వాకింగ్ తో 34 కిలోల కొవ్వు కరిగించుకున్న DIG : ఫిట్ నెస్ వెరీ ఇంపార్టెంట్

  • Published By: nagamani ,Published On : June 22, 2020 / 09:01 AM IST
వాకింగ్ తో 34 కిలోల కొవ్వు కరిగించుకున్న DIG : ఫిట్ నెస్ వెరీ ఇంపార్టెంట్

చాలామంది పోలీసులు డ్యూటీలో జాయిన్అయినప్పుడు ఫిట్ గా ఉంటారు. తరువాత బానపొట్ట వచ్చేసి..ఊబకాయం వచ్చేసి బొద్దుగా తయారవుతారు. కానీ ఫిట్ గా మారాలని వారికి ఉన్నా..డ్యూటీలతో అది సాధ్యం కాకపోవటంతో ఊబకాయంతోనే డ్యూటీలు చేస్తుంటారు.

అలా భారీగా బరువు పెరిగిపోయి ఊబకాయంతో బాధపడుతున్న ఓ DiG  తన భారీకాయాన్ని తగ్గించుకుని ఫిట్ గా మారిపోయిన వైనంచూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ DiG పేరు వివేక్‌రాజ్ సింగ్‌. మనసుండాలే కానీ మార్గం అదే ఉంటుందని నిరూపించారు DiG. UPలోని ఛతార్ పూర్ కు చెందిన సీనియర్ IPS అధికారి ఆయన.

130 కిలోలకు చేరిన DiG వివేక్ రాజ్ కేవలం 6 నెలల్లో 34 కిలోల బరువు తగ్గారు. తన ఫిట్ నెస్ కోసం..ఏ మాత్రం పట్టువదల్లేదు. పట్టువదలని విక్రమార్కుడిలా తలచుకున్నది చేసిన 34కిలోల బరువు తగ్గారు.

DiG  వివేక్‌రాజ్ సింగ్‌ కు ఈ ఊబకాయం మధ్యలో వచ్చింది కాదు. బాల్యం నుంచే ఉండేవారు. ఆ తర్వాత పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం కోసం ఎక్సైర్ సైజులు చేసి..బరువు తగ్గించుకున్నారు. అనుకున్నట్లుగానే వివేక్ రాజ్ సింగ్ కు పోలీసు డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం వచ్చింది. ఈ క్రమంలో వయసు పెరిగే కొద్ది బరువు కూడా పెరుగుతూ వచ్చారు. 

పని ఒత్తిడిలో పడి దాన్ని వివేక్ రాజ్ పెద్దగా పట్టించుకోలేదు.అది అలా అలా కొండలా పెరిగి 130కిలో బరువుకు చేరుకున్నారు. బరువు పెరగటంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా రావటంతో తిరిగి తన బరువు తగ్గించుకోవాలనుకున్నారు. పైగా డ్యూటీకి ఊబకాయం పెద్ద అడ్డంకిలా మారింది. తానే అలా ఉంటే తన కింద పనిచేసేవారు ఇంకెలా ఉంటారు? అని అనుకున్నారు. పైగా పీపాలా ఉన్న ఈ DiG ఏంటీ అంటూ కామెంట్లు కూడా ఆయన చెవిన పడుతుండేవి.

పోలీసులకు ఊబకాయం చాలా ప్రమాదం అని భావించారు. దీంతో బరువు తగ్గాలని పక్కాగా నిర్ణయించుకున్నారు.ఏదో జిమ్ లకు వెళ్లి బరువు తగ్గించుకోవాలనుకోలేదు. వాకింగ్ స్టార్ట్ చేశారు.  అలారోజుకు 6నుంచి ఏడు గంటలు వాకింగ్ చేశారు. కేవలం నడక ద్వారానే ఫిట్‌గా తయారయ్యారు. దీని కోసం ప్ర‌తిరోజూ 6 నుండి 7 గంటలు వాకింగ్ చేస్తూ వచ్చారు. డ్యూటీలో కూడా ఎక్కువగా నడకకే ప్రాధాన్యం ఇచ్చేవారు. దీంతో ఇప్పుడు ఆయన 96 కిలోలకు వచ్చారు. ఇంకా రెండు కిలోలు తగ్గాలని నియమం పెట్టుకున్నానని ఆయన చెబుతున్నారు. ఇది చూసిన తోటి సిబ్బంది ఆశ్చర్యపోతున్నారు.

దీనిపై DiG వివేక్ రాజ్ సింగ్ మాట్లాడుతూ..ఎలాగైనా సరే బరువు తగ్గాలనుకున్నాను..దీని కోసం ప్రతీ రోజు ఏడెనిమిది గంటలు వాకింగ్ చేశారు. డ్యూటీలో ఉండగా దగ్గర్లో ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినా నడిచే వెళ్లేవాడిననీ.. తెలిపారు. అంతేకాదు చిన్ననాటి నుంచి నేను ఊబకాయంతోనే ఉండేవాడిననీ..8వ క్లాస్ లో ఉన్నప్పుడు నా బరువు 80కిలోలు..అంటే ఎంత లావుగా ఉండేవాడినో ఊహించుకోండి..నా లావు చూసి తోటి పిల్లలంతా నన్ను ఎగతాళి చేసేవారనీ గుర్తుచేసుకున్నారు.

కానీ ప్రతీ మనిషికి బరువు చాలా ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతుందని..ముఖ్యంగా ఈ అధిక బరువు నా ఉద్యోగానికి చాలా సమస్య. అందుకే నేను కేవలం వాకింగ్ తోనే 130 కిలోల బరువు నుంచి 34కిలోల బరువు తగ్గి ఇప్పుడు 96 కిలోలకు తగ్గానని తెలిపారు. 

Read: సినిమా సీన్‌ను తలపించేలా…రైతుల సమస్యలు తీర్చేందుకు రైతు వేషంలో వెళ్లిన మంత్రి