కరోనా సోకకుండా ఉండాలంటే మాస్క్ ధరించాలా? వద్దా? సైన్స్ ఏం చెబుతోంది?

  • Published By: sreehari ,Published On : April 4, 2020 / 09:56 AM IST
కరోనా సోకకుండా ఉండాలంటే మాస్క్ ధరించాలా? వద్దా? సైన్స్ ఏం చెబుతోంది?

మీలో కరోనా వైరస్ లక్షణాలు లేనప్పుడు.. మీరు ఫేస్ మాస్క్ ధరించాలా? వద్దా? ప్రతిఒక్కరిని ఎక్కువగా అడిగే మొదటి ప్రశ్న ఇదే.. కరోనా వ్యాప్తి సమయంలో చాలామంది ఇదే ప్రశ్నలు తరుచుగా అడుగుతుంటారు. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మీరు ఫాలో అయితే.. ఇప్పటివరకూ ఎక్కువగా సమాధానం చెప్పింది.. ఒకటే.. ఏప్రిల్ 3 వరకు CDC సమాధానం కూడా ఇదే.. అంటే మాస్క్ లు ధరించాల్సిన అవసరం లేదు.. ప్రారంభ మార్గదర్శకాల్లో హెల్త్ కేర్ దృష్ట్యా బయట ప్రదేశాల్లో మాత్రమే ఫేస్ మాస్క్ లు ధరించాలి. అది కూడా వారు అనారోగ్యానికి గురైన సమయంలోనే.. ఇతరులు తమ కారణంగా ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు ఫేస్ మాస్క్ లు ధరించాల్సి ఉంటుంది. అనారోగ్యానికి గురైన వ్యక్తి తుమ్మినా లేదా దగ్గినప్పుడు వారి నుంచి తుంపరలు మరొకరికి వ్యాప్తి చెందకుండా మాస్క్ అడ్డుకుంటుంది.

కానీ, సమాఖ్య మార్గదర్శకం ప్రకారం.. మాస్క్ అక్కర్లేదు. ఏప్రిల్ 3న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా సీడీసీ సిఫార్సు చేసినట్టుగా సాధారణ జనాభా నాన్ మెడికల్ మాస్క్ ధరించవచ్చు. కర్చీప్ లేదా కట్ టీషర్ట్ లతో మాస్క్ లు గా వాడుకోవచ్చు. ఇంట్లో నుంచి గ్రాసరీ స్టోర్లకు వెళ్లినప్పుడు వీటిని వినియోగించుకోవచ్చు. ప్రపంచ దేశాల్లోని కొన్ని దేశాల ప్రభుత్వాలు మాత్రం ఫేస్ మాస్క్ లపై వేర్వేరు సమాధానాలను ఇస్తున్నాయి.

చైనాలో జాతీయ మార్గదర్శకాలతో వేర్వేరు రకాల ఫేస్ మాస్క్ లను సాధారణ జనాభా వారి ఆరోగ్య సమస్యలు, వృత్తుల రీత్యా సిఫార్స్ చేసేవారు. కరోనా వైరస్ నుంచి సామాన్య ప్రజలను మాస్క్ లు సమర్థవంతంగా పనిచేయలేవని, మాస్క్ లు కొనడం మానేయండి అంటూ యూఎస్ సర్జన్ జనరల్ డాక్టర్ జెర్మె అడామ్స్ ట్వీట్ చేశారు. ఫేస్ మాస్క్‌లతో నేరుగా వైరస్ సోకకుండా అడ్డుకోవచ్చు మాత్రమే కానీ, పూర్తిగా నివారించలేవని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాల్సిందేనా? :
మొదటి క్యాంప్‌లో జనాభాలో ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలా? అంటే ఒక్కొక్కరూ ఒక్కొలా సమాధానిమిస్తుంటారు. ఇన్ఫ్లూయింజా వంటి వ్యాధుల నుంచి ఆరోగ్యవంతమైన వారు మాస్క్ లు ధరించడం ద్వారా కొంతమేరకు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. రెండో క్యాంప్ లోని జనాభా మాత్రం సైంటిఫిక్ ఆధారాలతో కొంతమేరకు మాస్క్ లు సమర్థవంతంగా పనిచేస్తాయని నమ్ముతున్నారు. ముఖాన్ని ఎక్కువసార్లు తాకేవారికి ఇన్ఫెక్షన్లకు గురి కాకుండా ఉండేందుకు ఈ మాస్క్ లు ఉపయోగపడతాయి. 

తీవ్రమైన మాస్క్‌ల కొరత  : 
ప్రత్యేకించి అమెరికాలో మాస్క్ ల కొరత ఏర్పడానికి కారణం అక్కడ కరోనా కేసుల తీవ్రత అత్యధిక సంఖ్యలో నమోదు కావడమే.. మాస్క్ ల కొరత కారణంగా అమెరికాలోని హెల్త్ కేర్ వర్కర్లకు మాస్క్ ల కొరత వచ్చి పడింది. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్ (PPE) సాయంతో వైద్యులు కరోనా రోగులకు చికిత్స అందించాల్సిన అవసరం ఉంటుంది. అందులో N95 రిస్పేరటర్స్ (టైట్ ఫిట్టింగ్ ఫేషియల్ డివైజెస్) సర్జికల్ మాస్క్ వాడటం వల్ల తుమ్మినా లేదా దగ్గినప్పుడు పెద్ద పరిమాణంలో తుంపరలు మాస్క్ లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాయి. గాలిని ఫిల్టర్ చేస్తాయి. వైరస్ కణాలను బ్లాక్ చేస్తాయి. 

మాస్క్‌లపై సైన్స్ ఏం చెబుతోంది :
సర్జికల్ మాస్క్ లు సమర్థవంతంగా పనిచేస్తాయని ఇప్పటికే చాలా అధ్యయనాలు తమ పరీక్షల్లో రుజువు చేశాయి. సర్జికల్ మాస్క్ లతో శ్వాసపరమైన వైరస్ లు, అనారోగ్యానికి గురి కాకుండా అరోగ్యవంతమైన వారిని కాపాడవచ్చు. ఫ్లూ సీజన్ సమయంలో ఆరోగ్యంగా ఉన్న కాలేజీ విద్యార్థులు తమ క్యాంపస్ లో ఫేస్ మాస్క్ లు ధరించగా.. అనారోగ్యానికి గురికావడం పెద్దగా తగ్గినట్టు గుర్తించలేదన్నారు. మాస్క్ ధరించిన విద్యార్థుల్లో తమ చేతులు తరచుగా శానిటైజ్ చేసుకున్నవారు మినహా మిగిలినవారంతా అనారోగ్యానికి గురైనట్టుగా నిర్ధారించింది.  

హోం మేడ్ మాస్క్‌లు సురక్షితమేనా? :
ప్రస్తుత పరిస్థితుల్లో సీడీసీ మెడికల్ గ్రేడ్ ఫేస్ మాస్క్ లను రికమండ్ చేస్తోంది. ఇవి అందుబాటులో లేవు. హెల్త్ కేర్ సిబ్బంది హోంమేడ్ మాస్క్ లనే వాడుతున్నారు. హ్యాండ్ కర్చీఫ్, స్క్రాఫ్స్ వంటి వాడుతున్నారు. హోంమేడ్ మాస్క్ లను PPE మాస్క్ లుగా పరిగణించరు. ఇవి హెల్త్ కేర్ సిబ్బందికి ఎంతవరకు సురక్షితంగా ఉంచగలవు చెప్పలేమని 2013లో ప్రచురించిన Aiello అధ్యయనం ఒకటి తెలిపింది. ఇంట్లోని మెటేరియల్స్ కాటన్ టీషర్టులు, స్ర్కాప్స్, టీ టవల్స్, పిల్లో కేసులు, వాక్యూమ్ క్లీనర్ బ్యాగులను కూడా రీసెర్చర్లు పరీక్షలు జరిపారు. 

Also Read | ఇన్నాళ్లు పొల్యూషన్ మనల్ని గుడ్డివాళ్లగా మార్చింది : మొదటిసారి హిమాచల్ పర్వతాలను చూస్తున్న జలంధర్ వాసులు