కరోనా సోకకుండా ఇలా జాగ్రత్త పడండి

  • Published By: chvmurthy ,Published On : March 2, 2020 / 07:22 PM IST
కరోనా సోకకుండా ఇలా జాగ్రత్త పడండి

కరోనా వైరస్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనూ బయటపడింది. ఇన్నాళ్లు వ్యాధి లక్షణాలతో టెస్టులు చేయించుకున్న వాళ్ళంతా నెగెటివ్ రావటంతో హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ అయి ఇళ్లకు వెళ్లారు. ఇప్పుడు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేరిన ఒకసాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు  కరోనా పాజిటివ్ రావటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది.  

ఈక్రమంలో  కరోనా వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పలు  సూచనలు జారీచేసింది. తరచూ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని, ఒకసారి వాడిన మాస్క్‌లను తిరిగి ఉపయోగించరాదని పేర్కొంది. మరిన్ని వివరాలకు భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కంట్రోల్‌ రూం నెంబర్‌ 91-11-23978046 ను, ncov2019@gmail.com ను సంప్రదించాలని తెలిపింది. 
 

కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
⇒ చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి
⇒ సమూహాల్లో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
⇒ మీ కళ్లు, ముక్కు, నోటిని టచ్‌ చేయడం విరమించాలి
⇒ దగ్గు, తుమ్ములు వస్తే ముక్కు, నోటికి చేతులు అడ్డుపెట్టుకోవాలి
⇒ జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలి
⇒ మాస్క్‌ను ధరించే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి
⇒ ఒకసారి వాడిన మాస్క్‌లను తిరిగి వాడరాదు
⇒మాస్క్‌ ముందు భాగం ముట్టుకోకుండా వెనుకనుంచి తొలగించాలి
⇒ మాస్క్‌ను తీసిన వెంటనే డస్ట్‌బిన్‌లో పడవేయాలి