కరోనా వైరస్ ఎక్కించుకుంటే రూ.3 లక్షలు ఇస్తారంట!

  • Published By: sreehari ,Published On : March 10, 2020 / 10:52 AM IST
కరోనా వైరస్ ఎక్కించుకుంటే రూ.3 లక్షలు ఇస్తారంట!

ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ను నిరోధించేందుకు సైంటిస్టులు విస్తృత స్థాయిలో పరిశోధనలు చేస్తున్నారు. కరోనా వైరస్ కు వ్యాక్సీన్ కనిపెట్టేందుకు సాధ్యమైనంత వరకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. లండన్ లోని Queen Mary BioEnterprises Innovation Centre కు చెందిన నిపుణులు మనుషులపైనే ప్రయోగానికి సిద్ధమయ్యారు.

ఆరోగ్యవంతమైన వారిని ఎంపిక చేసి వారికి కరోనా వైరస్ ఎక్కించి చికిత్స చేస్తామంటున్నారు. కరోనా వైరస్ జాతికి చెందిన అదే రకమైన OC43, 229E వైరస్‌లను స్వచ్ఛంధంగా వచ్చిన వారికి ఎక్కించనున్నారు. కరోనా వైరస్ ఎక్కించుకున్నవారికి ఒక్కొక్కరికి ( £3 500 పౌండ్లు)  రూ.3లక్షలు చెల్లిస్తామని అంటున్నారు.
caronavirus

ఈ ప్రయోగంలో పాల్గొనేందుకు వాలంటీర్లు ముందుకు వచ్చారు. 24 బ్యాచులుగా విభజించి వారికి కరోనా వైరస్ ఎక్కించనున్నారు. ఈ రెండు వైరస్ జాతులు.. కరోనా జాతుల్లో ఒకే రకమైనవి.. కానీ, ప్రాణాంతకమైన వైరస్‌‌లు కావు.. స్వల స్థాయిలో శ్వాసకోశ లక్షణాలు ఉంటాయి. Covid-19 వైరస్ అంతా తీవ్రస్థాయిలో మాత్రం ఉండవని the daily star నివేదికలు వెల్లడించాయి.  

ఏది ఏమైనా సైంటిస్టులు మాత్రం.. ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ కంట్రోల్ చేసేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 3,500 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
Vaccine

ఈ ప్రయోగంలో స్వచ్ఛందంగా పాల్గొనేవారంతా రెండు వారల పాటు ప్రత్యేకమైన వార్డుల్లో ఉండాల్సి ఉంటుంది. కఠినమైన డైట్ తో పాటు ఎలాంటి వ్యాయామాలు చేయకూడదు.. ఎవరితోనూ ఫిజికల్ కాంటాక్టు పెట్టుకోకూడదు. వీరిపై దశలు వారీగా పరీక్షలు నిర్వహిస్తుంటారు. వైరస్ ఎక్కించుకున్న వారి నాసిక రంధ్రం, బ్లడ్ శాంపిల్స్ తీసుకుని టెస్టులు చేస్తారు.

ఇలోగా వైద్య సిబ్బంది రక్షణతో కూడిన వస్త్రాలతో బాధితులు వాడిన మురికితో కూడిన టిస్సూలను సేకరిస్తుంటారు. Hvivo అనే కంపెనీకి చెందిన ల్యాబరేటరీలో ఈ పరిశోధన ప్రారంభం కానుంది. అంతకంటే ముందుగా యూకేలోని మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ అజెన్సీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. అప్పుడే పరిశోధన ప్రారంభించే అవకాశం ఉంది.
mask coronva

కొవిడ్-19 వ్యాక్సీన్ క్రియేటర్లకు భారీ రివార్డు లభించనుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) రూపొందించిన జాబితాలో దాదాపు 35 మంది వ్యాక్సీన్ అభ్యర్థులతో కూడిన జాబితాను సిద్ధం చేశారు. ఈ జాబితాలో Hvivo కంపెనీ లేదు. కరోనా వైరస్ కు సరైన వ్యాక్సీన్ కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా $2,000,000,000 (about £1,528,800) పరీక్షల కోసం ఖర్చు చేస్తున్నట్టు ఒక నివేదిక తెలిపింది.

ఏప్రిల్ నెలాఖరు నుంచి ఈ పరిశోధన ప్రారంభం కానుంది. ఇందులో పాల్గొనే వాలంటీర్లంతా నిర్భంధంలో ఉండాల్సి ఉంటుందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక తెలిపింది. కరోనా వ్యాక్సీన్ ఎక్కించుకున్నందుకు వాలంటీర్లకు $1,100 (£836) పొందవచ్చునని తెలిపింది.

See Also | నాయనమ్మ కల నెరవేర్చబోతున్న జ్యోతిరాధిత్య సింధియా