మా కోవిడ్ వ్యాక్సిన్.. వాలంటీర్లలో రోగనిరోధక శక్తిని పెంచింది : CureVac

  • Published By: sreehari ,Published On : November 3, 2020 / 12:39 PM IST
మా కోవిడ్ వ్యాక్సిన్.. వాలంటీర్లలో రోగనిరోధక శక్తిని పెంచింది : CureVac

CureVac : జర్మనీ బయోటెక్ సంస్థ CureVac అభివృద్ధి చేసిన ప్రయోగాత్మక కోవిడ్-19 వ్యాక్సిన్‌తో రోగనిరోధక శక్తి పెరిగిందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఏడాదిలో భారీగా కరోనా టెస్టులు జరుగుతుండగా.. వ్యాక్సిన్ల రేసులో క్యూర్ వాక్ కూడా వచ్చి చేరింది.



ప్రస్తుతం తమ వ్యాక్సిన్ మొదటి ట్రయల్ దశలో కొనసాగుతోందని చీప్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ Franz-Werner Haas పేర్కొన్నారు. ఈ బయోటిక్ సంస్థ తమ వ్యాక్సిన్ అభివృద్ధిలో RNA (mRNA) మెసేంజర్ వినియోగిస్తోంది. ఇప్పటికే Moderna, BioNTech, Pfizer కంపెనీలు కూడా mRNA మెసేంజర్ వినియోగిస్తున్నాయి.

జూలై తర్వాత నుంచి టెస్టింగ్ ట్రయల్స్ మొదలుపెట్టేశాయి. తమ పొటెన్షియల్ వ్యాక్సిన్ ను CVnCoV పేరుతో CureVac అభివృద్థి చేస్తోంది. ట్రయల్స్ ఫలితాల ఆధారంగా ఈ ఏడాది ఆఖరిలోగా చివరి దశ ట్రయల్స్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది.



ఇందులో 30వేల మంది వాలంటీర్లతో ట్రయల్స్ నిర్వహించాలని భావిస్తోంది. హ్యుమన్ ట్రయల్స్ దశలో చాలామంది వాలంటీర్లలో ఎక్కువ మొత్తంలో యాంటీబాడీలు తయారైనట్టు గుర్తించామని జర్మనీ బయోటెక్ ఇన్వెస్టర్ Dietmar Hopp తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారినపడి 1.2 మిలియన్లమంది ప్రాణాలు కోల్పోయారు.

ఇప్పటివరకూ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్లలో 45 వ్యాక్సిన్లు ప్రయోగాత్మక దశలో కొనసాగుతున్నాయి. బ్రిటన్ కు చెందిన AstraZeneca, యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ భాగస్వామ్యంతో పనిచేస్తోంది. ఈ ఏడాదిలో చివరి దశ ఫలితాలు రానున్నాయి.



mRNA పోటీదారుల కంటే తక్కువ మోతాదులోనే కరోనా వ్యాక్సిన్ అందించాలని CureVac కంపెనీ భావిస్తోంది. మూడో దశ ట్రయల్స్‌లో మొత్తం ఐదు మోతాదుల్లో 2 నుంచి 12 మైక్రోగ్రాముల వరకు వ్యాక్సినేషన్ ఇవ్వనుంది.



BioNTech, Pfizer కంపెనీలు ట్రయల్‌లో 30 మైక్రోగ్రాముల షాట్ ఎంచుకున్నాయి. ఈ కంపెనీలు నిర్వహించిన ట్రయల్స్ లో పాల్గొన్న వాలంటీర్లలో కరోనా నుంచి కోలుకున్నవారిలో యాంటీబాడీలు పెరిగినట్టు గుర్తించారు.