పోయిన బాధితుల్లో మూడింతలు యాంటీ బాడీలు తయారయ్యాయని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. వాసన కోల్పోయే లక్షణాన్ని కరోనా ప్రధాన లక్షణంగా రీసెర్చర్లు వెల్లడించారు. ఎవరిలోనైనా కరోనా ప్రారంభ లక్షణాలు కనిపిస్తే.. జ్వరం లేదా దగ్గు ఉన్నా వెంటనే ఐసోలేట్ కావాలని పరిశోధకులు సూచిస్తున్నారు. అంతేకాదు.. తమలో వాసన కోల్పోవడం వంటి లక్షణాలు ఏమైనా డెవలప్ అయ్యాయో లేదో తమకు తామే గమనించాలని సూచిస్తున్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఆకస్మాత్తుగా వాసన కోల్పోవడాన్ని కరోనా లక్షణంగా గుర్తించడం లేదు.. పరిశోధకుల అధ్యయనం ప్రకారం.. కరోనా వచ్చిందని అనుమానం ఉంటే.. వాసన సామర్థ్యాన్ని కోల్పోయారో లేదో చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇంట్లోనే లభించే సుగంధ ద్రవ్యాలు లేదా గార్లిక్ (ఎల్లిపాయ), కాఫీ, పర్ ఫ్యూమ్స్ వంటి వాసన వస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.



అంతేకాదు.. సెల్ఫ్ ఐసోలేట్ కావడమే కాకుండా PCR testing కూడా చేసుకోవడం ముఖ్యమని అంటున్నారు. వాసన కోల్పోయే లక్షణాన్ని ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రధాన లక్షణంగా గుర్తించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా లక్షణాలు ఉన్నాయని భావిస్తే ఉచితంగా NHS ద్వారా కరోనా టెస్టు చేయించుకోవచ్చు. NHS టెస్టు, ట్రేసింగ్ విధానం నాలుగు నెలల క్రితమే అందుబాటులోకి వచ్చింది.