స్మోకింగ్ చేయనివారిలో కంటే అదేపనిగా సిగరెట్ తాగేవారిలోనే కరోనా తీవ్రలక్షణాలు ఎక్కువ!

స్మోకింగ్ చేయనివారిలో కంటే అదేపనిగా సిగరెట్ తాగేవారిలోనే కరోనా తీవ్రలక్షణాలు ఎక్కువ!

Smokers Wider Range Of COVID-19 Symptoms : స్మోకింగ్ అలవాటు ఉందా? తస్మాత్ జాగ్రత్త.. అసలే కరోనా సీజన్.. సిగరెట్ అలవాటు ఉంటే తొందరగా మానుకోండి.. లేదంటే కరోనా బారినపడే ప్రమాదం ఎక్కువ అంటున్నారు వైద్యనిపుణులు. వాస్తవానికి స్మోకింగ్ చేయనివారిలో కంటే అదేపనిగా స్మోకింగ్ చేసేవారిలోనే కరోనా తీవ్ర లక్షణాలు ఉంటాయంట.. ఇటీవలే ఓ కొత్త అధ్యయనంలో తేలింది. King’s College Londonకు చెందిన కొత్త పరిశోధనలో కరోనా తీవ్ర లక్షణాలకు స్మోకింగ్ అలవాటుతో సంబంధం ఉందని రీసెర్చర్లు తేల్చేశారు. స్వీయ నివేదిత ZoE Covid Symptom Study యాప్ డేటా ఆధారంగా విశ్లేషించారు.

ప్రాథమిక అధ్యయనాల్లో కూడా కరోనా తీవ్ర లక్షణాలు స్మోకింగ్ ఎక్కువగా చేసేవారిలోనే ఉన్నట్టు నిర్ధారణకు వచ్చారు. కానీ, ఇప్పటికీ చాలామంది నిపుణుల్లో దీనిపై అనేక సందేహాలు, ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. స్మోకింగ్ అలవాటు లేనివారిలో కంటే.. పొగాకు ఉత్పత్తులు వాడేవారే ఎక్కువగా కరోనా తీవ్ర లక్షణాలతో ఆస్పత్రిపాలవుతున్నారంట.. మార్చి 24 నుంచి ఏప్రిల్ 23, 2020 మధ్య ZOE COVID యాప్ డేటాను పరిశోధకులు అధ్యయనం చేశారు.. ఇందులో 2,401,982 మంది పాల్గొన్నవారు స్వయంగా చెప్పిన విషయాల ఆధారంగా డేటాపై విశ్లేషించారు.

వీరిలో మొత్తంగా 11శాతం ధూమపానం అలావాటు ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు. వీరిలోనే 14శాతం కరోనా తీవ్ర లక్షణాలు అధికంగా ఉన్నట్టు గుర్తించారు. వాటిలో నిరంతర దగ్గు, శ్వాసతీసుకోలేకపోవడం, జ్వరం వంటి లక్షణాల్లో తీవ్రత ఎక్కువగా ఉందని తేల్చేశారు. స్మోకర్లలో 29శాతం మందిలో ఇప్పటికి గుర్తించని కరోనా కొత్త లక్షణాలు ఉండే అవకాశం ఉంది. అలాగే 50శాతం మందిలో 10 కంటే ఎక్కువగా కరోనా లక్షణాలు కనిపించవచ్చునని డేటా పేర్కొంది. కరోనా అదనపు లక్షణాల్లో ఎక్కువగా రుచి, వాసన కోల్పోవడం, కండరాల నొప్పులు, డయేరియా వంటి లక్షణాలు అదనంగా ఉన్నాయని గుర్తించారు.