పిల్లల్లో మధుమేహానికి కొత్త ఔషధం

  • Published By: veegamteam ,Published On : May 1, 2019 / 02:56 AM IST
పిల్లల్లో మధుమేహానికి కొత్త ఔషధం

చిన్నపిల్లలు, కౌమారదశలోని వారిలో టైప్ 2 మధుమేహానికి చికిత్స అందించేందుకు కొత్త ఔషధాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రయోగశాలలో ఈ ఔషధ పరీక్షలు విజయవంతం అయ్యాయి. ప్రస్తుతం పెద్దలో టైప్ 2 మధు మేహానికి చికిత్స కోసం దాదాపు 30 రకాల మందులను అమెరికా ఆహార, ఔషధ ప్రాధికార సంస్థ ఆమోదించిగా, పిల్లల్లో టైప్ 2 మధుమేహానికి మాత్రం రెండే మందులను వినియోగించేందుకు సంస్థ ఆమోదం తెలిపింది.

పిల్లలకు టైప్ 2 మధుమేహం వస్తే ప్రస్తుతం మెట్ ఫార్మిన్, ఇన్సులిన్ అనే రెండు రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కొత్త మందును కనుగొనేందుకు పరిశోధన చేసిన అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన జేన్ లించ్ మాట్లాడుతూ ‘ఇప్పటివరకు పిల్లల్లో మధుమేహానికి రెండు ముందులను మాత్రమే మనం ఔషధ సంస్థ చేత ఆమోదింపజేసుకోగలిగాం, కొత్తగా మేం కొనుగొన్న ఈ మందు చాలా ప్రభావంతంగా పనిచేస్తోంది’ అని అన్నారు.