Moderna వ్యాక్సిన్.. 94.5 శాతం ప్రభావవంతం

  • Published By: sreehari ,Published On : November 17, 2020 / 06:47 AM IST
Moderna వ్యాక్సిన్.. 94.5 శాతం ప్రభావవంతం

Moderna

Moderna’s Covid vaccine : ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఏ కరోన వ్యాక్సిన్ ముందుగా వస్తుందా? అనే ఆసక్తి నెలకొంది. ఇప్పటకే పలు ఫార్మా కంపెనీలు తమ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని చెబుతూ వస్తున్నాయి.



ట్రయల్స్ ఫలితాల్లో 90కు పైగా శాతం ప్రభావంతంగా పనిచేస్తుందని అంటున్నాయి. ఇప్పటికే టీకా 90 శాతానికి పైగానే ప్రభావం చూపుతున్నట్లు ఫైజర్, బయోఎన్‌టెక్‌ సంస్థలు వెల్లడించిన సంగతి తెలిసిందే.

మరో ప్రముఖ ఫార్మాస్యూటికల్‌ సంస్థ మోడెర్నా తమ వ్యాక్సిన్ కూడా 94.5 శాతం ప్రభావంతంగా పనిచేస్తుందని సోమవారం ప్రకటించింది. మోడెర్నా సంస్థ ఎంఆర్‌ఎన్‌ఏ–1273 పేరిట కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది.



94.5 శాతం సామర్థ్యాన్ని ఉందని డేటా సేఫ్టీ మానిటరింగ్‌ బోర్డు మూడోదశ ట్రయల్స్‌లో వెల్లడైందని మోడెర్నా పేర్కొంది. వ్యాక్సిన్ వినియోగానికి యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం నుంచి ఎమర్జెన్సీ హెల్త్‌ ఆథరైజేషన్ ‌(EUA) దరఖాస్తు చేసుకోవాలని మోడెర్నా భావిస్తోంది.
https://10tv.in/drink-turmeric-milk-and-stay-away-from-diseases/
ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ వినియోగం కోసం అనుమతులు తీసుకోవాలని నిర్ణయించింది. కోవిడ్‌–19 నిరోధానికి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా దేశంలోని 135 కోట్ల మందికి పంపిణీ చేయడం సవాల్ తో కూడుకున్న పని అంటున్నారు విశ్లేషకులు.



దేశం మొత్తమ్మీద 28 వేల టీకా కోల్డ్‌ స్టోరేజ్‌ యూనిట్ల నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిలోనూ –25 డిగ్రీ సెల్సియస్‌ కంటే తక్కువ ఉష్ణోగ్రతలున్న టీకాలను నిల్వ చేసుకునే సౌకర్యం లేదు.