ఎన్ఐఎన్ హెచ్చరిక : హైదరాబాదీలు జాగ్రత్త..తినకుంటే అంతే  

  • Published By: veegamteam ,Published On : March 24, 2019 / 08:37 AM IST
ఎన్ఐఎన్ హెచ్చరిక : హైదరాబాదీలు జాగ్రత్త..తినకుంటే అంతే  

హైదరాబాద్‌ : ఆహారం సరిగా తీసుకోకపోవటం..అదికూడా సరైన సమయానికి తీసుకోకపోవటం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. వీటి వల్ల పలు విటమిన్స్ లోపాలు ఏర్పడతాయి. మిటమిన్స్ లోపం ఉంటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. అసలే రోజు రోజుకు పెరుగుతున్న వాహనాలతో పొల్యూషన్ తో వాయు కాలుష్యంతో బాధ పడే నగర వాసులకు విటమిన్ల లోపంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తోంది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్ సంస్థ. 
 

ఈ క్రమంలో హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో నివసిస్తోన్న ప్రజలపై నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్ (ఎన్ఐఎన్)పరిశోధన చేసింది. ఈ పరిశోధనల్లో హైదరాబాదీల్లో విటమిన్ల లోపం ఎక్కువగా ఉందని గుర్తించింది.  ఆహరం సరిగా తీసుకోకపోవడం వల్ల విటమిన్ ఎ, విటమిన్ డి, బీ1, బీ2, బీ6, బీ12, ఫోలెట్ విటమిన్ల లోపంతో బాధపడుతున్నారని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్ తెలిపింది. 
 

హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో నివసిస్తోన్న 50 శాతం మందిలో విటమిన్ బి2 లోపం ఉండగా.. 46 శాతం మంది బీ6 లోపంతో బాధపడుతున్నారట. 46 శాతం మంది విటమిన్ బీ12, 32 శాతం మంది ఫోలెట్, 29 శాతం మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. రక్తంలో హోమోసిస్టెయిన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ముఖ్యంగా పురుషుల్లో హోమోసిస్టెయిన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని..దీని వల్ల గుండె జబ్బులు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉందని ఎన్ఐఎన్.  కాబట్టి తరచుగా విటమిన్ల స్థాయిలకు సంబంధించి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.