Fitness Tricks : ఆరోగ్యాన్ని కాపాడే, ఆయుష్షు పెంచే ఫిట్ నెస్ ట్రిక్స్ మీ కోసం..

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండేందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది. పర్యావరణం, ఆహారం, జీవనశైలిలో మార్పులు మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. తక్కువ వయసులో రోగాలతో మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే, ఆయుష్షు పెరగాలంటే ఏం చేయాలి..?

Fitness Tricks : ఆరోగ్యాన్ని కాపాడే, ఆయుష్షు పెంచే ఫిట్ నెస్ ట్రిక్స్ మీ కోసం..

Fitness Tricks

Fitness Tricks : ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండేందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది. పర్యావరణం, ఆహారం, జీవనశైలిలో మార్పులు మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. తక్కువ వయసులో రోగాలతో మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆయుష్షు పెరగాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? నిపుణులు ఏమంటున్నారు.

సైన్స్ ప్రకారం కొన్ని ఫిట్ నెస్ ట్రిక్స్ పాటిస్తే కచ్చితంగా మెరుగైన ఆరోగ్యం మన సొంతమవుతుంది. మన ఆయుష్షుని పెంచుకోవచ్చు. ఈ సైన్స్ బ్యాక్డ్  ట్రిక్స్ మనిషి లైఫ్ స్పాన్ ని(జీవిత కాలం) పెంచుతాయి.

ఎక్సర్ సైజులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుండెని పదిలంగా ఉంచుతాయి. కండరాలను గట్టి పరుస్తాయి. ఎనర్జీ లెవెల్స్ పెంచుతాయి. మానసికంగా, శారీరకంగా ఫిట్ గా ఉంచుతాయి. మనిషి ఎక్కువ రోజుల పాటు ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామాలు తోడ్పడతాయి. అలాంటి కొన్ని ఎక్సర్ సైజులు(ఫిట్ నెస్ ట్రిక్స్) నిపుణులు సూచిస్తున్నారు. వర్కౌట్స్, బ్రిస్క్ వాకింగ్, నడక ఇవన్నీ మన ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచేందుకు దోహద పడతాయని, త్వరగా మరణం సంభవించే రిస్క్ ని తగ్గిస్తాయని నిపుణులు చెప్పారు.

చురుకైన నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. మెల్లగా నడిచే వాళ్లతో పోలిస్తే వేగంగా నడిచే వారికి ఫలితాలు ఎక్కువ. గంటకు మూడు మైళ్లు లేదా నిమిషానికి 100 స్టెప్పులు ఉండేలా చూసుకోవాలి. మహిళా వాకర్ల విషయానికి వస్తే 72ఏళ్ల బతికారు. అదే పురుష వాకర్ల సంగతికి వస్తే వారు 87ఏళ్లు జీవించారు. ఓ అధ్యయనంలో ఇది వెల్లడైంది. మొత్తంగా బ్రిస్క్ వాక్ చేసే పురుషులు 86ఏళ్ల వరకు బతికినట్టు అధ్యయనంలో తేలింది. అదే మెల్లగా నడిచే వారి విషయానికి వస్తే వారి లైఫ్ స్పాన్ 65ఏళ్లుగా ఉంది.

రోజూ 4వేల 500 అడుగులు నడిచే వారిలో తొందరగా మరణించే ముప్పు తక్కువగా ఉన్నట్టు మరో అధ్యయనంలో తేలింది. అందుకే రోజూ 4వేల 500 నడక ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇక వర్కౌట్స్ కూడా లైఫ్ స్పాన్ ని పెంచుతాయని చెప్పారు. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్నవారిలో తొందరగా మరణించే ముప్పు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. లైఫ్ స్పాన్ ని పెంచే మరో ఫిట్ నెస్ ట్రిక్.. స్కాట్ ఎక్సర్ సైజ్. రొటీన్ ఎక్సర్ సైజ్ లో స్కాట్స్ ఉండేలా చూసుకోవాలి. స్కాట్స్ ద్వారా భంగిమ, జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. ఎముకల బలాన్ని పెంచుతుంది.