ఎక్కువసేపు కూర్చుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలెక్కువ, కాసేపు నడవడమే పరిష్కారం: స్టడీ

కదలకుండా ఎక్కువ సేపు ఒకేచోట కూర్చోవడం ఆరోగ్యానికి హానికరమా? దాని వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం

ఎక్కువసేపు కూర్చుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలెక్కువ, కాసేపు నడవడమే పరిష్కారం: స్టడీ

కదలకుండా ఎక్కువ సేపు ఒకేచోట కూర్చోవడం ఆరోగ్యానికి హానికరమా? దాని వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం

కదలకుండా ఎక్కువ సేపు ఒకేచోట కూర్చోవడం ఆరోగ్యానికి హానికరమా? దాని వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందా? అంటే అవుననే అంటోంది తాజా అధ్యయనం. గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని అధ్యయనంలో తేలింది. ఒకేచోట గంటల తరబడి కూర్చోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని అధ్యయనంలో వెల్లడైంది. మంత్లీ మెడికల్ జర్నల్ జామా అంకాలజీ(jama oncology) లో ఓ ఆర్టికల్ ని పబ్లిష్ చేశారు. ఎక్కువ సేపు కూర్చోవడం కలిగే అనర్థాలను, దానివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని అందులో వివరించారు.

కంప్యూటర్, ల్యాప్ టాప్ కి అతుక్కుపోతున్నారా? అయితే జాగ్రత్త
నేడు జీవనశైలి మారిపోయింది. కంప్యూటర్, ల్యాప్ టాప్ ల ముందు ఎక్కువసేపు కూర్చునే జాబ్స్ వచ్చాయి. శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది. ఎక్సర్ సైజులు చెయ్యడం లేదు. కనీసం వాకింగ్ కూడా చెయ్యని వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి జీవన శైలి కారణంగా క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతోందని పరిశోధకులు తెలిపారు. అది మరణానికి దారి తీస్తుందన్నారు.

Sit Less Move More:
క్యాన్సర్ వచ్చే రిస్క్ ని తగ్గించుకోవడానికి చిట్కా కూడా చెప్పారు. ప్రతి రోజూ కనీసం 30 నిమిషాల పాటు వాక్(నడక) చేయాలని తెలిపారు. ఇలా వాక్ చేయడం ద్వారా క్యాన్సర్ వచ్చే రిస్క్ 31శాతం వరకు తగ్గుతుందన్నారు. మొత్తంగా చెప్పాలనుకున్న ముఖ్య విషయం ఏంటంటే, Sit Less Move More, అంటే తక్కువ సేపు కూర్చో, ఎక్కువ సేపు తిరుగు. టెక్సాస్ యూనివర్సిటీలోని ఎండీ అండర్ సన్ కేన్సర్ సెంటర్ లో క్లినికల్ క్యాన్సర్ నివారణ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుసాన్ గిల్ క్రిస్ట్ నేతృత్వంలో ఈ రీసెర్చ్ చేశారు.

నడక ఆరోగ్యంగా ఉంచుతుంది:
పనిలో ఎంత బిజీగా ఉన్నప్పట్టికీ వాకింగ్ చేయడం మర్చిపోకూడదని డాక్టర్ గిల్ క్రిస్ట్ చెప్పారు. ఇంట్లో ఉన్న సమయంలోనూ దీన్ని కచ్చితంగా ఆచరించాలన్నారు. ఫోన్ లో మాట్లాడేటప్పుడు కూర్చుని కాకుండా నడుస్తూ మాట్లాడటం శ్రేయస్కరం అన్నారు. అలాగే మెట్లు ఎక్కడం దిగడం చేయడం ద్వారా శరీరాన్ని ఫిట్ గా, హెల్తీగా ఉంచుకోవచ్చని చెప్పారు.

వాకింగ్, ఎక్సర్ సైజ్ చేసేవారిలో క్యాన్సర్ రిస్క్ తక్కువ:
2009 నుంచి 2013 మధ్యలో 8వేల మందిపై స్టడీ చేశారు. వీరిలో కదలకుండా, ఎలాంటి ఎక్సర్ సైజులు చేయకుండా ఒకేచోట ఎక్కువసేపు కూర్చున్న వారిలో 82శాతం మంది క్యాన్సర్ తో చనిపోయినట్టు పరిశోధకులు గుర్తించారు. కాగా ఎక్కువ సేపు కూర్చున్నప్పటికి కొందరు లైట్ ఎక్సర్ సైజులు చేశారు. అంటే వాకింగ్ అన్న మాట. దీంతో అలాంటి వారిలో క్యాన్సర్ వచ్చే రిస్క్ 8శాతం వరకు తగ్గింది. ఎక్కువ సేపు కూర్చున్నప్పటికీ కొందరు ప్రతిరోజూ 30 నిమిషాలు పాటు వాక్ చేశారు. అలాంటి వారిలో క్యాన్సర్ వచ్చే రిస్క్ 31శాతం తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు. సో, జీవితంలో వాకింగ్, ఎక్సర్ సైజులు ఓ భాగం కావాలన్న మాట. హెల్తీగా, ఫిట్ గా ఉండాలంటే డైలీ చిన్నపాటి ఎక్సర్ సైజులు చేయడాన్ని మస్ట్ గా చేసుకోవడం మంచిది.