Calcium and Potassium-rich diets: కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడకుండా ఇలా చెక్ పెట్టొచ్చు.. గుర్తించిన పరిశోధకులు

కొందరికి కిడ్నీలో పదే పదే రాళ్ళు ఏర్పడుతోన్న సమస్యలపై పరిశోధకులు తాజా పలు కీలక విషయాలను గుర్తించారు. కిడ్నీలో రాళ్ళు వచ్చిన వారికి భవిష్యత్తులో మరోసారి అవి రాకుండా ఉండాలంటే కాల్షియం, పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందని పరిశోధకులు తేల్చారు.

Calcium and Potassium-rich diets: కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడకుండా ఇలా చెక్ పెట్టొచ్చు.. గుర్తించిన పరిశోధకులు

Calcium and Potassium-rich diets

Calcium and Potassium-rich diets: పొత్తికడుపులో నుంచి పొడుచుకువచ్చే నొప్పి.. వాంతులు.. వికారం.. మూత్ర విసర్జన చేసేటప్పుడు రక్తం.. కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు అనుభవించే బాధలు ఇవి. కొందరికి కిడ్నీలో రాళ్ళు పదే పదే వస్తుంటాయి. శారీరక శ్రమ లేకపోవడం, స్థూలకాయం, మధుమేహం ఉన్నవారికి కిడ్నీలో రాళ్ళు అధికంగా వస్తాయి. కొందరికి కిడ్నీలో పదే పదే రాళ్ళు ఏర్పడుతోన్న సమస్యలపై పరిశోధకులు తాజా పలు కీలక విషయాలను గుర్తించారు. కిడ్నీలో రాళ్ళు వచ్చిన వారికి భవిష్యత్తులో మరోసారి అవి రాకుండా ఉండాలంటే కాల్షియం, పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందని పరిశోధకులు తేల్చారు.

కిడ్నీలో రాళ్ళకు హృదయ సంబంధ, బోలు ఎముకల వ్యాధులకు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధికి మధ్య సంబంధం ఉంటుందని, వీటికి తోడు విపరీతమైన నొప్పి కూడా ఉంటుందని చెప్పారు. ఒకసారి కిడ్నీలో రాళ్ళు ఏర్పడితే, ఐదేళ్ళలో మరోసారి ఏర్పడే అవకాశం 30 శాతం ఉంటుందని పరిశోధకులు అన్నారు. తాజా పరిశోధనకు సంబంధించిన వివరాలను మాయో క్లినిక్ ప్రొసీడింగ్స్ జర్నల్ లో ప్రచురించారు. తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటే రెండోసారి కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా అడ్డుకోవచ్చని పరిశోధకులు స్పష్టం చేశారు.

కాల్టియం, పొటాషియం అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకునే వారు రెండోసారి లేదా మూడోసారి కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా నిరోధించుకోగలుగుతున్నారని చెప్పారు. తమ పరిశోధనలో భాగంగా 2009 నుంచి 2018 మధ్య మొత్తం 411 మంది నుంచి వివరాలు సేకరించామని అన్నారు. వారందరూ తొలిసారి కిడ్నీలో రాళ్ళ సమస్యలను ఎదుర్కొన్న వారేనని చెప్పారు. వారిలో 73 మందికి 4.1 ఏళ్ళలో రెండోసారి కిడ్నీల్లో రాళ్ళు వచ్చాయని గుర్తించామని తెలిపారు.

కాల్షియం, పొటాషియం తక్కువగా ఉన్న ఆహారం తీసుకున్న వారిలో రెండోసారి కిడ్నీల్లో రాళ్ళు వచ్చే అవకాశం ఉందని గుర్తించినట్లు చెప్పారు. ఆహార నియమాల వల్ల రెండోసారి కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా చూసుకోవచ్చని తమ పరిశోధన ద్వారా స్పష్టమవుతోందని తెలిపారు. ప్రతిరోజు 1,200 మిల్లీగ్రాముల కాల్షియం తీసుకుంటే కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడకుండా కాపాడుకోవచ్చని చెప్పారు. పొటాషియాన్ని కూడా అధికంగా తీసుకోవాలని తెలిపారు. అయితే, ఏ స్థాయిలో తీసుకోవచ్చో వివరాలు చెప్పలేదు.

US Slams China’s Actions: చైనా పాల్పడుతోన్న చర్యలపై అమెరికా మరోసారి ఆగ్రహం