కరోనా వైరస్‌కు ఎలాంటి చికిత్సా లేదు

  • Published By: sreehari ,Published On : February 5, 2020 / 01:32 PM IST
కరోనా వైరస్‌కు ఎలాంటి చికిత్సా లేదు

వూహాన్ నగరాన్ని దిగ్భందించింది. వైరస్ చేరిందన్న నగరాల సరిహద్ధులను మూసేసింది. చైనావైరస్ గా ప్రపంచం పేరుపెట్టిన కరొనావైరస్ ను ఎలాగైన కట్టిడిచేయాలన్నది పంతం. సూపర్ పవర్ గా ఎదుగుతున్న తమకు ఈ వైరస్ ఎంత నష్టం చేస్తుందో, అమెరికా ఎలా పరువుతీస్తోందో చైనాకు తెలుసు. 25వేల మందికి కరోనా సోకింది. 500 పైగా చనిపోయారు. 15రోజుల్లోనే కరోనా ధాటి బాగా పెరిగింది.

మహమ్మారిగా మారుతున్న కరోనాను ఎక్కడికక్కడ అడ్డుకొంటున్నా కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తోంది. చైనాకు వచ్చి వెళ్తున్న క్రూయిజ్ షిప్ ల్లో వేలాదిమంది చిక్కుకున్నారు. వాళ్లను తీరంలో అడుగుపెట్టడానికి హాంగ్ కాంగ్, జపాన్లు ఒప్పుకోవడంలేదు. చైనా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటీవ్ రిజల్ట్స్ అంటే హడలెత్తిపోతున్నారు. చైనావైరస్ భయంతో పెద్ద కంపెనీలు సెలవులు ప్రకటిస్తున్నాయి. 

బోయింగ్ విమాన సంస్థకూడా ప్లాంట్ ను మూసేసింది. వైరస్ తగ్గాకే మళ్లీ తెరుస్తామంది. చైనావైరస్ కు మందును కనిపెట్టడంలో ముందడగుపడిందన్న వార్తలను ప్రపంచ ఆరోగ్యసంస్థ కొట్టేసింది. చైనా నుంచి మొదలై 20దేశాలకు వ్యాపించిన కరొనాకు ఇంతవరకు ఇతిమిద్ధంగా ఇదీ చికిత్స అని కనిపెట్టలేదని, ఇంకా వైరస్ మీద పరిశోధనలు సాగుతున్నాయని తేల్చేసింది.

జీజియాంగ్ యూవర్సిటీ పరిశోధకులు కరొనా కట్టడికి మార్గాన్ని కనిపెట్టారని ఓ చైనా టీవీ ప్రకటించింది. బ్రిటన్ స్కై న్యూస్ కూడా చెప్పుకోదగిన ముందడుగుపడిందని ఊదరగొట్టింది. వాక్సిన్ తయారీ ఇక మొదలైనట్లేనన్న వార్తలను ఆరోగ్యసంస్థ పట్టించుకోలేదు. కరొనాకు ఇంకా వైద్యం కనిపెట్టలేదని తేల్చేసింది.