కరోనా లక్షణాలతో వృషణాల్లో వాపు, నొప్పి.. పురుషుల్లో నపుంసకత్వానికి దారితీస్తుంది : సైంటిస్టుల హెచ్చరిక!

కరోనా లక్షణాలతో వృషణాల్లో వాపు, నొప్పి.. పురుషుల్లో నపుంసకత్వానికి దారితీస్తుంది : సైంటిస్టుల హెచ్చరిక!

Covid-19 symptoms cause testicle swelling lead to infertility  : కరోనావైరస్ సోకిన పురుషుల్లో అత్యంత సాధారణ కోవిడ్ లక్షణం ఒకటి ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా సోకిన పురుషుల్లో వృషణాల్లో వాపు, నొప్పితో పాటు క్రమంగా నపుంసకత్వానికి దారితీస్తుందని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. పురుషుల్లో కరోనా సోకిన తర్వాత అధిక జ్వరంతో పాటు సంతానోత్పత్తి సమస్యలు ఎదుర్కోంటున్నారని నిపుణులు ఇటీవలి అధ్యయనంలో హెచ్చరించారు. కోవిడ్ జ్వరం.. పురుషుల వృషణాలు దెబ్బతిని వాపుకు కారణమవుతుందని తేలింది. జ్వరం, నిరంతర దగ్గు, రుచి లేదా వాసన కోల్పోవడం వంటివి కోవిడ్ మూడు ప్రధాన లక్షణాలుగా అందరికి తెలిసిందే. అయితే అధిక జ్వరం సాధారణంగా 38C లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది.

కరోనావైరస్‌తో అధిక జ్వరం లక్షణంతో పోరాడిన పురుషుల్లో వృషణ కణజాలం తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనుగొన్నారు. అస్సాం యూనివర్శిటీ అధ్యయనంలో కోవిడ్-19 గణనీయమైన సంతానోత్పత్తి సమస్యలకు దారితీస్తుందనే ఆధారాలను సైంటిస్టులు వెల్లడించారు. పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యానికి ప్రపంచ ముప్పుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే పురుషులు మహిళల కంటే SARS-CoV-2 వ్యాధికి అధికంగా గురవుతారని గత అధ్యయనాల్లో వెల్లడైంది. పురుష సంతానోత్పత్తిపై కోవిడ్-19 ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు.

కరోనా వ్యాప్తితో అధిక జ్వరం కారణంగా ఆర్కిటిస్ అభివృద్ధి చెందుతుంది. తద్వారా వృషణం పనిచేయకపోవచ్చు. కరోనా చికిత్స వాడే Ribavirin డ్రగ్ ద్వారా కూడా పురుషుల్లో సంతానోత్పత్తిపై ప్రభావం పడుతుందని నివేదిక వెల్లడించింది. కానీ, ఎలుకలకు ఇచ్చినప్పుడు స్పెర్మ్ అసాధారణతలకు కారణమవుతుందని కనుగొన్నారు. Ribavirin డ్రగ్ తీసుకున్న తరువాత జంతువులలో టెస్టోస్టెరాన్ తక్కువ సాంద్రత ఉన్నట్లు గుర్తించారు. స్పెర్మ్ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

కరోనా నుంచి కోలుకున్న పురుషుల్లో ఇప్పటికీ వారి వీర్యంలో కోవిడ్-19ను కలిగి ఉన్నారని పరిశోధకులు పేర్కొన్నారు.కరోనాకు గురైన 38 మంది రోగుల డేటాను చైనా శాస్త్రవేత్తలు విశ్లేషించారు. 15 మంది ఇంకా ఆసుపత్రిలోనే ఉండగా.. 23 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.  16 శాతం మందిలో వారి స్పెర్మ్ నమూనాలో కరోనావైరస్ కారణమయ్యే SARS-CoV-2 అనే వైరస్ ఉందని గుర్తించారు.