research: ఆక‌లిగా ఉన్న వేళ‌.. తీవ్ర‌ కోపం, చిరాకు, నిరుత్సాహం..

మూడు వారాల పాటు 64 మంది వ్య‌క్తులపై ప‌రిశోధ‌న చేసి వాటి ఫ‌లితాలను శాస్త్రవేత్తలు వివ‌రించి చెప్పారు. వారి ఆక‌లి, భావోద్వేగ స్థాయుల‌ను రికార్డు చేసుకున్నామని తెలిపారు. ఆ 64 మంది వారికి సంబంధించిన వివ‌రాల‌ను రోజుకి ఐదు సార్లు స్మార్ట్‌ఫోన్ యాప్‌ ద్వారా త‌మ‌కు అందించార‌ని చెప్పారు. ఆక‌లి వేసిన స‌మ‌యంలో తీవ్ర‌ కోపం (37 శాతం), చిరాకు(34 శాతం), నిరుత్సాహం(38 శాతం) వారిలో క‌న‌ప‌డ్డాయ‌ని తెలిపారు.

research: ఆక‌లిగా ఉన్న వేళ‌.. తీవ్ర‌ కోపం, చిరాకు, నిరుత్సాహం..

Angry Girl

research: ఆక‌లిగా ఉంటే ఏ ప‌నీ చేయ‌లేము. చాలా నీర‌సంతో పాటు చిరాకుగా ఉంటుంది. ఆక‌లి వ‌ల్ల మ‌నిషి ప్ర‌వ‌ర్త‌న‌లో వచ్చే మార్పుల గురించి ప‌రిశోధ‌కులు ఓ అధ్య‌య‌నం చేసి ప‌లు విష‌యాలు గుర్తించారు. తీవ్ర‌ కోపం, చిరాకు, నిరుత్సాహాల‌కు ఆక‌లికి మధ్య సంబంధం ఉంటుంద‌ని తేల్చారు. ఆక‌లిగా ఉన్న స‌మ‌యంలో చిరాకు ప‌డిన అనుభ‌వాలు మ‌న‌కి కొత్తేమీ కాదు. అయితే, ఈ విష‌యంపై ఇప్ప‌టివ‌ర‌కు ప‌రిశోధ‌నాత్మ‌క వివ‌రాలు లేవు. తాజాగా, ఇందుకు సంబంధించిన‌ అంశాల‌ను యూకేలోని ఆంగ్లియా రస్కిన్ (ఏఆర్‌యూ), ఆస్ట్రియాలోని కార్ల్ ల్యాండ్‌స్టైనర్ విశ్వవిద్యాల‌యాల‌ ప‌రిశోధ‌కులు శాస్త్రీయ ప‌ద్ధ‌తిలో గుర్తించి వివ‌రించారు.

Nandyal: అతిసారతో ఒకరి మృతి.. మ‌రో అరుగురికి ఆసుపత్రిలో చికిత్స‌

మూడు వారాల పాటు 64 మంది వ్య‌క్తులపై ప‌రిశోధ‌న చేసి వాటి ఫ‌లితాలను వివ‌రించి చెప్పారు. వారి ఆక‌లి, భావోద్వేగ స్థాయుల‌ను రికార్డు చేసుకున్నామని తెలిపారు. ఆ 64 మంది వారికి సంబంధించిన వివ‌రాల‌ను రోజుకి ఐదు సార్లు స్మార్ట్‌ఫోన్ యాప్‌ ద్వారా త‌మ‌కు అందించార‌ని చెప్పారు. ఆక‌లి వేసిన స‌మ‌యంలో తీవ్ర‌ కోపం (37 శాతం), చిరాకు(34 శాతం), నిరుత్సాహం(38 శాతం) వారిలో క‌న‌ప‌డ్డాయ‌ని తెలిపారు. ఆక‌లి వ‌ల్ల మాన‌సిక ప్ర‌వ‌ర్త‌న‌లో వ‌స్తోన్న మార్పుల గురించి అవ‌గాహ‌న ఉంటే వాటిని త‌గ్గించుకునే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు.