ఎత్తుగా, సన్నగా ఉండే అమ్మాయిల్లోనే ఈ సమస్య ఎక్కువ.. సంతానలేమీకి కారణం కావచ్చంట: సైంటిస్ట్‌ల హెచ్చరిక

  • Published By: sreehari ,Published On : March 10, 2020 / 11:57 AM IST
ఎత్తుగా, సన్నగా ఉండే అమ్మాయిల్లోనే ఈ సమస్య ఎక్కువ.. సంతానలేమీకి కారణం కావచ్చంట: సైంటిస్ట్‌ల హెచ్చరిక

సాధారణంగా ఎత్తుగా, సన్నగా ఉండే అమ్మాయిల్లో కామన్‌గా కనిపించే సమస్య ‘ఎండోమెట్రియోసిస్’. ఎండో మెట్రియం అనేది గర్భాశయం లోపలి పొరగా పిలుస్తారు. నెలసరి సమయంలో రక్తస్రావం ద్వారా ఇది బయటకు వచ్చేస్తుంది. ఈ పొర అండాశయ హార్మోన్లు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్‌కు సున్నితంగా ఉంటుంది. దీని కారణంగా వారిలో వంధ్యత్వం వస్తుంది.. అంటే.. సంతానోత్పత్తి ప్రాప్తి ఉండదు.. పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తక్కువని ఓ అధ్యయనం వెల్లడించింది. 10 మంది మహిళల్లో ఒకరికి ఎండోమెట్రియోసిస్ అనే ఈ సమస్య అధికంగా ఉంటుందని, అందుకే వారు గర్భం దాల్చడం చాలా కష్టమని తెలిపింది. 7ఏళ్ల నుంచి 13 ఏళ్ల వయస్సు ఉన్న 170,000 మంది బాలికలపై రీసెర్చ్ ఆధారంగా ఈ అధ్యయనంలో గుర్తించారు.  

ఎండోమెట్రియోసిస్‌కు సంబంధించిన లైంగిక హార్మోన్ oestrogen అధిక స్థాయిలో విడుదల కావడంతోనే ఈ సమస్య ఉత్పన్నమవుతుందిన రీసెర్చర్లు అభిప్రాయపడుతున్నారు. దీని కారణంగానే బాలికలు ఉన్నట్టుండి పొడవు పెరుగుతారని, గర్భాశయంలోని ఎండోమెట్రియోసి పొరపై కణాలు కూడా పెరిగిపోవడంతోనే ఈ సమస్య వస్తుందని తెలిపారు. అంతేకాదు.. అధిక మోతాదులో బాడీ మాస్ ఇండెక్స్ ఉన్న బాలికల్లో తక్కువ పొడవుతో పాటు అధిక బరువు కూడా ఉండే అవకాశం ఉంది. వీరిలో ఎండోమెట్రియోసిస్‌ సమస్య చాలా తక్కువగా ఉంటుందని అధ్యయనం తేల్చింది.

Denmark’s Center for Clinical Research and Preventionకు చెందిన రీసెర్చర్ జూలీ ఆరేస్ట్రప్.. ‘ఈ వ్యాధి అభివృద్ధి చెందుతున్న ఒక క్లిష్టమైన సమస్యగా చెప్పవచ్చు. మహిళలు తరచూ ఎన్నో ఏళ్ల ఆలస్యంగా ఈ సమస్యను ఎదుర్కొంటారు. మా అధ్యయనంలో గుర్తించిన ప్రకారం.. పిన్న వయస్సులోనే చాలామంది బాలికల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది’ అని ఆయన చెప్పారు. అంతేకాదు.. ఎండోమెట్రియోసిస్‌ కణాల పెరుగుదలను నెమ్మదించేలా చికిత్స తొందరగా చేసేందుకు వీలుంటుందని తెలిపారు.

ఇలాంటి సమస్యను ప్రపంచవ్యాప్తంగా 176 మిలియన్లమందిలో ఉందని, వారు జీవనశైలి ఆధారంగా కొన్నాళ్లు ఈ సమస్య తగ్గిపోతుందని, తద్వారా సంతాన ప్రాప్తి లేకపోవడానికి కారణమవుతుందని అధ్యయనం పేర్కొంది. గుండె జబ్బులు, స్త్రీ జననేంద్రియ క్యాన్సర్‌లతో సహా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే మహిళల ప్రమాదాన్ని కూడా ఇది పెంచుతుందని హెచ్చరిస్తోంది.