లైంగిక కోరిక లేనప్పుడు భాగస్వామితో రొమాన్స్ చేయాల్సిందేనా? నిపుణులు ఏమంటున్నారు!

  • Published By: sreehari ,Published On : February 21, 2020 / 12:20 AM IST
లైంగిక కోరిక లేనప్పుడు భాగస్వామితో రొమాన్స్ చేయాల్సిందేనా? నిపుణులు ఏమంటున్నారు!

శృంగారమనేది.. జీవిత భాగస్వాముల మధ్య అనుబంధానికి ప్రతీక… బలమైన బంధానికి పునాది కూడా ఇదేనని సెక్సాలిజిస్టులు అంటున్నారు. లైంగిక వాంఛ లేకుండానే భాగస్వామితో రొమాన్స్ చేయాలా? అంటే అది సరైనది కాదంటున్నారు నిపుణులు. చాలామంది తమకు ఇష్టం లేకపోయినా రొమాన్స్ చేస్తుంటారు. అది భాగస్వామి కోరిందనో లేదా మరి ఏదైనా కారణం కావొచ్చు. లేని లైంగిక కోరికను తెచ్చిపెట్టుకుని రొమాన్స్ ఎంజాయ్ చేస్తామని చెబుతుంటారు. ఇరువురి మధ్య లైంగిక కోరిక కలిగినప్పుడే రొమాన్స్ కలయికకు పూర్తి అర్థాన్ని ఇస్తుందని చెబుతున్నారు లైంగిక నిపుణులు.

శృంగారానికి ముందు తమను తాము ప్రేరేపించుకోకుండా అయిష్టంగా చర్యలోకి దిగడం సరైన పద్ధతి కాదని అంటున్నారు.  కొన్నిసార్లు ఒక భాగస్వామి సరే అందని, ఒక భాగస్వామి వద్దు అన్నప్పుడు ఏం చేయాలి? అనేదానిపై లైంగిక నిపుణులు సలహాలు సూచనలు ఇస్తున్నారు. మరికొంతమంది భాగస్వామి కోరారని.. తమ పరిస్థితి అర్థం చేసుకోకుండా సరే అంటూ రొమాన్స్ చేస్తుంటారు.

భాగస్వామితో రొమాన్స్ చేయడానికి ముందు.. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా మీరు రొమాన్స్ చేసుకోవాలని భావిస్తున్నారా? పెళ్లికి ముందు రొమాన్స్ అంటే ఎంతో ఇష్టంగా ఫీల్ అయ్యేవారు ఎంతోమంది ఉంటారు. అదే పెళ్లి అయ్యాక.. క్రమక్రమంగా భాగస్వామితో రొమాన్స్ చేసేందుకు పెద్దగా ఆసక్తిని కనపర్చరు. వారిలో శృంగార వాంఛ తగ్గిపోతుంది. 

అది మహిళ లేదా మగాళ్లు ఎవరైనా కావొచ్చు. ఇద్దరిలోనూ ఒకేరకమైన భావన ఉంటుంది. ఇక మహిళల్లో అయితే పెళ్లి తర్వాత లైంగిక వాంఛ తగ్గిపోతుంది. అదే పిల్లలు పుట్టిన తర్వాత మరింత తగ్గిపోతుంది. ఎందుకంటే.. పిల్లలు పుట్టాక వారికోసమే సమయమంతా కేటాయిస్తుంటారు. దాంతో లైంగిక వాంఛ పెద్దగా వారిలో కలగదని అంటున్నారు నిపుణులు. పిల్లలతోనే ఉండే మహిళలు తమ భాగస్వామితో కలిసి రొమాన్స్ చేయాలనే భావన మళ్లీ రావడం కష్టమే.. ఆసక్తి చూపరు.

భాగస్వాములిద్దరిలో నిజమైన ప్రేమ.. అంటే ఒకరిపై మరొకరికి అమితమైన ఆకర్షణ ఉంటే.. అలాంటివారిలో మళ్లీ లైంగిక వాంఛను రేకిత్తిస్తుందని చెబుతున్నారు సెక్సాలిస్టులు. చాలామంది భాగస్వాముల్లో ఎక్కువగా రొమాన్స్ చేసుకోవడమనేది ఇద్దరిలోనూ ఒకేసారి పుట్టదు. వారిలో ఒకరికి లైంగిక వాంఛ కలిగితే మరొకరు తమను తాము ప్రేరేపించుకుని ఆ క్షణాన్ని ఆస్వాధించేందుకు ఆరాటపడుతుంటారు. చాలామంది జంటల్లో లైంగిక చర్య అనేది బలవంతం నుంచే మొదలువుతుందని తమ అధ్యయనంలో రుజువైందని లైంగిక నిపుణులు పేర్కొన్నారు. 

మరో విషయం ఏమిటంటే.. భాగస్వాముల్లో ఏ ఒక్కరికి లైంగిక కోరిక ఆ క్షణంలో కలగకపోయినా దూరంగా ఉండేందుకు ఇష్టపడతారు. అది మరొకరిలో భాగస్వామిపై అయిష్టాన్ని పెంచే అవకాశం ఉందని అంటున్నారు. భాగస్వామి స్థితిని గౌరవించి వారికి తగినట్టుగా ప్రవర్తించినప్పుడే వారిలో శృంగారమనే అనుభూతిని ఆస్వాధించవచ్చునని చెబుతున్నారు. ఇక్కడ.. ఇద్దరి భాగస్వాముల్లో ఒకరిపై మరొకరు గౌరవించుకోనేలా ఉండాలి. మీ భాగస్వామి మంచి వ్యక్తి అయితే.. రిలేషన్ పిప్‌లోనూ బాధ్యతగా వ్యవహరిస్తారు. శృంగారం కోసం మిమ్మల్ని ఒత్తిడి చేయరు.

ప్రత్యేకించి పిల్లలతో పాటు ఉన్న సమయంలో ఎంతో బాధ్యతగా ప్రవర్తిస్తారు. భౌతికంగా ఇద్దరిలోనూ ఒకేరకమైన భావన ఉన్నప్పుడే రొమాన్స్ అనేది సంజీవనిలా నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని అంటున్నారు. మీ జీవిత భాగస్వామితో సంబంధం రాబోయే నెలలు, సంవత్సరాలు.. దశాబ్దాలుగా ఒక స్నేహపూర్వక సంబంధంగా మారాలని మీరు నిజంగా విశ్వసిస్తే.. మీరు ఈ విషయంలో ముందుకు వెళ్లొచ్చు. మీ లైంగిక సంబంధం కాలక్రమేణా వృద్ధి చెందడానికి ఒకరకమైన లైంగిక జీవితం అవసరమని మీ మనస్సు గట్టిగా కోరుకుంటే మాత్రం.. ఏమాత్రం ఆలోచించకుండా భాగస్వామితో కలిసి లైంగిక ఆనందాన్ని ఆశ్వాదించండని సెక్సాలిజిస్టులు సూచిస్తున్నారు.  

Read More>>వైసీపీ ఎమ్మెల్యే రజనీ కారుపై రాళ్లదాడి..గుంటూరులో ఉద్రిక్తత