స్విట్జర్లాండ్‌‌లో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న నర్సు మృతి

స్విట్జర్లాండ్‌‌లో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న నర్సు మృతి

Swiss nursing home resident dies after COVID-19 vaccine : స్విట్జర్లాండ్‌‌లో మొదటి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న నర్సింగ్ హోమ్ నివాసి మృతిచెందారు. అయితే ఆ నర్సు టీకా కారణంగా మృతిచెందాడా? లేదా అనేది ఎలాంటి స్పష్టత లేదు. దీనిపై విచారణకు స్విస్ డ్రగ్స్ రెగ్యులేటర్ స్విస్మెడిక్‌కు సూచించినట్టు అధికారి ఒకరు వెల్లడించారు. ఫైజర్- జర్మన్ భాగస్వామి బయోఎంటెక్ స్విట్జర్లాండ్‌లోని లూసర్న్‌లో ముందుగా వృద్ధులకు మొదటి షాట్ ప్రారంభించింది.

క్రిస్మస్ పండుగ సందర్భంగా కరోనావైరస్ వ్యాక్సిన్ అందుకున్న నర్సు.. గతంలో ఫ్లూ షాట్‌ తీసుకున్నప్పుడు కూడా ఇలానే రియాక్షన్ అయినట్టు నివేదిక పేర్కొంది. వ్యాక్సిన్ తీసుకున్న బాధితుడు మతిమరుపుతో పాటు మూత్రాశయం, కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు స్విస్ నివేదించింది. ఆ తర్వాత ఒక్కసారిగా బ్లడ్ ప్రెజర్ పడిపోయి పల్స్ పెరిగిందని నివేదిక తెలిపింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న కొన్ని గంటల తర్వాత ఇజ్రాయెల్ వ్యక్తి గుండెపోటుతో మరణించినట్లు సమాచారం.

స్విట్జర్లాండ్‌కు ఇప్పటివరకు 107,000 వ్యాక్సిన్ మోతాదులు అందాయి. వచ్చే ఏడాది నుంచి నెలకు 250,000 డోస్ లు అందుబాటులోకి వస్తాయని రాయిటర్స్ తెలిపింది. యూకే కరోనావైరస్ వేరియంట్ 5 కేసులు నమోదు కాగా.. దక్షిణాఫ్రికా వేరియంట్ రెండు కేసులు స్విస్ లో నమోదయ్యాయి.

వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ కారణంగా మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని స్విస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి చెప్పారు. ఇజ్రాయెల్‌లో, కరోనా టీకా పొందిన తరువాత 75 ఏళ్ల వ్యక్తి మరణించాడు. కానీ, అతడి మరణానికి కరోనా టీకాతో సంబంధం లేదని, గుండెపోటుతోనే మరణించినట్టు నివేదిక వెల్లడించింది.