ప్రాణాంతక వైరస్ వ్యాప్తిలో చైనా ‘టైమ్ బాంబ్’ లాంటింది.. 12ఏళ్ల క్రితమే సైంటిస్టులు హెచ్చరించారు!

  • Published By: sreehari ,Published On : March 25, 2020 / 02:19 PM IST
ప్రాణాంతక వైరస్ వ్యాప్తిలో చైనా ‘టైమ్ బాంబ్’ లాంటింది.. 12ఏళ్ల క్రితమే సైంటిస్టులు హెచ్చరించారు!

ప్రపంచమంతా కరోనా వైరస్ (COVID-19) విజృంభిస్తోంది. రోజురోజుకీ విజృంభిస్తున్న కరోనాను నియంత్రించలేక ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. కరోనా మహమ్మారి ప్రబలడంతో 20వేల మంది వరకు మృతిచెందారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జనం ప్రాణాలు తీస్తున్న ఈ కరోనా వైరస్ విజృంభణకు చైనాలోనే పరిస్థితులు టైమ్ బాంబులాంటిదని 12 ఏళ్ల (2007) క్రితమే సైంటిస్టులు హెచ్చరించారు. వైరస్ వ్యాప్తికి చైనానే ప్రధాన కారణంగా మారుతుందని హెచ్చరించినట్టుగా ఒక అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనాన్ని 2007లో జనరల్ క్లినికల్ మైక్రోబయాలజీ రివ్యూస్‌లో ప్రచురించారు.

దక్షిణ చైనాలో ఆహారపు అలవాట్లే కారణం :
దీనికి సంబంధించి పరిశోధకులు అప్పుడే SARS-CoV వంటి వైరస్‌లు ‘గుర్రపుడెక్క గబ్బిలాల నుంచి మాత్రమే కాకుండా దక్షిణ చైనాలోని అన్యదేశ క్షీరదాలను తినే సంస్కృతితో ఎప్పటికైనా పెనుప్రమాదంగా మారుతుందని అది ఒక టైమ్ బాంబులా పేలి ప్రపంచ వినాశానికి దారితీస్తుంది’ అని పరిశోధకులు హెచ్చరించారు. దీనికి దక్షిణ చైనాలోని అక్కడి వారంతా క్రిమికీటకాలను తినడం వంటి సంస్కృతి ముఖ్యకారణమని అధ్యయనం పేర్కొంది.

జంతువులు లేదా ల్యాబరేటర్ల నుంచి వ్యాపించే ఇతర నోవల్ వైరస్ ల్లో Severe Acute Respiratory Syndrome (SARS) వైరస్ లు ఉద్భవించడానికి ఇదే కారణమని తెలిపింది.ఇలాంటి సంస్కృతి పట్ల సంసిద్ధత ఎంతో అవసరమని లేని పక్షంలో మరిన్ని ప్రాణాంతక వైరస్ లు ప్రబలి ప్రపంచ వినాశనం తప్పదని అధ్యయనం అప్పుడే హెచ్చరించింది.

చైనాలో ఈ వైరస్ కనిపించి 17 ఏళ్లు :
సాధారణంగా కరోనావైరస్ లు జన్యుపరమైన పునఃసంయోగానికి లోనవుతాయి. ఇది కొత్త జన్యురూపాలు, వ్యాప్తికి దారితీస్తుందని తెలిపారు. చైనాలో తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (SARS) అనే శ్వాసకోశ వైరస్ కనిపించి 17 సంవత్సరాలు అయ్యింది. గ్లోబల్ SARS వ్యాప్తి చెందుతున్న సమయానికి.. ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా 8,000 మందికి వ్యాపించింది.

దాదాపు 800 మంది మరణించారు. COVID-19 వ్యాధికి కారణమయ్యే కొత్త కరోనావైరస్, SARS-CoV-2, 2003 SARS వ్యాప్తిని చాలా కాలం క్రితం అధిగమించింది. John Hopkins యూనివర్శిటీ కరోనా వైరస్ రీసోర్స్ సెంటర్ నుంచి వచ్చిన తాజా సమాచారం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 20వేల మంది వరకు మృతిచెందగా, 2.40 లక్షలకు పైగా సోకింది.