మనుషుల బ్లడ్ అంటే దోమలకెందుకంత ఇష్టం? సైంటిస్ట్‌లు కనిపెట్టేశారు…

  • Published By: sreehari ,Published On : July 25, 2020 / 08:53 PM IST
మనుషుల బ్లడ్ అంటే దోమలకెందుకంత ఇష్టం? సైంటిస్ట్‌లు కనిపెట్టేశారు…

మనుషుల రక్తమంటే దోమలకెందుకంత ఇష్టమో తెలుసా? పోనూ ఎక్కడైనా విన్నారా? చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. కానీ, సైంటిస్టులు దోమల విషయంలో
అసలు విషయాన్ని కనిపెట్టేశారు. 3,500 దోమల జాతులలో కొద్ది దోమలు మాత్రమే మనుషులను కుడుతాయి.

దోమలకు మానవులకు మధ్య సంబంధం ఏంటి? అనేది ఒక
కొత్త అధ్యయనంలో పరిశోధకులు కనుగొన్నారు. కొన్ని దోమలు మానవ రక్తం పట్ల అభిరుచిని ఎందుకిలా ఏర్పడిందో పరిశోధించారు. పెరిగిన జనాభా సాంద్రత మానవ
రక్తానికి దోమల వ్యాప్తికి ప్రధాన పాత్ర పోషించింది.

దోమల్లో చిన్నవిగా ఉండేవి మనుషులను ఎక్కువగా బాధించేవిగా ఉంటాయి. ఇవి ప్రమాదకరమైన అంటు వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. రాబోయే ఏళ్లలో పెరిగిన జనాభాతో దోమలు ఉష్ణమండల ప్రాంతాలలో ప్రాణాంతకంగా మారుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.

డెంగ్యూ, జికా, చికున్‌గున్యా, ఎల్లో జ్వరాలను వ్యాప్తి చేసే దోమల జాతులను గుర్తించారు. వివిధ ఆఫ్రికన్ జనాభాలో దోమలను ఎంతగా ఆకర్షిస్తుందో గుర్తించారు. నగరాల సమీపంలో నివసించే దోమలు గ్రామీణ ప్రాంతాల్లోని దోమల కంటే మనుషులను
కుట్టడానికి ఎక్కువ ఇష్టపడతాయంట. కానీ, వాతావరణం మరింత ముఖ్యమైనదిగా సూచిస్తున్నారు. మానవులను కుట్టే దోమలు ఒకే రకమైన జన్యువులలో తేడాలున్నట్టు
గుర్తించారు.

ఈడెస్ ఈజిప్టి అనే దోమ.. మానవులను కుట్టే ఆఫ్రికా నుంచి వచ్చిన కొన్ని జాతులలో ఒకటిగా గుర్తించారు పరిశోధకులు. గ్రామీణ లేదా అడవి ప్రాంతాల కంటే పట్టణ నగరాల్లోని ప్రజలపైనే దోమలు ఎక్కువగా ఆకర్షించాయని ఓ డేటా సూచిస్తోంది. ఇతర జంతువుల సువాసనలతో పోల్చినప్పుడు పొడి, వేడి ప్రాంతాలలో నివసించే కీటకాలు మానవ సువాసనకు అధిక ప్రాధాన్యత ఇస్తాయని పరిశోధకులు కనుగొన్నారు.

ఈ అధ్యయనం అన్ని దోమలు ఒకేలా ఉండవని అంటున్నారు. కొన్ని వ్యాధులను ఇతరులకన్నా ఎక్కువగా వ్యాపిస్తాయి. జాతులలో కూడా చాలా వైవిధ్యం ఉందని అంటున్నారు. దోమల చరిత్ర, మానవ చరిత్ర ఒకదానితో ఒకటి ముడిపడివున్నాయని చెబుతున్నారు. మనుషుల నడవడి అనుగుణంగానే దోమల పరిణామ క్రమం సాగుతుందని అంటున్నారు.