హస్తప్రయోగం అలవాటు ఉందా? ఇన్ఫెక్షన్లు ఏమి చేయలేవు!.. సైన్స్ తేల్చేసింది

  • Published By: sreehari ,Published On : February 22, 2020 / 01:17 PM IST
హస్తప్రయోగం అలవాటు ఉందా? ఇన్ఫెక్షన్లు ఏమి చేయలేవు!.. సైన్స్ తేల్చేసింది

మీకు హస్తప్రయోగం చేసే అలవాటు ఉందా? అయితే మీరెంతో ఆరోగ్యవంతులు. ఎలాంటి రోగాలు మిమ్మల్ని దరిచేరవు.. ఏ ఇన్ఫెక్షన్లు ఏమి చేయలేవు. బ్యాక్టీరియా, కరోనా వైరస్ వంటి మహమ్మారుల వల్ల కలిగే ప్రాణాంతక వ్యాధులు కూడా తోకముడిచి పారిపోవాల్సిందేనట.. ప్రతిరోజు హస్త ప్రయోగం చేసేవారంతా పుష్టిగా ఆరోగ్యంగా ఉంటారనడంలో సందేహం లేదంటున్నారు నిపుణులు.. హస్తప్రయోగం చేసేవారిలో వ్యాధినిరోధక శక్తి అధికంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు.. మీలోని ఒత్తిడిని కూడా క్షణాల్లో దూరం చేస్తుందని అంటున్నాయి.

హస్త ప్రయోగం చేసేవారిలో హాయిని అనుభూతిని కలిగిస్తుందంట.. నూతన ఉత్తేజాన్ని అందిస్తుందంట. హస్తప్రయోగం చేసేటప్పుడు (డోపామైన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్) అనే మంచి హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. వీటినే ఫీల్ గుడ్ హార్మోన్లు అని కూడా పిలుస్తారు. ఫలితంగా రోగ నిరోధక వ్యవస్థ అధిక స్థాయిలో వృద్ధిచెందడానికి సాయపడతాయని పరిశోధనలు తేల్చిచెబుతున్నాయి.

ఈ హార్మోన్ల ప్రభావంతో రిలాక్స్ మూడ్‌లోకి వెళ్లడమే కాకుండా సుఖనిద్రకు ప్రేరేపిస్తుంది. అధిక స్థాయిలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఈ హార్మోన్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. చెడు అలవాట్లతో రోగ నిరోధక శక్తి తగ్గిపోయినట్టే.. మంచి అలవాట్లతో ఆరోగ్యకరమైన నిద్ర, చురుకైన లైంగిక జీవితాన్ని ఆశ్వాధించవచ్చు. తద్వారా మీరు అనారోగ్యానికి గురికాకుండా రక్షిస్తాయి.  

హస్త ప్రయోగంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది :
మనిషి శరీరంలో కలిగే అనేక రకాల ఉద్వేగాలకు మూల కారణం మెదడు స్పందించే విధానంపైనే ఆధారపడి ఉంటుంది. శారీరక సమస్యలు లేదా మానసిక ఆరోగ్య సమస్యలకు తరచూ మెదడే ప్రభావితం అవుతుంది. హస్తప్రయోగం చేసేవారిలో కొన్ని రకాల ఉద్వేగాలకు లోనైన సమయంలో విడుదలయ్యే రసాయనాలు, హార్మోన్లతో శరీరం, మెదడు ఎలా స్పందిస్తాయో తెలుసుకోవాలని ఉందా? హస్తప్రయోగం చేసినప్పుడు డోపామైన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. అమితమైన అనందాన్ని అనుభవించే సామర్థ్యంతో ముడిపడి ఉంటుంది.

ఉద్వేగం సమయంలో విడుదలయ్యే హార్మోన్ తోపాటు ఆక్సిటోసిన్ అనే హర్మోన్ కూడా విడుదల అవుతుంది. వీటిని సాధారణంగా ‘లవ్ హార్మోన్’ అని కూడా పిలుస్తారు. ఈ రసాయనాల సమ్మేళనం మన మానసిక స్థితిని ట్యూన్ చేస్తుంది. విశ్రాంతిని ప్రేరేపిస్తుంది. హస్తప్రయోగం చేసినప్పుడు విడుదలయ్యే ఆక్సిటోసిన్.. కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ ను తగ్గిస్తుంది. ఫలితంగా ఒత్తిడి తగ్గుతుంది. ఇది సాధారణంగా ఆందోళన, భయాందోళన లేదా బాధపడే సమయాల్లో ఎక్కువ పరిమాణంలో విడుదలవుతుంది. ఆక్సిటోసిన్, డోపామైన్ స్థాయిలు పెరగడం ద్వారా ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. మెదడు రిలాక్స్ మూడ్ లోకి వెళ్లి ప్రశాంత స్థితికి చేరుకుంటుంది. 

రోగనిరోధక శక్తి, తెల్లరక్త కణాల సంఖ్య పెరుగుతాయి :
హస్త ప్రయోగం ఎక్కువగా చేసేవారిలో రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా తెల్ల రక్త కణాల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతాయి. ఫలితంగా వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎలాంటి ఇన్ఫెక్షన్లు దరిచేరవు. ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటారు. తరచూ జలుబు వంటి సమస్యలు కూడా పెద్దగా రావు. వచ్చినా వెంటనే తగ్గిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. హస్త ప్రయోగం ద్వారా రోగనిరోధక వ్యవస్థ వృద్ధి చెందడానికి సరైన వాతావరణాన్ని కల్పిస్తుందని హార్మోన్-థెరపీ స్పెషలిస్ట్ డాక్టర్ జెన్నిఫర్ లాండా చెప్పారు.

యూనివర్శిటీ క్లినిక్ ఆఫ్ ఎసెన్ (జర్మనీలో) లో మెడికల్ సైకాలజీ విభాగం నిర్వహించిన అధ్యయనంలో కూడా ఇలాంటి ఫలితాలను చూపించినట్టు తెలిపారు. తెల్ల రక్త కణాల సంఖ్య, రోగనిరోధక వ్యవస్థపై హస్త ప్రయోగం ద్వారా ఉద్వేగం ప్రభావాలను పరిశీలించే అధ్యయనంలో 11 మంది వాలంటీర్ల బృందం పాల్గొన్నారు. ఈ ప్రయోగం సమయంలో, ప్రతి పాల్గొనేవారి తెల్ల రక్త కణాల సంఖ్య 5 నిమిషాల ముందు, 45 నిమిషాల స్వీయ-ప్రేరిత ఉద్వేగానికి చేరుకున్నట్టుగా నిర్ధారించింది. 

జలుబు, ఫ్లూ అంటు వ్యాధులు రానే రావు :
లైంగిక ప్రేరేపణ, ఉద్వేగం తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచాయని ఫలితాలు నిర్ధారించాయి, ముఖ్యంగా సహజ కిల్లర్ కణాలు అంటువ్యాధుల నుండి పోరాడటానికి సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా జలుబు, ఫ్లూ లక్షణాలను నివారిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ అనేది కణాలు, అవయవాల సమతుల్య కేంద్రం లాంటిది. ఇది మీ శరీర వ్యవస్థలోకి ప్రవేశించకుండా బ్యాక్టీరియా, వైరస్ సోకడం ద్వారా అంటువ్యాధులు, ఇతర వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ఎన్నో పనులు ఉన్నాయి. అయినప్పటికీ హస్త ప్రయోగం చేయడం ద్వారా కలిగే ఉద్వేగంతో మొత్తం రోగనిరోధక వ్యవస్థపై సానుకూల ప్రభావాలను కలిగిస్తుందని రుజువైంది.

మైగ్రేన్.. వంటి తలనొప్పుల నుంచి ఉపశమనం :
న్యూరాలజిస్ట్ తలనొప్పి నిపుణుడు స్టీఫన్ ఎవర్స్ చెప్పిన ప్రకారం.. ముగ్గురు రోగులలో ఒకరు లైంగిక చర్య లేదా ఉద్వేగం అనుభవించడం ద్వారా మైగ్రేన్ నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారని అన్నాడు. లైంగిక కార్యకలాపాలతో వారి అనుభవాలు వారి నొప్పి స్థాయిలను ఎలా ప్రభావితం చేశాయో చూడటానికి ఎవర్స్, అతని బృందం 800 మైగ్రేన్ రోగులు, ఇతర తలనొప్పితో బాధపడుతున్న 200 మంది రోగులతో ఒక ప్రయోగాన్ని నిర్వహించారు.

ఇందులో మైగ్రేన్ బాధితుల్లో 60శాతం మంది లైంగిక చర్యలో పాల్గొన్న తర్వాత నొప్పి తగ్గిపోయిందని అధ్యయనంలో తేలింది. క్లస్టర్-తలనొప్పి బాధితులలో మాత్రం 50 శాతం మంది లైంగిక ప్రేరేపణ, ఉద్వేగం తర్వాత వారి తలనొప్పి మరింత తీవ్రమైనట్టుగా గుర్తించినట్టు చెప్పారు. లైంగిక చర్య సమయంలో తలనొప్పి మైగ్రేన్ల నుంచి నొప్పి తగ్గని వారిలో.. నొప్పి తగ్గిన వారి మాదిరిగా పెద్ద మొత్తంలో ఎండార్ఫిన్‌లను విడుదల చేయలేదని ఎవర్స్ తన పరిశోధనలలో గుర్తించినట్టు తెలిపారు. 

అన్ని అపోహలే.. ఇది ఆరోగ్యకరమైన అలవాటే :
మరోవైపు హస్తప్రయోగంపై చాలామందిలో ఎన్నో అపోహలు ఉంటాయి. ప్రతిరోజు హస్తప్రయోగం చేయడం ద్వారా అంగస్తంభన వంటి సమస్యలు తలెత్తుతాయని ఆందోళన చెందుతుంటారు. ఈ విషయంలో ఇప్పటికే సెక్సాలిజిస్టులు సైతం అలాంటి సమస్యలు ఏమి ఉండవని తేల్చిచెప్పారు కూడా. మరికొంతమంది హస్తప్రయోగం రోజుకు ఎన్ని సార్లు చేయాలి?

ఒక రోజులో ఎక్కువ సార్లు చేస్తే ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు వస్తాయా? అని ఆందోళనపడే వారు లేకపోలేదు. దీనిపై సెక్సాలిజిస్టులు అదంతా.. అపోహ మాత్రమేనని, అలాంటి సందేహాలు పెట్టుకోవద్దని సూచిస్తున్నారు.. నిజానికి హస్తప్రయోగమనేది ఒక ఆరోగ్యకరమైన అలవాటుగా సెక్సాలిజిస్టులు సూచిస్తున్నారు. ఇదేదో అంటరానిదిగా తప్పుగా చూడాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు.