కరోనాలో అంతుపట్టని 6 రకాల కొత్త లక్షణాలు ఇవే!

  • Published By: sreehari ,Published On : July 25, 2020 / 03:13 PM IST
కరోనాలో అంతుపట్టని 6 రకాల కొత్త లక్షణాలు ఇవే!

కరోనా వైరస్ లో అంతుపట్టని ఆరు రకాల లక్షణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చూడటానికి అచ్చం సాధారణ ఫ్లూ లక్షణాల మాదిరిగా కనిపించే ఈ లక్షణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ, నిర్లక్ష్యం చేయరాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ ఆరంభం నుంచి ఇప్పటివరకూ ఒక్కొక్కరిలో ఒక్కొలా కొత్త లక్షణాలు పుట్టుకొస్తున్నాయని ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది. ఇప్పుడు సింప్టమ్ ట్రాకర్ యాప్ లోని డేటా ఆధారంగా COVID-19 వ్యాధిపై కొత్త అధ్యయనం నిర్వహించింది. కరోనాలో మొత్తం 6 విభిన్న రకాల కొత్త లక్షణాలు ఉన్నాయని నిర్ధారించింది.

ఈ లక్షణాలను బట్టి కరోనా తీవ్రత ఎవరిలో ఎలా ఉంది? ఎలాంటి ట్రీట్ మెంట్ అవసరం అనేది నిర్ధారించవచ్చునని అంటోంది. లండన్‌లోని కింగ్స్ కాలేజీకి చెందిన పరిశోధకులు.. మార్చి, ఏప్రిల్ నెలల్లో COVID సింప్టమ్ ట్రాకర్ యాప్‌లో లక్షణాలను గుర్తించారు. సుమారు 1,600 యూకే, అమెరికా రోగుల నుండి డేటాను అధ్యయనం చేశారు.

సాధారణంగా, వైద్యులు దగ్గు, జ్వరం వంటి కరోనా ముఖ్య లక్షణాలుగా గుర్తించారు. COVID-19ను గుర్తించడానికి వాసన కోల్పోవడాన్ని ప్రధానంగా నిర్ధారించవచ్చు. COVID-19 ఆరు వేర్వేరు రకాల లక్షణాలు తీవ్రత మారుతూ ఉంటాయి. ఒక్కొక్కరిలో ఒక విధంగా లక్షణాలు కనిపిస్తాయని, కొంతమందిలో జ్వరం ఉంటే.. కొందరు జ్వరం లేకుండా, మరికొందరు వికారం, వాంతులు, కొంతమందిలో విరేచనాలు లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు.

కరోనాలో 6 రకాల కొత్త లక్షణాలు :
1. జ్వరం లేని ఫ్లూ లాంటిది : తలనొప్పి, వాసన కోల్పోవడం, కండరాల నొప్పులు, దగ్గు, గొంతు నొప్పి, ఛాతీ నొప్పి, జ్వరం ఉండదు.
2. జ్వరంతో ఫ్లూ లాంటిది : తలనొప్పి, వాసన కోల్పోవడం, దగ్గు, గొంతు నొప్పి, మొద్దుబారడం, జ్వరం, ఆకలి లేకపోవడం.
3. జీర్ణశయ సమస్యలు: తలనొప్పి, వాసన తగ్గడం, ఆకలి లేకపోవడం, విరేచనాలు, గొంతు నొప్పి, ఛాతీ నొప్పి, దగ్గు ఉండదు.
4. మొదట స్థాయిలో తీవ్రమైన అలసట: తలనొప్పి, వాసన కోల్పోవడం, దగ్గు, జ్వరం, మొద్దుబారడం, ఛాతీ నొప్పి, అలసట.
5. రెండో స్థాయిలో తీవ్రమైన గందరగోళం: తలనొప్పి, వాసన కోల్పోవడం, ఆకలి లేకపోవడం, దగ్గు, జ్వరం, మొద్దుబారడం, గొంతు నొప్పి, ఛాతీ నొప్పి, అలసట, గందరగోళం, కండరాల నొప్పి.
6. మూడో స్థాయిలో తీవ్రమైన ఉదర శ్వాసకోశ: తలనొప్పి, వాసన కోల్పోవడం, ఆకలి లేకపోవడం, దగ్గు, జ్వరం, మొద్దుబారడం, గొంతు నొప్పి, ఛాతీ నొప్పి, అలసట, గందరగోళం, కండరాల నొప్పి, శ్వాస ఆడకపోవడం, విరేచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉండొచ్చు.

మొదటి స్థాయిలో.. ‘జ్వరం లేని ఫ్లూ లాంటిది’ తలనొప్పి, వాసన కోల్పోవడం, కండరాల నొప్పులు, దగ్గు, గొంతు నొప్పి, ఛాతీ నొప్పితో సంబంధం కలిగి ఉంటుంది. ఈ స్థాయిలో ఉన్న రోగులకు ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ అవసరమయ్యే 1.5శాతం అవకాశం ఉంది.

రెండవ రకంలో.. ‘జ్వరంతో ఫ్లూ లాంటిది’, ఆకలి లేకపోవడం, తలనొప్పి, వాసన కోల్పోవడం, దగ్గు, గొంతు నొప్పి, మొద్దుబారడం, జ్వరం వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ స్థాయిలో 4.4శాతం మంది రోగులకు వెంటిలేటర్ అవసరమని పరిశోధకులు అంటున్నారు.

మూడవ రకంతో బాధపడుతున్న రోగులకు, ‘జీర్ణశయాంతర ప్రేగు’ అని పిలుస్తారు. వీరికి దగ్గు ఉండదు. తలనొప్పి, విరేచనాలు, వాసన కోల్పోవడం, ఆకలి లేకపోవడం, గొంతు నొప్పి, ఛాతీ నొప్పి ఉంటుంది. వీరిలో సుమారు 3.3% మందికి వెంటిలేటర్ అవసరం ఉంటుంది.

ఈ మూడు రకాల లక్షణాలు తీవ్రమైనవి :
నాల్గో రకంలో ‘తీవ్రమైన స్థాయి’ లో, రోగులు తలనొప్పి, వాసన కోల్పోవడం, దగ్గు, జ్వరం, మొద్దుబారడం, ఛాతీ నొప్పితో పాటు అలసట కనిపిస్తుంది. ఈ స్థాయిలో ఉన్న రోగులకు 8.6% చొప్పున వెంటిలేటర్ అవసరం ఉంటుంది.

ఐదో రకం లక్షణాల్లో .. ఆకలి, గొంతు, కండరాల నొప్పితో పాటు నాలుగవ రకం మాదిరి లక్షణాలు ఉంటాయి. ప్రధానంగా గందరగోళంగా అనిపిస్తుంది. అంటే మీరు ఎక్కడ ఉన్నారో, ఎక్కడ నివసిస్తున్నారో మీకు తెలియదు. మీరు ఆసుపత్రిలో ఉన్నా లేదా వెలుపల ఉన్నారా, మీ బంధువులు ఎవరు అని కన్ఫ్యూజ్ అయిపోతుంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ స్థాయిలో దాదాపు 10% మంది రోగులకు వెంటిలేటర్ అవసరం పడుతుంది.

COVID-19 అత్యంత తీవ్రమైన లక్షణాల్లో ఇదొకటి.. అన్ని లక్షణాలతో పాటు కడుపు నొప్పి, ఊపిరి తీసుకోలేకపోవడం, విరేచనాలు ఉంటాయి. ఈ రోగులలో దాదాపు 20% మందికి వెంటిలేటర్ అవసరం. Type-6 రోగులలో సగం మందితో పోలిస్తే.. Type-1 COVID-19 ఉన్న రోగులలో కేవలం 16% మందికి మాత్రమే ఆసుపత్రి అవసరమని యూకే పరిశోధకులు గుర్తించారు. ఈ ఆరు రకాల కరోనా కొత్త లక్షణాలను ముందుగానే గుర్తించి సకాలంలో వైద్యసాయం అందితే రోగి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.