ఈ అమ్మాయి హార్ట్ ఆగిపోయింది. మళ్లీ రీస్టార్ట్. మూడేళ్లలో ఎనిమిది సార్లు చచ్చిబతికింది

  • Published By: sreehari ,Published On : October 4, 2020 / 07:28 PM IST
ఈ అమ్మాయి హార్ట్ ఆగిపోయింది. మళ్లీ రీస్టార్ట్. మూడేళ్లలో ఎనిమిది సార్లు చచ్చిబతికింది

2017, ఆగస్ట్ లో Amy Mettersకి నడుంకింద నుంచి శరీరం మొత్తం చచ్చుబడిపోయింది. అప్పుడే ఆమెకు తొలిసారి గుండెపోటు. ఆగిన గుండే ఏడునిమషాల తర్వాత మళ్లీ కొట్టుకుంది. ఆమె చచ్చిపోయిందనుకొని భోరమన్నవాళ్లలో ఆశ్చర్యం. ఆగిన గుండె మళ్లీ కొట్టుకోవడం ఏంటి? అదీ ఏడునిమషాల తర్వాత? డాక్టర్లకు అర్ధంకాలేదు. అది ఫస్ట్ సర్‌ప్రైజ్.

పదేళ్ల క్రితం ఆమీకి postural tachycardia syndrome (PoTS) వచ్చింది. అంటే ఆమె కూర్చున్నా, నిల్చున్నా ఆమె హార్ట్ రేట్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఇదే ఆమెకున్న రోగం. వైరల్ ఇన్ఫెక్షన్, tonsillitis రీపీటెడ్ గా వస్తే ఈ వ్యాధి వస్తుందంట. ఆమెకు కొద్దినెలల్లోనే ఐదుసార్లు ఎఫెక్ట్ అయ్యాయి.



అందువల్ల, ఆమె నిల్చోబోతే ఆమెకు హార్ట్ బీటింగ్ పెరిగి కుప్పకూలిపోతుంది. అది సరే, దానికి, హార్ట్ ఎటాక్ కు సంబంధమేంటి? డాక్టర్లకు అర్ధంకావడంలేదు.

తనకున్న ఆరోగ్యస్థితి భయపెడుతోందని ఆమీ ఒప్పుకున్నా, పాజిటీవ్ గానే థింక్ చేస్తోంది. బాధపడకుండా బ్లాగ్ రన్ చేస్తోంది. తాను ఎలా వ్యాధిని ఎదుర్కొంటున్నానో చెబుతూ అవగాహన కలిగిస్తోంది.
</script> ఆమెకు హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు CPR ఇచ్చారు. అప్పుడు ఆమెకు రిబ్స్ విరిగిపోయాయి. హాస్పటల్ లో ఉన్నప్పుడే మరో మూడుసార్లు హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆమె గుండె ఆగిపోయింది. ఈ సంగితి ఆమెకు తెలుస్తూనే ఉంది. మొత్తం మీద నాలుగుసార్లు. మళ్లీ రిస్టార్ట్. గట్టిగా ఊపిరిపీల్చుకుంది.



ఎందుకిలా జరుగుతుందో, ఇంకెన్నిసార్లు గుండె ఆగుతుందో కూడా ఆమెకు తెలియదు. అసలు ఆ ప్రశ్నకు సమాధానమూ లేదు.  PoTSకి ఇది సింప్టమ్ అంటున్నారు డాక్టర్లు. నిజానికి, వాళ్లకూ ఏం జరుగుతోందో అర్ధంకాలేదు.