పింక్ “ఐ” కూడా కరోనా సంకేతమే

  • Published By: venkaiahnaidu ,Published On : July 31, 2020 / 06:43 PM IST
పింక్ “ఐ” కూడా కరోనా సంకేతమే

2019 డిసెంబరులో చైనాలో తొలిసారిగా కరోనావైరస్(కోవిడ్-19) కనుగొనబడినప్పటి నుండి నిపుణులు దాని గురుంచి ఇంకా కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూనే ఉన్నారు. వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉన్న సమయంలో, వైద్యులు అసలు మూడు పెద్ద విషయాలు( దగ్గు, జ్వరం మరియు శ్వాస ఆడకపోవడం)తో పాటు కొత్త లక్షణాలను కనుగొన్నారు.



కండ్లకలక లేదా పింక్ “ఐ”(లేత ఎరుపు రంగులో ఉన్న కన్ను)ఇటీవల కనుగొనబడిన COVID-19 సంకేతం. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ యొక్క లక్షణాల జాబితాలో పింక్ ఐ కనిపించదు.  కానీ మీకు COVID-19 వస్తే మీరు సంక్రమణను అభివృద్ధి చేయవచ్చు.

అయినప్పటికీ, పింక్ రంగులో ఉన్న కన్ను చాలా అరుదు మరియు 1-3 శాతం COVID కేసులతో మాత్రమే సంబంధం కలిగి ఉందని NYU లాంగోన్ హెల్త్ క్లినికల్ అసోసియేట్ ప్రొఫెసర్, నేత్ర వైద్యుడు లీలా వి. రాజు తెలిపారు. సాధారణంగా, COVID రోగులు… చలి, కండరాల నొప్పి, తలనొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం మరియు గొంతు నొప్పిని అనుభవిస్తారు.


పింక్ “ఐ” కి కారణమేమిటి?

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం… ఇది పిల్లలకు సమస్యగా మీరు అనుకోవచ్చు, కాని పెద్దవారిలో కండ్లకలక చాలా సాధారణం. కరోనావైరస్ తో సహా బ్యాక్టీరియా, అలెర్జీలు లేదా వైరస్ ల వల్ల ఇన్ఫెక్షన్ సంభవిస్తుంది. ఈ సూక్ష్మక్రిములు అన్ని విలక్షణమైన మార్గాల్లో వ్యాప్తి చెందుతాయి- దగ్గు లేదా తుమ్ము ఉన్న వారితో సన్నిహిత పరిచయం మరియు మురికి చేతులతో మీ ముఖాన్ని తాకడం వలన.

పింక్ “ఐ” కరోనావైరస్ యొక్క లక్షణమా?
ఇది చాలా అరుదు, కానీ కరోనావైరస్.. కన్ను పింక్ రంగులో ఉండటానికి కారణమవుతుంది. అనారోగ్య వ్యక్తి దగ్గు, తుమ్ము, లేదా మాట్లాడేటప్పుడు విడుదలయ్యే చిన్న బిందువుల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. సాధారణంగా, రోగులు ఈ బిందువులలో శ్వాస తీసుకున్న తర్వాత COVID ను అభివృద్ధి చేస్తారు. కాని మీ కళ్ళ ద్వారా వ్యాధి బారిన పడే అవకాశం ఉందని అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ తెలిపింది.



పింక్ “ఐ” మరియు COVID-19 యొక్క సమ్మతి… సాధారణంగా ఎవరైనా కలుషితమైన ఉపరితలాన్ని తాకినప్పుడు,ఆ తర్వాత వారి కంటిని తాకినప్పుడు జరుగుతుంది. కానీ మీ అసురక్షిత ముఖంమీద ఎవరైనా నేరుగా దగ్గుతుంటే మీరు అనారోగ్యానికి గురవుతారు-అందుకే సామాజిక దూరం ముఖ్యమైనది అని డాక్టర్ రాజు చెప్పారు. సామాజిక దూరం సాధ్యం కాని ప్రదేశాలలో గాగుల్స్ (కళ్ళజోడు) లేదా ఇతర కంటి రక్షణ సహాయపడుతుందని అయన తెలిపారు.

పింక్ “ఐ” వస్తే మీరు ఏమి చేయాలి?
మీరు కండ్లకలక కేసు కంటే ఎక్కువగా అనుమానించినట్లయితే COVID-19 టెస్ట్ చేయించుకోవడం బెటర్. మీరు ఇతరుల పక్కన ఉన్నపుడు మాస్క్ ధరించాలి. క్వారంటైన్ అవ్వాలి. మరియు మీకు .ఊపిరి సమస్య ఉంటే కేర్ తీసుకోవాలి.