కరోనా వైరస్ ఎలా పుట్టింది? పాముల నుంచి మనుషుల్లోకి ఎలా?

  • Published By: sreehari ,Published On : January 25, 2020 / 10:19 AM IST
కరోనా వైరస్ ఎలా పుట్టింది? పాముల నుంచి మనుషుల్లోకి ఎలా?

కరోనా వైరస్.. ఇదో ప్రాణాంతక వైరస్.. దీని పేరు వింటే చాలు.. ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తోంది. ఎప్పుడు ఏ క్షణంలో ఈ వైరస్ ఎటాక్ చేస్తుందోనన్న భయమే అందరిని బెంబేలిత్తిస్తోంది. డేంజరస్ వైరస్ వేగంగా విజృంభిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది. పొరుగు దేశమైన చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ఈ #CoronaVirus  వందల మందికి సోకింది. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకూ 25మందికి పైగా మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. 

చైనాలో పుట్టిన ఈ వైరస్.. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిస్తూ థాయ్ లాండ్, జపాన్, దక్షిణ కొరియా, సౌదీ వరకు పాకింది. అసలు ఈ వైరస్ ఎలా పుట్టింది? ఏ జంతువు నుంచి మనుషుల్లో సంక్రమించింది అనేది అంతు చిక్కడం లేదు. #CoronaVirus ఎలా వ్యాప్తి చెందుతుంది అనేదానిపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్.. పాములు నుంచే సంక్రమించిందంటూ కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

కరోనా వైరస్ మూలం ఏంటి?:
కరోనా వైరస్‌కు సంబంధించిన కొన్ని కీలక విషయాలను పరిశీలిస్తే.. కరోనా వైరస్ పుట్టుక పాముల నుంచే సంక్రమించింది అనడానికి ఎక్కువ ఆధారాలు కనిపిస్తున్నాయి.అయితే, పాములకు మనుషులకు సంబంధమేంటి? పాముల నుంచి మనుషులకు ఎలా ఈ వైరస్ సంక్రమించిందంటే.. చైనాలోని వుహాన్ సిటీలో ఎక్కువగా పాములను ఆహారంగా తింటుంటారు. అక్కడి మార్కెట్లలో చేపలు, పందులు, గాడిద మాంసంతో పాటు పాముల మాంసం కూడా అమ్ముతుంటారు.
Read Also : సైంటిస్టులు కనిపెట్టేశారు: #Coronavirus వెనుక షాకింగ్ రీజన్స్!

ఆ పాముల మాంసం తినడం ద్వారా వాటిలోని వైరస్ మనుషుల్లోకి సంక్రమించినట్టు ఇప్పటికే చైనాలోని పెకింగ్​ యూనివర్సిటీ ఆఫ్​ హెల్త్​ సైన్స్​ సెంటర్​ తమ అధ్యయనంలో వెల్లడించింది. గబ్బిలాల్లో ఉండే #CoronaVirus​ జీన్స్​ కాంబినేషన్​తో ఈ కొత్త కరోనా పుట్టుకొచ్చిందని సైంటిస్టులు తేల్చేశారు. పాముల్లోని జీన్స్​తోనూ వాటిని పోల్చి చూడగా, ఒకేలా ఉన్నట్టు గుర్తించారు. మనుషుల్లో సంక్రమణకు ముందుగా పాముల్లోనే ఈ వైరస్​ ఎక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

చైనా క్రాయిట్, కోబ్రా పాముల్లో ఇదే వైరస్ :
చైనాలో ఎక్కువగా కనిపించే పాముల్లో క్రాయిట్ , చైనీస్ కోబ్రాల నుంచే కరోనా వైరస్ పుట్టుకొచ్చినట్టు కొత్త అధ్యయనం చెబుతోంది. వాస్తవానికి ఈ పాముల నుంచే వైరస్ మనుషుల్లోకి సంక్రమించినట్టు తెలిపింది. అందులోనూ వింటర్ సీజన్ కావడంతో వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతోందని పరిశోధకులు అంటున్నారు. తైవానీస్ క్రైట్ లేదా చైనీస్ క్రైట్ అని కూడా పిలిచే అనేక పాము జాతుల్లో బ్యాండెడ్ క్రైట్ (Bungarus multicinctus), మధ్య దక్షిణ చైనా, ఆగ్నేయాసియాలో చాలావరకు కనిపించే ఎలాపిడ్ పాముల జాతులు ఎంతో విషపూరితమైనవి.

ఈ విషపూరితమైన పాములకు చైనా మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ పాములను ఎంతో ఇష్టంగా తింటుంటుంటారు. అత్యంత ప్రమాదకరమైన ఈ విషపూరిత పాములు #ChinaSnakes తమ ఆహారంగా అడవుల్లో #Bats గబ్బిలాలను వేటాడి తిని జీవిస్తుంటాయి. గబ్బిలాల్లో ఉండే ఈ ప్రాణాంతక వైరస్.. పాములు వాటిని తినడం ద్వారా సంక్రమించి.. ఆ పాముల మాంసాన్ని తిన్న మనుషుల్లోకి కూడా వైరస్ పాకినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కరోనా వైరస్ అంటే ఏంటి? ఆ పేరు ఎలా వచ్చింది?:
కరోనా వైరస్ అనేది.. ఒక ఆకారం నుంచి పుట్టింది. ఇది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఉపయోగించి పరీక్షించినప్పుడు.. కిరీటం లేదా సౌర కరోనాను పోలి ఉంటుంది. కిరీటం ఆకారం నిర్మాణ వివరాల ఆధారంగా కరోనావైరస్ పేరు పెట్టారు. ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపిక్ ఫొటో.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (NIAID), మిడిల్ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనావైరస్ (#MERS-CoV)లో నిర్ధారించారు. కరోనా వైరస్.. గాలి ద్వారా వ్యాప్తిస్తుంది. ప్రధానంగా క్షీరదాలు, పక్షుల ఎగువ శ్వాసకోశ, జీర్ణశయాంతర ప్రేగులకు సోకుతుంది. కరోనావైరస్ సోకినవారిలో ప్రారంభంలో తేలికపాటి ఫ్లూ లాంటి లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి.

గబ్బిలాల నుంచి సంక్రమణ :
SARS-CoV , #MERS-CoV అనే ఈ రెండు వైరస్ లు.. గాలి ద్వారా శ్వాసనాళల్లోకి వేగంగా వ్యాప్తి చెందుతాయి. తద్వారా మానువుల్లో తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యానికి దారితీస్తుంది. ఈ కొత్త #2019-nCov కారణంగా SARS-CoV , MERS-CoV ఒకే రకమైన లక్షణాలు కనిపిస్తాయి. దురదృష్టవశాత్తూ..కరోనావైరస్ సంక్రమణకు వ్యాక్సిన్ లేదా యాంటీవైరల్ ట్రీట్ మెంట్ అందుబాటులో లేదు.

#SARS, #MERS అనే ఈ రెండు వైరస్ లు జంతువుల నుంచి సంక్రమించే అంటువ్యాధులుగా చెబుతారు. అంటే.. జంతువుల నుంచి నేరుగా ఈ వైరస్ మనుషులకు సోకుతాయి. తద్వారా ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది.కొన్నిఅధ్యయనాల ప్రకారం.. పరిశీలిస్తే.. ఈ #SARS, #MERS అనే రెండు వైరస్ లకు మూలం గబ్బిలాలుగా చెబుతున్నాయి.
Read Also : తెలిస్తే షాక్ అవుతారు: #CoronaBeerVirus కోసం ఇండియన్స్ సెర్చింగ్!

కానీ, వైరస్ కోల్డ్-బ్లడెడ్, వామ్-బ్లడెడ్ జంతువుల్లో రెండింటికీ ఎలా సంక్రమణ జరిగింది అనేది మిస్టరీగా మారింది. పరిశోధకులు, ప్రయోగాల ద్వారా వైరస్ మూలాన్ని ధృవీకరించాల్సి ఉంది. పాములలో 2019-nCoV వైరస్  సీక్వెన్స్ కోసం శోధించాల్సి ఉంది. వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుంచి సీఫుడ్ మార్కెట్ మూతపడింది.

దీంతో కొత్త వైరస్ మూల జంతువును కనుగొనడం పెద్ద సవాలుగా మారింది. #AnimalVirus వైరస్ మూలాన్ని నిర్ధారించడానికి మార్కెట్లో విక్రయించే జంతువుల నుంచి అడవి పాములు, గబ్బిలాల నుంచి #DNA నమూనా అవసరమని అంటున్నారు. దీని ఆధారంగా కరోనా వైరస్ అసలైన మూలాన్ని నిర్ధారించే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

Read Also : ‘కరోనా’ కాటేస్తుంది జాగ్రత్త :  విదేశాలకు వెళ్తున్నారా? వాయిదా వేసుకోండి!