అమెరికన్ల మెంటల్ హెల్త్ లో భారీ మార్పులు…1/3వంతు మందిలో డిప్రెషన్,యాంగ్జైటీ

  • Published By: venkaiahnaidu ,Published On : May 27, 2020 / 07:07 AM IST
అమెరికన్ల మెంటల్ హెల్త్ లో భారీ మార్పులు…1/3వంతు మందిలో డిప్రెషన్,యాంగ్జైటీ

ఓ వైపు కరోనా మహమ్మారితో అగ్రరాజ్యం అల్లాడిపోతున్న సమయంలో ఇప్పుడు అక్కడి ప్రజల్లో మానసిక ఆకోగ్యంలో పెద్ద ఎత్తున మార్పులు కనిపిస్తున్నాయని ఓ సర్వేలో తెలింది. కరోనా మహమ్మారి…అమెరికన్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపించినట్లు ఆ సర్వే చెబుతుంది. ఎంప్లాయిమెంట్,హౌసింగ్,ఫైనాన్సెస్,ఎడ్యుకేషన్,హెల్త్ పై కరోనా మహమ్మారి ప్రభావం ఎలా పడిందో తెలుసుకునేందుకు న్యూ ఎమర్జెన్సీ వీక్లీ సర్వేలో భాగంగా ఏప్రిల్ చివర్లో  యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో ఇటీవల నిర్వహించిన సర్వేలో కొన్ని ఆశక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

1/3వ వంతు అమెరికన్లలో anxiety(ఆందోళన),depression(మానసిక కృంగుబాటు)ను గుర్తించినట్లు ఈ సర్వే తెలిపింది. అంటే ప్రతి 100మంది అమెరికన్లలో 34మందిలో ఈ లక్షణాలు కనిపించినట్లు తెలిపింది. కొందరిలో ఈ రెండు లక్షణాలను గుర్తించినట్లు సర్వే తెలిపింది. కరోనా మహమ్మారి విజృంభణ, ఫలితంగా వరుస షట్ డౌన్ లు, మరణాల సంఖ్య పెరగిపోవడం,నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోవడం,ఆర్థిక అనిశ్చితి వంటి పరిణామాలన్నీ అమెరికన్ల మెంటల్ హెల్త్ పై ప్రభావం చూపుతున్నాయన్న సర్వే ఫలితాలు భయంకరమైన సంకేతంగా కనిపిస్తున్నాయి.

డాయతెత.jpg

పెద్దలలో ప్రతి 100మందిలో 10మందికి డిప్రెషన్ లక్షణాలు, ప్రతి 100మందిలో నలుగురిలో anxiety లక్షణాలు, ప్రతి 100మందిలో 20మంది అమెరికన్లకు ఈ రెండు లక్షణాలు ఉన్నట్లు సర్వే తెలిపింది. ముఖ్యంగా ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్న వారిలో పేదలు, యువత,మహిళలు ఉన్నారని…మిస్సిసిప్పి రాష్ట్రంలో అయితే ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో తేలింది. ఆ రాష్ట్రంలోని దాదాపు సగం మంది పెద్దలలో ఈ రెండు లక్షణాలను గుర్తించారు.

మొత్తంగా, సర్వేలో పాల్గొన్న వారిలో 24 శాతం మంది పెద్ద డిప్రెసివ్ డిసార్డర్(అధిక మానసిక కృంగుబాటు వ్యాధి లేదా రుగ్మత) యొక్క వైద్యపరమైన ముఖ్యమైన లక్షణాలను చూపించగా, 30శాతం మంది సాధారణమైన ఆందోళన రుగ్మత(generalized anxiety disorder)లక్షణాలను కనబర్చినట్లు తెలిపింది. 2014నాటి డేటాతో పోల్చిచూసినప్పుడు.. అమెరికన్ల మానసిక ఆరోగ్యం(mental health)లో భారీ క్షీణతను ఈ ఫలితాలు చూపిస్తున్నాయి. 2014తో పోల్చితే… నిరాశ, నిస్పృహ లేదా నిస్సహాయ భావన ఉన్నవారి సంఖ్య ఇప్పుడు రెట్టింపు అయింది.

Read: స్పైడర్ మ్యాన్ అవ్వాలని సాలీడుతో కొరికించుకున్న అన్నదమ్ములు