పొట్టిగా ఉంటే షుగర్ వచ్చే ఛాన్స్‌లు ఎక్కువ

పొట్టిగా ఉంటే షుగర్ వచ్చే ఛాన్స్‌లు ఎక్కువ

పొడవుగా ఉండేవారితో పోలిస్తే పొట్టిగా ఉండేవారికి మధుమేహం వచ్చే అవకాశాలు  ఎక్కువ అయ్యాయని జర్మనీ అధ్యయనం వెల్లడించింది. ఎత్తు తగ్గిన కొద్దీ శరీర పరిమాణంలో మార్పు కారణంగా షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని వెల్లడించింది. ఎత్తు తగ్గుదలలో ప్రతి 4 అంగుళాలకు మధుమేహం ముప్పు మగవారికైతే 41%, ఆడవారికైతే 33%మేరకూ పెరుగుతూ ఉన్నట్లు పరిశోధకులు గమనించారు. 

దీనికి కారణం ఎత్తేనట. హైట్ తక్కువగా ఉండే వారి కాలేయంలో కొవ్వు స్థాయిలు ఎక్కువగా ఉండటం, గుండె జబ్బులు, ఇతరత్రా జీవక్రియ సంబంధ జబ్బులకు దారితీసే అధిక రక్తపోటు, కొలస్ట్రాల్, వాపు ప్రక్రియలు సైతం ఎక్కువగానే ఉంటుండటం గమనార్హం. ఇవన్నీ మధుమేహాన్ని తెచ్చిపెట్టేవే. అందుకే కాలేయ కొవ్వును తగ్గించే పద్ధతులతో మధుమేహం ముప్పును తగ్గించుకునే అవకాశం లేకపోలేదని పరిశోధకులు సూచిస్తున్నారు. 

శరీర పరిమాణం తేడాతో మెటబాలిజంలో కూడా మార్పులు ఉంటాయట. అది  మహిళల్లో ప్రత్యేకంగా పీరియడ్స్ సమయంలో, గర్భిణీగా ఉన్నప్పుడు, చిన్నతనంలోనూ, యుక్త వయస్సు వచ్చే ముందు ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.