Negative impact on children mental health: పిల్లల మాన‌సిక ఆరోగ్యంపై తీవ్ర‌ ప్ర‌భావం చూపిన‌ ‘క‌రోనా విజృంభ‌ణ’

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ ప్ర‌భావం చిన్నారుల మాన‌సిక‌ ఆరోగ్యంపై బాగా ప‌డింద‌ని ప‌రిశోధ‌కులు గుర్తించారు. చిన్నారుల్లో త‌ల‌నొప్పి బాధితులు పెరిగార‌ని తేల్చారు. క‌రోనా విజృంభ‌ణ స‌మ‌యంలో చాలా మంది చిన్నారుల్లో ప‌దే ప‌దే త‌ల‌నొప్పి రావ‌డం, ఆందోళ‌న, ఆత్రుత వంటివి పెర‌గ‌డం వంటివి గుర్తించిన‌ట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను తాజాగా జ‌ర్న‌ల్ ఆఫ్ చైల్డ్ న్యూరాల‌జీలో ప్ర‌చురించారు.

Negative impact on children mental health: పిల్లల మాన‌సిక ఆరోగ్యంపై తీవ్ర‌ ప్ర‌భావం చూపిన‌ ‘క‌రోనా విజృంభ‌ణ’

Negative impact on children's mental health

Negative impact on children’s mental health: క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ ప్ర‌భావం చిన్నారుల మాన‌సిక‌ ఆరోగ్యంపై బాగా ప‌డింద‌ని ప‌రిశోధ‌కులు గుర్తించారు. చిన్నారుల్లో త‌ల‌నొప్పి బాధితులు పెరిగార‌ని తేల్చారు. క‌రోనా విజృంభ‌ణ స‌మ‌యంలో చాలా మంది చిన్నారుల్లో ప‌దే ప‌దే త‌ల‌నొప్పి రావ‌డం, ఆందోళ‌న, ఆత్రుత వంటివి పెర‌గ‌డం వంటివి గుర్తించిన‌ట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను తాజాగా జ‌ర్న‌ల్ ఆఫ్ చైల్డ్ న్యూరాల‌జీలో ప్ర‌చురించారు.

క‌రోనా విజృంభ‌ణ స‌మ‌యంలో దైనందిన జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎదుర‌వ‌డం, సామాజిక దూరం పాటించ‌డం, ఆరోగ్యం పాడ‌వుతుంద‌ని ఆందోళ‌న చెంద‌డం వంటివి పిల్ల‌ల్లో తీవ్ర ప్రతికూల ప్ర‌భావం చూపాయ‌ని, దీంతో వారిలో త‌ల‌నొప్పి సంబంధింత స‌మ‌స్య‌లు త‌లెత్తాయ‌ని ప‌రిశోధ‌కులు చెప్పారు. ఒత్తిడి, దైనందిన జీవితంలో మార్పుల వంటివాటి ప్ర‌భావం పిల్ల‌ల‌పై ఎలా ప‌డుతుంద‌న్న విష‌యంపై ఈ ప‌రిశోధ‌న ద్వారా మ‌రింత తెలుసుకోగ‌లిగామ‌ని తెలిపారు.

క‌రోనా స‌మ‌యంలో సాధార‌ణ రోజుల్లా కాకుండా కంప్యూట‌ర్, మొబైల్ ద్వారా సంభాష‌ణ‌లు, పాఠాలు విన‌డం వంటి వాతావ‌ర‌ణం పిల్ల‌ల్లో ఒంట‌రి త‌నం వంటి భావాలు, ఆత్రుతను క‌లిగించాయ‌ని వివ‌రించారు. త‌మ ప‌రిశోధ‌న‌లో భాగంగా, త‌ల‌నొప్పితో బాధ‌ప‌డుతున్న‌ 107 మంది పేషెంట్ల‌ను 2020 వేస‌వి కాలం నుంచి 2021 వ‌ర్షాకాలం వ‌ర‌కు ప‌లు ర‌కాల ప్ర‌శ్న‌లు అడిగి, వివ‌రాలు న‌మోదు చేసుకున్నామ‌ని చెప్పారు.

క‌రోనా విజృంభ‌ణ‌కు ముందు త‌ల‌నొప్పి 22 శాతం మంది ప్ర‌తిరోజు త‌ల‌నొప్పితో బాధ‌ప‌డిన‌ట్లు చెప్పార‌ని, క‌రోనా విజృంభ‌ణ స‌మ‌యంలో అది 36 శాతానికి పెరిగింద‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు. క‌రోనా విజృంభ‌ణ స‌మ‌యంలో తీవ్ర త‌ల‌నొప్పితో బాధ‌ప‌డ్డామ‌ని 49 శాతం మంది తెలిపారు. క‌రోనా స‌మ‌యంలో శారీర‌క శ్ర‌మ త‌గ్గింద‌ని 54 శాతం మంది తెలిపారు. ప్ర‌తిర‌జు త‌ల‌నొప్పి రావ‌డంతో చాలా మందిలో చిరాకు క‌నుప‌డింద‌ని చెప్పారు.

Weather update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మ‌ళ్ళీ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం