గండిపేట చెరువు 47 కోట్ల మంది దాహార్తిని తీరుస్తోంది

  • Published By: chvmurthy ,Published On : February 17, 2020 / 02:23 AM IST
గండిపేట చెరువు 47 కోట్ల మంది దాహార్తిని తీరుస్తోంది

హైదరాబాద్ లోని ఉస్మాన్ సాగర్ చెరువులోని నీరు సంవత్సరానికి 47కోట్ల మంది  ప్రజల దాహార్తిని తీర్చగలదు. భారతదేశ జనాభాలోని మూడింట ఒక వంతు ప్రజల తాగునీటి అవసరాలాను  సంవత్సరం పొడుగునా తీర్చగలదు.  ఏంటి… ఈ వార్త …వింతగా అనిపిస్తోందా…. నిజమే మీరు చదువుతున్నది.  ఇక్కడ లెక్కలు అవే చెపుతున్నాయి. ఉస్మాన్ సాగర్ ను గండిపేట చెరువు అనికూడా పిలుస్తారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో  ఉస్మాన్ సాగర్  చెరువు ఉంది.ఈ చెరువు చుట్టూ 46 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో…… జలాశయం 29 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతోనూ ఉంటుంది. 

జలాశయం పూర్తి స్ధాయి నీటిమట్టం 1,790 అడుగులు. 1908లో హైదరాబాద్ నగరంలో ఉన్న మూసీనదికి జలప్రళయం వచ్చిన తరువాత హైదరాబాద్ వాసులకు త్రాగునీటిని అందించడానికి హైదరాబాద్ చివరి నిజాం ఉస్మాన్ ఆలీ ఖాన్ 1920 లో మూసీనదిపై ఉస్మాన్ సాగర్ వంతెన నిర్మించాడు. ఉస్మాన్ ఆలీ ఖాన్ పేరుమీదుగా ఈ వంతెనకు ఉస్మాన్ సాగర్ గా పేరు పెట్టడం జరిగింది. ఒకసారి జలాశయం భూగర్భ జలాలు, వర్షపు నీటితో నిండిందంటే 17.395 కిలోల లక్షల లీటర్లకు చేరుకుంటుందని అంచనాలు చెపుతున్నాయి. ఈ నీరు ఒక సంవత్సరం పాటు 47.34 కోట్ల మందికి లేదా 90 సంవత్సరాలకు 52.60 లక్షల మంది తాగునీటి అవసరాలను తీర్చడానికి ఇది సరిపోతుంది.

భారత ప్రభుత్వం యొక్క వర్షపు నీటి పెంపకం మరియు పరిరక్షణ మాన్యువల్ ప్రకారం, 100 చదరపు మీటర్ల పోరస్ భూమిలో వార్షిక వర్షపాతం 800 మి.మీ ఉంటే సంవత్సరానికి 80,000 లీటర్ల నీరు లభిస్తుంది. ఈ లెక్కన పరిశీలిస్తే, 22 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఉస్మాన్‌సాగర్ లో వార్షిక వర్షపాతం 800 మిమీ ఉన్నందున సంవత్సరానికి 17,395 కిలో లక్షల లీటర్లు దిగుబడి వస్తుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) రోజుకు ఒక వ్యక్తికి 10 లీటర్ల చొప్పున తాగునీటి ప్రమాణాలను నిర్ణయించింది. ఇది సంవత్సరానికి 3.65 కిలో లీటర్లకు సరిపోతుంది. WHO ప్రమాణం ఆధారంగా, ఉస్మాన్‌సాగర్ (17,395 కిలో లక్షల లీటర్లు) లో చేరిన జలాలు 47.65 కోట్ల జనాభాకు  అనగా భారతదేశంలో మూడింట ఒక వంతు 365 రోజులు సరిపోతాయి. 

ఉస్మాన్‌సాగర్  జలాశయం మూసి నదికి అడ్డంగా ఉన్న సరస్సు కాదు. ఇది హైదరాబాద్‌లోని మూసి దిగువకు వచ్చే వరద ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. ఉస్మాన్ సాగర్ జలాశయం నీటితో నిండి ఉంటే నగరంలోని ఐటి కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు హైదరాబాద్ లోని పశ్చిమ భాగాలలోనూ భూగర్భ జలమట్టం పెరిగి ప్రజల నీటి అవసరాలను తీరుస్తోంది.  అంతే కాదు అనేక జలచరాలు ఉస్మాన్ సాగర్ లో జీవిస్తున్నాయి. 

ఉస్మాన్ సాగర్ ఎండిపోయిందంటే  హైదరాబాద్ నగరంలో తాగునీటికి  కటకట ఏర్పడుతుంది. భూగర్భ జలమట్టాలు పడిపోతాయి.  హైదరాబాద్ లో తాగునీరు సప్లై  చేసే కృష్ణ, గోదావరి నదుల నుంచి వచ్చే నీటికి  ఇబ్బంది ఏర్పడితే ఉస్మాన్ సాగర్ నీరే అత్యవసర సమయాల్లో సహాయపడుతుంది. ఇదే ఎండిపోతే నగరంలో తాగునీటి కొరత తీవ్రమవుతుంది.  కోల్పోతుంది.